Wednesday, September 02, 2009

రాము--1968



సంగీతం::R.గోవర్ధన్
రచన::దాశరధి
గానం::P.సుశీల


ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓ...ఓఓఓ..
అహ..ఆ..హ..హా..ఆ..హా హా హా
లల్లల్లా..ఆ..ల్లాల్లల్లా..
మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే..
మాటలు రాని కోయిలమ్మ పాడునులే..
ఆనందంతో..అనురాగంతో..నా మది ఆడునులే..2

నన్నే నీవు అమ్మ అన్ననాడు..
మీ నాన మనసు గంతులువేసి ఆడూ..2
మంచికాలం మరలా రాదా..
ముళ్ళబాటే..పూలతోటా..
ఆనందంతో..అనురాగంతో..నామది ఆడునులే..

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే..
మాటలు రాని కోయిలమ్మ పాడునులే..
ఆనందంతో..అనురాగంతో..నా మది ఆడునులే

గూటిలోని పావురాలు మూడూ..
అవి గొంతుకలిపి తీయని పాట పాడూ..2
మంచుతెరలూ..తొలగీపోయీ
పండువెన్నెలా...కాయునులే...
ఆనందంతో..అనురాగంతో..నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే..
మాటలు రాని కోయిలమ్మ పాడునులే..
ఆనందంతో..అనురాగంతో..నా మది ఆడునులే
ఓఓఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓఓ..ఓఓ
ఆ..హా హ..ఆ..హా హా..ఆ..హా
లల్లల లాలలలా..ఆ..లల్లలలాలలలా

రాము--1968



సంగీతం::R.గోవర్ధన్
రచన::దాశరధి
గానం::P.సుశీల


పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...

పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...

చల్లని పలుకుల తల్లీ..
చక్కని నవ్వుల తండ్రీ..
కమ్మని నోముల పంటా..నేనే సుమా..2
ఇద్దరి బుగ్గలమీదా..ముద్దుల మూటలు పడితే
ఇంపుగ నిదుర పోవాలి..జోజోజో...2

పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...

చిట్టీ చిలక పలకా..
చిలకా తల్లి కులకా
చిలకరాజు చెట్ల చాటున వెతకాలీ..2
చల్లగ మురిసె వేళా..చాటుగ మసలే వేళా
ఎల్లరు కళ కళ లాడాలి జోజోజో..2

పచ్చని చెట్టు ఒకటీ
వెచ్చని చిలకలు రెండూ
పాటలుపాడి జోకొట్టాలి జోజోజో...

రాము--1968



సంగీతం::R.గోవర్ధనం::
రచన::దాశరధి
గానం::ఘంటసాల

మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా

ఆకాశానికి అంతుంది నా ఆవేదనకూ అంతేది
ఆకాశానికి అంతుంది నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా

తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా

మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా