Monday, January 07, 2013

చందన--1974













సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::సినారె
గానం::S.జానకి   
తారాగణం::జయంతి, సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు ,శ్రీధర్   

పల్లవి::

నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ 
ఆఆఆఆఆ..నిజం...నిప్పులాంటిది
ఆఆఆఆఆ..నిప్పులో..నడిచిన సీతలాంటిది
శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ

చరణం::1

ఆ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మనిషిని నడిపేది సత్యం..దేవుణ్ణీ నిలిపేది ధర్మం
మనిషిని నడిపేది సత్యం..దేవుణ్ణీ నిలిపేది ధర్మం
అందుకే ఉన్నారు...సూర్యచంద్రులు
అందుకే..ఏ..వానలు కురిసేదీ..పంటలు పండేదీ
ప్రాణాలు...నిలిచేదీ             
నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ  

చరణం::2

ఆ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
దుష్టశిక్షణా..ఆ..ధర్మరక్షణా..దుష్టశిక్షణా ధర్మరక్షణా
యుగయుగాలుగా...జరిగే యాగం
అందుకే పెరుగుతుంది..చేసుకున్న పుణ్యం
ఇక పాపం..బద్దలుకాకమానదూ
పాపి చిరాయువు...కానేరడూ
పాపి చిరాయువు...కానేరడూ 
          
నీరు పల్లమెరుగూ..నిజం దేవుడెరుగూ