Tuesday, October 04, 2011

సీతాకోక చిలుక--1981

ఈ పాట ఇక్కడ క్లిక్ చేసి చిమ్మట ఖజానాలో వినండి

సీతాకోక చిలుక 1981
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::రమేష్


పాడింది పాడింది
కకా కికీ కుకూ కెకే

పట్నాల కాకి
కకా కికీ కుకూ కెకే

కకా కికీ కుకూ కెకే
పట్నాల కాకి
కకా కికీ కుకూ
కకా కికీ కుకూ
నల్ల నల్ల కోకిలమ్మ..తెల్లబోయి
ముద్దు ముద్దు రామచిలక మూగబోయి
ఊరోళ్ళ మతిబోయి సెలఏళ్ళు ఆగిపోయి
కకా కికీ కుకూ..కకా..కికీ..కుకూ
పాడింది పాడింది పట్నాల కాకీ
కకా కికీ కుకూ..కాకా కీకీ కూకూ

యూ...స్టుప్పిడ్...ఈడియెట్...షడప్..

ఇంగిలీ పీసంట ఏ బి సి డి..
గప్పందాడి..నీ వందవాడి..
నీ వరాటి పోడీ..ఓరేయ్ ఓరేయ్ ఓరేయ్
అరవంలో పాడుతున్నావేంట్రా..తెలుగులో పాడ్రా
అప్పడియా..ఇంగిలీ పీసంట..ఎంగిలీ బాషంట
బాసా పీసూ రేగి..ఒళ్ళో అంతా రేగి
మా పల్లే పాపళ్ళు ఉలుకులికి పడుతుంటే
ఉలుకులికి పడుతుంటే..ఉలుకులికి పడుతుంటే
పాడు రాగం తీసీ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పాడు రాగం తీసీ..ప్రాణాలు తోడేసి
హరి హరి నారాయణో..ఆది నారాయణో
కరుణించు మమ్మేలు..కమలలోచనుడా
స గ రి స ని ద ప మ ..

పాడింది పాడింది పట్నాల కాకీ
కాకా కికీ కుకూ..కాకా కీకీ కూకూ

ఏ రాగం..?
కర్ణ కఠోరం..
ఏం తాళం..?
గాడ్రేజి కప్ప తాళం..
కాదు తప్పు తాళం..అమ్మా

చదువుకొన్నదా..చవట కాలేజీ
పదము పాడితే..ఏ వికట కాంభోజి
స రి గ మ ప ద ని సా
సా ని ద ప మ గ రి స

సరిగమ
పదనిస
సనిదప
మగరిసా2

పిల్లా మేకా ఇంక ఎట్టా బతికేదీ
మళ్ళి పాడితే..మాకూ దిక్కేదీ

ఏడుకొండల వాడా వేంకటారమణా
గోవిందా గోవిందా

ఏ తీరుగ మము దయ చూచెదవో
ఇనవంషోత్తమ రామా..ఇనమేమో రఘురామా
మా తరమా..సర్వ సాగరమీదను..నీవే రక్షణరామా

రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ
శ్రీమద్‌రమారమణ గోవిందో హారి..

సీతాకోక చిలుక--1981




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::వాణిజయరాం

పల్లవి::-
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యా రాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

చరణం::-
వీచేగాలి నాలో జాలి తెలిపేనా నీకు?
మనసు మనసు మనువైపోయే..గురుతేనా నీకూ?
గడియే యుగమై బతుకే సగమై..గడిచే నిన్నాళ్ళూ
వలపే వగపై..తానే వరదై..కురిసే కన్నీళ్ళూ
కురిసే కన్నీళ్ళూ..

తకతోం తకతోం తకతోం తకతోం
తకతోం తకతోం తకతోం తకతోం
తకతోం తకతోం తకతోం తకతోం
తకతోం తకతోం తకతోం తకతోం
ననన ననన ననన ననన నననానా
ననన ననన ననన ననన నననానా
ననన ననన ననన ననన నననానా
తానా ననన తనానననా తానానాననా..
నానా ననన ననానననా నానానాననా..

సీతాకోక చిలుక--1981



సీతాకోక చిలుక 1981
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::బాలు,సుశీల

రాగం..హిందోళ

పల్లవి::-
బాలు::సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

చరణం::-
బాలు::కన్యాకుమారి నీ పదములు నేనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ కుసుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా

సుశీల::అలిగిన నా తొలి అలకలు నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర
బాలు::సంగమమే
సుశీల::ప్రణయ
బాలు::సాగర సంగమమే

చరణం::-
బాలు::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
భారత భారతి పద సన్నిదిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా

సుశీల::పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళ

బాలు::సాగర సంగమమే
సుశీల::ప్రణయ సాగర సంగమమే
ఇద్దరు::సాగర సంగమమే.....

