Friday, January 18, 2008

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::చక్రవర్తి,రామారావు బృందం


రా, రారా, రా, రా, రా, రా...
అటో..ఇటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి
ఇటో..అటో తేలిపోవాలి..అటో ఇటో తేలి పోవాలి

ఏకులాగ వచ్చావ్..నువు
మేకులాగ మారావ్..హటో దూర్‌ హటో
గెటవుట్‌...

అటో ఇటో..అటో ఇటో తేలి పోవాలి

నీ ముక్కు పిండేస్తాం..నీడొక్కచింపేస్తాం
నీ కళ్లు పీకేస్తాం..నీ కాళ్లు నరికేస్తాం
ముక్కు పిండేస్తాం, డొక్క చింపేస్తాం, కళ్లు పీకేస్తాం...
కాళ్లు నరికేస్తాం...

అటో ఇటో తేలి పోవాలి..అటో ఇటో తేలి పోవాలి

అటో ఇటో తేలిపోతుంది..
ఇక అమీ తుమీ తెలిసి పోతుంది
అద్దెకు తెచ్చిన గాడిదలు గుర్రాలౌతాయా
బాడుగకొచ్చిన బడుద్దాయిలు భరతం పడతారా!
నా భరతం పడతారా!
కొమ్ములూడ గొడతాను..కోరలు పీకేస్తాను
దమ్ములుంటె రమ్మను దుమ్ము రేగ కొడతాను
తా..తంతా..తంతా కలిపి తంతా...
తండ్రిని మించిన దైవం లేడను దేశంరా మనది

తండ్రిం శరణం గచ్ఛామి..తండ్రిం శరణం గచ్ఛామి!
మొగుడే భార్యకు పరమేశ్వరుడను దేశం గద మనది
మొగుడుం శురణ గచ్ఛామి..మొగుడుం శరణం గచ్ఛామి
ఇంటిల్లిపాది ఇంపుగ వుండే సంఘంరా మనది
కలసీ, మెలసీ కమ్మగ బతికిన ఇంటికి సాటేది..
మన ఇంటికి సాటేదీ ...
అటో ఇటో తేల్చి పారేశావ్‌ ...
ఆరని వెలుగు ఇంట్లో నిలపావు..నా రాజా
ఇల్లు నిలిపావు..నా ఇల్లు నిలిపావు ...

శారద--1973::చారుకేశి::రాగం



















సంగీతం :: చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


రాగం::చారుకేశి
హిందుస్తానీ కర్నాటక !

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా


కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది
నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా !!

మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగా
నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా !!

శారద--1973




















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల


బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా

నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార

బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి
ఇన్నాళ్లు చేశాను ఆరాధనా..ఇన్నాళ్లు చేశాను ఆరాధనా
దాని ఫలితమా నాకీ ఆవేదనా

బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా

శారద: :నందకిషోరా..నవనీత చోరా
బృందావన సంచార

బృందం:: రాధాలోలా..గోపాలా..
గాన విలోలా యదుబాలా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

బృందం::ఆ ఆ ఆ....

మనిషిని చేసి..మనసెందుకిచ్చావు?
ఆ మనసును కోసే..మమత లెందుకు పెంచావు?

మనసులు పెనవేసి..మమతలు ముడివేసి
మగువకు పతి మనసే..కోవెలగా చేసి
ఆ కోవెల తలుపులు మూశావా?...

బృందం:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ కోవెల తలుపులు మూశావా?...
నువు..హాయిగ..కులుకుతు చూస్తున్నావా?

బృందం:: ఆ ఆ ఆ ఆ..

నీ గుడిలో గంటలు మోగినవి..నా గుండెల మంటలు రేగినవి

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ గుడిలో గంటలు మోగాలంటే..
నీ మెడలో మాలలు నిలవాలంటే..
నీ సన్నిధి దీపం వెలగాలంటే..
నే నమ్మిన దైవం నీవే అయితే..
నా గుండెల మంటలు ఆర్పాలి..
నా స్వామి చెంతకు చేర్చాలి..

