Monday, January 06, 2014

గౌరి--1974సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు

పల్లవి::

చిఛీ ఛీఛీ..చిఛీ ఛీఛీ నవ్వు
ఏయ్..చిన్నారి పొన్నారి నవ్వు
ఇంచక్కని...తీయని నవ్వు 
ఏ...దివినుంచి తెచ్చావూ      
చిఛీ ఛీఛీ నవ్వు...హేయ్   
చిన్నారి పొన్నారి...నవ్వు
ఇంచక్కని తీయని...నవ్వు 
ఏ దివినుంచి...తెచ్చావూ
చిఛీ ఛీఛీ..నవ్వు..ఊఊఊ 

చరణం::1

ఇద్దరిని ముగ్గురుగా...చేశావూ
మా ముద్దులను పంచుకోను..వచ్చావూ
పాల బుగ్గలు అమ్మకు...యిచ్చి
పాల బుగ్గలు అమ్మకు...యిచ్చి
నీలి కన్నులు నాన్నకు..యివ్వు
చిఛీ చిఛీ ఛీఛీ నవ్వు...ఏయ్
న్నారి పొన్నారి...నవ్వూ..ఊఊఊ

చరణం::2

అల వల తల వ్రాయి...పలకలో
అలలుంటవి వలలుంటవి ముందు బ్రతుకులో
అల వల తల వ్రాయి...పలకలో
అలలుంటవి వలలుంటవి ముందు బ్రతుకులో
తలతోటి వాటిని...తప్పుకొనాలీ
తలతోటి వాటిని...తప్పుకొనాలీ
నెలవంకలా నువ్వు నిండుగా..పెరగాలీ  
చిఛీ చిఛీ ఛీఛీ నవ్వు...ఏయ్ 
చిన్నారి పొన్నారి...నవ్వు 
చిఛీ ఛీఛీ...నవ్వూ
ఇంచక్కని తీయని...నవ్వు 
ఏ దివినుంచి...తెచ్చావూ
చిఛీ ఛీఛీ..నవ్వు..ఊఊఊ