ఇక్కడ పాట వినండి
సంగీతం::SP.కోదండపాణి
సాహిత్యం::శ్రీ.శ్రీ , వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల
Film Directed By::K.HemaambharadhgaraRao
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి.
:::::::::::::
బ్రతుకంత బాధ గా..కలలోని గాధ గా..
కన్నీటి ధారగా..కరగి పోయే..
తలచేది జరుగదూ..జరిగేది తెలియదూ..
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ..గుండెలు కోసీ..నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా
::::1
అందాలు సృష్టించినావు..దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు..దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే..ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా..ఆడియాశ చేసీ..
కొండంత ఆశా..ఆడియాశ చేసీ..పాతాళ లోకాన తోసేవులే..
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా
::::2
ఒక నాటి ఉద్యానవనమూ..నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ..నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు..హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా..శోకాల సంద్రాన ముంచేవులే
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ..గుండెలు కోసీ..నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ..ప్రాణము పోసీ..ఆడేవు నీకిది వేడుకా