బృందం:: రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
రాధాలోలా..గోపాలా
గాన విలోలా యదుబాలా
గోపాలా..గోపాలా..గోపాలా

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::V.రామకృష్ణ


శారద నను చేరగా
శారద నను చేరగా

ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఓ...శ్రావణ..నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా

ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి రూపమది ఇంద్ర చాపమది
ఏమి కోపమది చంద్ర తాపమది
ఏమి ఆ..హొయలూ!
ఏమి కులుకు..సెలఏటి పిలుపు..అది ఏమి అడుగు..
కలహంస నడుగు హోయ్..ఏమి ఆ..లయలూ!
కలగా కదిలే ఆ.. అందం
కలగా కదిలే..ఆ..అందం..
కావాలన్నది నా హౄదయం..
కావాలన్నదీ..నా హౄదయం..
ఓ...శ్రావణ నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా

నీలికళ్ళలో నా నీడ చూసుకొని
పాలనవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా!
చెండువోలే విరిదండవోలే నిను గుండె కద్దుకొని..నిండు ముద్దుగొని పరవశించేనా..
అలలైపోంగే అనురాగం
అలలైపోంగే అనురాగం
పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం
ఓ...శ్రావణా..నీరదా..శారదా...

శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బు
గ్గా

శారద--1973




















సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి

దర్శకత్వం::K.విశ్వనాధ్
గానం::ఘంటసాల,P.సుశీల


పల్లవి::

శోభన్:: కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి
శారద:: ఆ వధువు వలపే విరిసేది ఈనాడే తొలిసారి
శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::1

శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?
శోభన్:: వెన్నెల కాచే మోమునుదాచి..చీకటి చేసేవు ఎందుకని?

శారద:: ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా..ఈ మోము జాబిలి దేనికని?

శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?
శోభన్:: అల్లరి చూపులతోనే నను..అల్లుకు పోయే వెందుకని?

శారద:: ఆ..అల్లికలోనే తీయని విడదీయని బంధం వున్నదని..

శోభన్:: అందుకే అందుకే తొలిరేయి..అంతహాయి అంతహాయి అంతహాయి

చరణం::2

శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?
శోభన్::నీ పెదవీ కనగానే..నా పెదవీ పులకించింది ఎందుకని?

శారద:: విడి విడిగా వుండలేక..విడి విడిగా వుండలేక..
పెదవులు రెండూ...అందుకని

శోభన్:: ఎదురు చూసే పూలపానుపు ఓపలేక..ఉసురుసురన్నది ఎందుకని?
ఇద్దరినీ తన కౌగిలిలో..ముద్దు ముద్దుగా...అందుకని

శారద:: అందుకే అందుకే తొలి రేయి..అంత హాయి..అంత హాయి!
ఇద్దరు: అంత హాయి..అంత హాయి..అంత హాయి..అంత హాయి!

శారద--1973

























సంగీతం::చక్రవర్తి
రచన
::దాశరథి
గానం
::V.రామక్రిష్ణ ,P.సుశీల

శ్రీమతిగారికి తీరనివేళా
శ్రీవారి చెంతకు చేరని వేళా
శ్రీమతిగారికి తీరనివేళా
శ్రీవారి చెంతకు చేరని వేళా
చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు
మల్లెపూలు ఎందుకు మంచిగంధం ఎందుకు
ఎందుకూ.....ఇంకెందుకూ

శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లెతావి చెప్పవే మంచి మాట చెప్పవే
చెప్పవే....చెప్పవే....

ఓ...చందమామా...
ఓ...చల్లగాలీ...
ఓ...చందమామా...
ఓ...చల్లగాలీ...
నాపైనా మీరైనా
చూపాలి జాలీ...
నాపైనా మీరైనా
చూపాలి జాలీ...
లలలలలలల హహహహా
బెట్టుచేసే అమ్మగారిని
బెట్టుచేసే అమ్మగారిని
గుట్టుగా నా చెంత చేర్చాలి
మీరే చెంత చేర్చాలి

శ్రీమతిగారికి తీరని వేళ
శ్రీవరికెందుకు ఈగోలా
చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే
మల్లెతావి చెప్పవే మంచి మాట చెప్పవే
చెప్పవే....చెప్పవే....

ఓ...దేవదేవా...
ఓ...ధీనబంధో...
ఓ...దేవదేవా
ఓ...దీనబంధో
ఒకసారి మావారి ఈ బాధ చూడు
ఒకసారి మావారి ఈ బాధ చూడు
ఆ...ఆ...ఆ...మ్మ మ్మ మ్మహూ...
అలకలోనే అలసిపోతే
అలకలోనే అలసిపోతే
ఇంతరేయి నవ్విపోయేను
ఎంతో చిన్నబోయేనూ...

శ్రీమతిగారికి తీరినవేళా
శ్రీవారి చెంతకు చేరినవేళా
చల్లగాలి ఎందుకు
చందమామ ఎందుకు
మల్లెపోలు ఎందుకూ
మంచిగంధం ఎందుకు
ఎందుకూ...ఇంకెందుకూ
...