సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు,B.వసంత తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: ఆ..ఆ..ఆ పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్న కథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్న కల తీరే దారులు వెతికేనూ ఓ గువ్వలచెన్నా ఆ ఆ ఆ ఆ ..ఆ ఆ ఆ ఆ చరణం::1 గుళ్ళో నిను చూడలేకున్నా..ఓ గువ్వల చెన్న గుండెల్లో దాచుకున్నాలే..ఓ గువ్వలచెన్న ఆ..ఆ..ఆ యే సీమల తిరుగాడినా..ఓ గువ్వలచెన్న నీ దీవెనలందించాలన్నా..ఓ గువ్వలచెన్న ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ Sirivennela--1986 Music::K.V.Mahadevan Lyricis::Sirivennela Seetharama Shastry Singer's::S.P.Balasubrahmanyam,S.P.Sailaja
aa..aa..aa polimera daatipotunna o guvvala chenna porugooriki cheripotunna o guvvala chenna kathamaare rojulu koreroo o guvvala chenna kalateere daarulu vetikenoo o guvvala chenna aa..aa..aa..aa..aa..aa..aa..aa :::1 gullo ninu choodalekunna o guvvala chenna gundello daachukunnaale o guvvala chenna aa..aa..aa e seemalo tirugaadina o guvvala chenna nee deevenalandichaalanna o guvvala chenna
సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: మెరిసే తారలదే..రూపం విరిసే పూవులదే..రూపం అది నా కంటికి..శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం.. అపురూపం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం::1 ఎవరి రాకతో..గళమున పాటల ఏరువాక..సాగేనో ఆ వసంత మాసపు..కులగోత్రాలను ఎల కోయిల..అడిగేనా ఎవరి పిలుపుతో..పులకరించి పురి విప్పి తనువు..ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి..వెదుకులాడేనా నా కన్నులు..చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం..అపురూపం చరణం::2 ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా గానం పుట్టుక..గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా గానం పుట్టుక..గాత్రం చూడాలా వెదురును..మురళిగ మలచి ఈ వెదురును..మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా..ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం..అపురూపం