Tuesday, July 09, 2013

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,P.సుశీల,B.వసంత  
తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ

పల్లవి::

మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
చందమామ రావే..జాబిల్లి రావే
కొండెక్కి రావే..గోగుపూలు తేవే
చందమామ రావే..జాబిల్లి రావే
కొండెక్కి రావే..గోగుపూలు తేవే
చందమామ రావే..జాబిల్లి రావే 

చరణం::1  

చలువ..చందనములు..పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య..జాబిల్లి రావే
చలువ చందనములు..పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే

కలువ చెలువ కలలు..విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు..విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని..గోగుపూలు తేవే
చందమామ రావే..జాబిల్లి రావే
కొండెక్కి రావే..గోగుపూలు తేవే
చందమామ రావే..జాబిల్లి రావే 

చరణం::2  

మునిజన మానసమోహిని యోగిని..బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని..బృందావనం
మునిజన మానసమోహిని యోగిని..బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని..బృందావనం

రాధామాధవ గాథల..రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద..మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద..మంజీరము 
బృందావనం..బృందావనం..బృందావనం

హే..కృష్ణా..ముకుందా..ఆ..మురారీ
కృష్ణా..ముకుందా..మురారీ 
జయ..కృష్ణా..ముకుందా..మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే..జాబిల్లి రావే
కొండెక్కి రావే..గోగుపూలు తేవే
చందమామ రావే..జాబిల్లి రావే 

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,P.సుశీల,G.ఆనంద్  
తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ

పల్లవి::

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ..అది ఆహా ఓహో అంటున్నదీ 

చరణం::1

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా

పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా..ఆ

చరణం::2

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో..అంటూన్నదీ
అది ఆహా ఓహో..అంటూన్నదీ 

చరణం::3

రాసలీలా..రాధహేల
రాసలీలా..రాధహేల
రసమయమై..సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా లా లా లా లా లా

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ

పల్లవి::

విధాత తలపున..ప్రభవించినది
అనాది జీవన వేదం..ఓం
ప్రాణనాడులకు..స్పందననొసగిన 
ఆది ప్రణవనాదం..ఓం

కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వ రూప..విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం..ఆ

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం..ఈ గీతం

విరించినై విరచించితిని..ఈ కవనం
విపంచినై వినిపించితిని..ఈ గీతం 

చరణం::1

ప్రాగ్దిశ వీణియపైన..దినకర 
మయూఖ..తంత్రులపైన
జాగృత విహంగ..తతులే 
వినీల గగనపు..వేదికపైన
ప్రాగ్దిశ వీణియపైన..దినకర 
మయూఖ..తంత్రులపైన
జాగృత విహంగ..తతులే 
వినీల గగనపు..వేదికపైన 

పలికిన కిలకిల..ధ్వనముల
స్వరగతి జగతికి..శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది..భాష్యముగా  

విరించినై విరచించితిని..ఈ కవనం
విపంచినై వినిపించితిని..ఈ గీతం  

చరణం::2

జనించు ప్రతి..శిశుగళమున 
పలికిన జీవన..నాద తరంగం
చేతన పొందిన..స్పందన ధ్వనించు 
హృదయ..మృదంగ ధ్వానం
జనించు ప్రతి..శిశుగళమున 
పలికిన జీవన..నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు 
హృదయ..మృదంగ ధ్వానం

అనాది రాగం..ఆదితాళమున
అనంత జీవన..వాహినిగా
సాగిన సృష్టి..విలాసమునే 
విరించినై విరచించితిని..ఈ కవనం
విపంచినై వినిపించితిని..ఈ గీతం 

నా ఉఛ్వాసం..కవనం
నా నిశ్వాసం..గానం  
నా ఉఛ్వాసం..కవనం
నా నిశ్వాసం..గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం..ఈ గీతం