Monday, September 22, 2008

అద్రుష్టవంతులు--1969

సంగీతం::KV.మహాదేవన్
రచన::K.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల

అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..

చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు
పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు
చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు
పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు
బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు
బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు
కొంత కోడెతనముంది..మరి కొంత ఆడతనముంది
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు
బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు..
హాయ్..మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు
బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు..
ఆ కసరు లోనే అలకనవ్వుల విసురు లేక పోలేదు
కొంత చిలిపితనముంది..మరి కొంత కలికితనముంది
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే
బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే
కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా
కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా
కవ్వించే కౌగిలిలో..కరగించక వదిలేర
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

అద్రుష్టవంతులు--1969

సంగీతం::KV.మహాదేవన్
రచన::K.వెంకటరత్నం
గానం::P.సుశీల

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు అ..ఓ..మ్మ్..
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో
చిన్న బోయి నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

అద్రుష్టవంతులు--1969

సంగీతం::మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

ఓహోహో..హ్హో..హ్హో..ఒహో..హ్హో..హ్హో..
పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

1)మచ్చికైన పాలపిట్టనూ..ఓ..రాజా..నా..రాజా
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ..
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ....
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్....
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్..ఔరౌర...
రొమ్ముమీద పుట్ట మచ్చనోయ్
..

ఒహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

2)డేగలాగ ఎగిరిపోతివోయ్..నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్....
డేగలాగ ఎగిరిపోతివోయ్..నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్
పాలలోన తేనె కలిసెనోయ్..ఓ..రాజా..నా..రాజా
ఆ..ఆ..ఆ..పాలలోన తేనె కలిసెనోయ్
నేడే మన పరువానికి పండుగైనదోయ్..
ఒహో..హో..హ్హో
..ఓహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ

అద్రుష్టవంతులు--1969

రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కళలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
మత్తు తెలిసిన చందురూడ మసక వెలుగే చాలులేరా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపివాక్కుల చందురూడ కాపువై నువ్ వుండిపోరా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

అద్రుష్టవంతులు--1969

రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్...నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్

చింత చెట్టు చిగురు చూడు..చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్..2

పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
వగలమారి వాలుచూపు వ~ర్~రగున్నది
వగలమారి వాలుచూపు వ~ర్~రగున్నది
అది వెంటపడితె ఏదేదో వె~ర్~రిగున్నది

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్..2

పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నది
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్..2

వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...ఇంతలేసి కన్నులతో మంతరిస్తది
అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్...

నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్

చింత చెట్టు చిగురు చూడు..చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్...
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

అద్రుష్టవంతులు--1969

రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు
పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు
చూడు ఉబలాటం ఆడు చెలగాటం
చూడు ఉబలాటం ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్నువద్దురమొగమాటం

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
‍ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్‍
మోజు పడకుంటే మొగవాడే కాదు..మోజు పడకుంటే మొగవాడే కాదు
గడసరి బిగువు సడలించనిదే జవరాలే కాదు