Wednesday, May 19, 2010

విచిత్ర జీవితం--1978























సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
శ్రీ ఉమా లక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం::V. మధుసూధన రావు
గానం::P.సుశీల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ ,జయసుధ,మోహన్‌బాబు 

పల్లవి::

ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువ నీకు గురుతేనా..తెలుపుమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా 

చరణం::1

నీవు నాకు చేసిన బాస..నీటిమీద రాసిన రాత
నీవు నాకు చేసిన బాస..నీటిమీద రాసిన రాత
తాళి కట్టిన కలువకన్న..తళుకులొలికే తారమిన్న
రోజూ మారే రూపం నీది..రోజూ మారే రూపం నీది
మోజు పడిన పాపం నాది
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా

చరణం::2

కళలు మార్చి..కలలే చెరిపి 
మనువు మార్చి..మంటలు రేపి 
కళలు మార్చి..కలలే చెరిపి 
మనువు మార్చి..మంటలు రేపి
మచ్చపడిన సొగసు నీది..చిచ్చురేగిన మనసు నాది
కట్టగలవు మెడకో తాడు..కట్టగలవు మెడకో తాడు
కన్నె వలపుకే ఉరితాడు

ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువ నీకు గురుతేనా..తెలుపుమా
ఓ చంద్రమా..ఒకనాటి ప్రియతమా..ఆఆఆ   

Vichitra jeevitaM--1978
Music::Chakravarti
Lyrics::Veturi 
Sree umaa lakshmi kaMbains^ vaari
Dir::V.Madhusudana Rao
Singer's::Suseela
Cast::akkinaeni,vaaNiSree ,jayasudha,mOhan^baabu 

:::

O..chandramaa..okanaati priyatamaa
O..chandramaa..okanaati priyatamaa
O..chandramaa..okanaati priyatamaa
ee paeda kaluva neeku gurutaenaa..telupumaa
O..chandramaa..okanaati priyatamaa 

:::1

neevu naaku chesina baasa..neetimeeda raasina raata
neevu naaku chesina baasa..neetimeeda raasina raata
taali kattina kaluvakanna..talukulolike taaraminna
roju maare roopam needi..roju maare roopam needi
moju padina paapam naadi
O..chandramaa..okanaati priyatamaa

:::2

kalalu maarchi..kalale cheripi 
manuvu maarchi..mantalu repi 
kalalu maarchi..kalale cheripi 
manuvu maarchi..mantalu repi
machchapadina sogasu needi..chichchuregina manasu naadi
kattagalavu medako taadu..kattagalavu medako taadu
kanne valapuke uritaadu

O..chandramaa..okanaati priyatamaa
ee paeda kaluva neeku gurutenaa..telupumaa
O..chandramaa..okanaati priyatamaa..aaaaaaaa
   

విచిత్ర జీవితం--1978























సంగీతం::చక్రవర్తి
రచన::దాశరధి 
శ్రీ ఉమా లక్ష్మి కంబైన్స్ వారి
దర్శకత్వం::V. మధుసూధన రావు
గానం::S.P.బాలు
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ ,జయసుధ,మోహన్‌బాబు 


పల్లవి::

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని 

చరణం::1

ఎన్నేళ్ళు వేచింది మనసూ 
కన్నీటి సాగింది బ్రతుకూ
ఎన్నేళ్ళు వేచింది మనసూ 
కన్నీటి సాగింది బ్రతుకూ
ఈనాటి ఎకా౦త సమయం 
ఏ రేయి లేనంత మధురం 
చెలియా ఈ మౌన వేళ 
నన్ను అలవోలే చెలరేగి పోనీ 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని

చరణం::2

ఎవరైన ఏవేళనైనా
మనజాడ గమనించరాదు 
ఎవరైన ఏవేళనైనా
మనజాడ గమనించరాదు 
జగమేలు పరమాత్ముడైనా..ఆ.. 
మనజంట విడదీయరాదు..
నీకళ్ళలో నేను దాగీ
నిన్ను నా గుండెలో దాచుకోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని

చరణం::3

కావాలి ఎన్నెన్నో కనులూ
నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎన్నెన్నో కనులూ
నిను కరువారగా చూసుకోగా 
కావాలి ఎంతెంత కాలం..
తీపికలలన్ని పండించుకోగా
రగిలే ఈ హాయిలోనా 
నన్ను బతుకంత జీవించిపోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ 
ఈనాటితో మాసి పోనీ 
నీ నుదుట తిలకమ్ము దిద్ది 
నిత్య కల్యాణిగా చూసుకొని



Vichitra jeevitaM--1978
Music::Chakravarti
Lyrics::DaaSaradhi 
Sree umaa lakshmi kaMbains^ vaari
Dir::V.Madhusudana Rao
Singer's::baalu
Cast::akkinaeni,vaaNiSree ,jayasudha,mOhan^baabu 

::

innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 

innaalla ee mooga baadha
eenaatito maasi ponee
nee nuduta tilakammu diddi 


nitya kalyaanigaa choosukoni 



:::1

ennellu vechindi manasoo
kanneeti saagindi bratukoo
ennellu vechindi manasoo
kanneeti saagindi bratukoo
eenaati ekaanta samayam
e reyi lenanta madhuram
cheliyaa ee mauna veela
nannu alavole chelaregi ponee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 


:::2

evaraina evelanainaa
manajaada gamanincharaadu
evaraina evelanainaa
manajaada gamanincharaadu
jagamelu paramaatmudainaa..aa..
manajanta vidadeeyaraadu..
neekallalo nenu daagee
ninnu naa gundelo daachukonee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni 


:::3

kaavaali ennenno kanuloo
ninu karuvaaragaa choosukogaa
kaavaali ennenno kanuloo
ninu karuvaaragaa choosukogaa
kaavaali ententa kaalam..
teepikalalanni pandinchukogaa
ragile ee haayilonaa
nannu batukanta jeevinchiponee


innaalla ee mooga baadha 
eenaatito maasi ponee 
nee nuduta tilakammu diddi 
nitya kalyaanigaa choosukoni