Sunday, January 03, 2010

విచిత్ర దాంపత్యం--1971::కానడ::రాగం

సంగీతం::అశ్వద్ధామ
రచన::సినారె 
గానం::P.సుశీల 
కానడ::రాగం 

పల్లవి::

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా

చరణం::1

సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి..పరమేశునికై తపియించి
ఆ హరుమేన సగమై పరవశించిన 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..ఏఏ..

చరణం::2

నగకన్యగా తాను జనియించినా..జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా..జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా..తరళాత్మమైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతిపదములందు..నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతిసిగను దూకి..నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి..చలిత జీవన తరంగ రంగ గంగ
దవళాంశు కీర్తి గౌరి నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని మృతి యెరుగని..నిజమిది 

శ్రీ గౌరి శ్రీగౌరీవే..శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీగౌరి శ్రీగౌరియే..ఏఏ..

మా పల్లెలో గోపాలుడు--1985

సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె 
గానం::S.P.బాలు ,P.సుశీల 

పల్లవి::

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ..నీ ముంగిట ఆడాలనీ 
నీ వేడుక చూడాలనీ..నీ ముంగిట ఆడాలనీ 
ఎన్నెన్ని ఆశలతో..ఎగిరెగిరీ వచ్చానమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా

చరణం::1

రతనాలమేడలోన..నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా..నా అరిచేతులుంచాలని
రతనాలమేడలోన..నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా..నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను.ఊ...ఏమిటి చూస్తున్నాను?
ఎంతగా అనుకున్నాను..ఏమిటి చూస్తున్నాను?
పన్నీటి బతుకులోన..కన్నీటి మంటలేనా

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా 
నీ వేడుక చూడాలనీ..నీ ముంగిట ఆడాలనీ 
ఎన్నెన్ని ఆశలతో..గిరెగిరీ వచ్చానమ్మా

రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా
రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా
సహనం స్త్రీకి కవచమనీ..శాంతం అందుకు సాక్ష్యమని
సహనం స్త్రీకి కవచమనీ..శాంతం అందుకు సాక్ష్యమని
ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా
రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా

చరణం::2

గుండెరగిలిపోతూవుంటే..గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే..ముళ్ళు పూలు ఒకటేలే
గుండెరగిలిపోతూవుంటే..గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే..ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం..ఎక్కడో ఆవలితీరం
ఎదురుగా పొంగే సంద్రం..ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే..విధిరాత తప్పదులే

రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ..నీ ముంగిట ఆడాలనీ 
ఎన్నెన్ని ఆశలతో..ఎగిరెగిరీ వచ్చానమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా

Maa Pallelo Gopaludu--1985
Music::K.V.Mahadevan
Lyricist::C.Narayana Reddy
Singer's::S.P.Balu , P.Susheela

Raani ranamma aanaati navvulu evamma
Raani ranamma aaanati navvulu evamma
nee veduka chudaalani..nee mungita aadaalani
enenni aashalato..egiregiri vachchaanamma
raanee raanamma aanaati navvulu evamma

:::1

rathanaala medalona ninnoka..raaniga choodaalani
nee adugulu kandakundaa..naa arichethulunchaalani
enthagaa anukunnaanuu..emiti choostunnaanu 
enthagaa anukunnaanuu..emiti choostunnaanu 
panneeti bratukulona..kanneeti mantalenaa

Raani ranamma aaanati navvulu evamma..
nee veduka chudaalani..nee mungita aadaalani
enenni aashalato..egiregiri vachchaanamma

raanee raanamma raani kanneellu raaneeyammaa
raanee raanamma raani kanneellu raaneeyammaa
sahanam sthreeki kavachamani Shaantham anduku saakshyamani
sahanam sthreeki kavachamani Shaantham anduku saakshyamani
unnaanu mounamgaa kannulu daatani kanneerugaa
raanee raanamma raani kanneellu raaneeyammaa

:::2

gunde ragili pothoo unte goodu meda okatele
kaallu bandabaaripote mullu poolu okkatele
gunde ragili pothoo unte goodu meda okatele
kaallu bandabaaripote mullu poolu okkatele
edurugaa ponge sandram..ekkado aavali theeram
edurugaa ponge sandram..ekkado aavali theeram
edureetha aagadhule..vidhi raatha thappadule

Raani ranamma aaanati navvulu evamma
nee veduka chudaalani..nee mungita aadaalani
enenni aashalato..egiregiri vachchaanamma
raanee raanamma aanaati navvulu evamma