సీతాకోక చిలుక--1981




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::ఇళయరాజా,వాణి జయిరాం

పల్లవి::-
వాణి::స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స

వాణి::స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
ఇ,రాజ::అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
వాణి::స గ పా ప ప పా మ మ పా ప ప పా ప ని ప ని ప స ని ప మా గా
ఇ,రాజ::పగలు రేయి ఒరిసి మెరిసి సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం

వాణి::కలిసి విరిసే జీవన రాగంలో

నన్నననననతనన తనన తనన తానా

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంద్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
తననననన తనననాన
ఇ,రాజ::తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం

చరణం::-
వాణి::నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే
నీ పిలుపు అనే కులుకులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాభికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడి బొమ్మ

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

సీతాకోక చిలుక--1981




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::బాలు,వాణి జయిరాం

పల్లవి::-
ఆమె::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

కోరస్:: మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

ఆమె::అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి

కోరస్::మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చరణం::-
అతడు::ఓ..చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాల

ఆమె::ఓ..చుక్క నవ్వవే నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాల

అతడు::మొగ్గ తుంచుకుంటే మొగమాటాల
ఆమె::బుగ్గ దాచుకుంటే బులపాటాల
అతడు::దప్పికంటే తీర్చతానికిన్ని తంటాల

కోరస్::మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

చరణం::-
కోరస్::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడు::ఓ రామ చిలుక చిక్కని ప్రేమ మొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా

ఆమె::ఈడుకున్న గోడు నువ్వే గోరింక
తోడుగుండిపోవే కంటినీరింక

అతడు::పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక

కోరస్::మిన్నేటి సూరీడు..
ఆమె::లలల్లా..
కోరస్::మిన్నేటి సూరీడు..
ఆమె::ల్లలలా..
కోరస్::మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
ఆమె::అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
కోరస్::మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

సీతాకోక చిలుక--1981




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.P.శైలజ

సాకీ:
ఓం శతమానం భవతి శతాయు పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్ఠతి

పల్లవి::-
ఆమె::మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం

అతడు::ఓ..మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం

ఆమె::ఓ..మాటే మంత్రము
అతడు::మనసే బంధము

చరణం::-
అతడు::నీవే నాలో స్పందించిన
ఈ ప్రియ లయలో శ్రుతి కలిసే ప్రాణమిదే

ఆమె::నేనే నీవుగా పువ్వూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో

అతడు::మాటే మంత్రము మనసే బంధము
ఆమె::ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
అతడు::ఇది కల్యాణం కమనీయం జీవితం

ఆమె::ఓ..మాటే మంత్రము
అతడు::మనసే బంధము

చరణం::-
ఆమె::నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవినే

అతడు::ఎద నా కోవెల ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

ఆమె::మాటే మంత్రము మనసే బంధము
అతడు::ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఆమె::ఇది కల్యాణం కమనీయం జీవితం
ఇద్దరు::లాల లాలలా లాల లాలలా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

ఆరాధన --1976 NTR














సంగీతం::S.హనుమంతరావ్
రచన::దాశరధి
గానం::S.జానకి

ఆమె::నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీ కన్నులలో కన్నీరేలా..అంతా దేవుని లీలా
అంతా దేవుని లీలా

నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా

ఆశ నిరాశల దాగుడుమూతల..ఆటేలే ఈ లోకం
ఆటేలే ఈ లోకం..ఆటేలే ఈ లోకం
కష్ట సుఖాలా కలయికలోనే..ఉన్నదిలే మాధుర్యం
జీవిత మాధుర్యం..
చీకటి కొంతా..వెలుతురు కొంతా
ఇంతే జీవితమంతా..ఇంతే జీవితమంతా

నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా

నీ మదిలోని వేదనలన్నీ..
నిలువవులే కలకాలం..నిలువవులే కలకాలం
వాడిన మోడు పూయకమానదు
వచ్చును వసంతకాలం..వచ్చును వసంతకాలం
నీతో కలసీ నీడగ నడిచే
తోడుగ నేనున్నాను..తోడుగ నేనున్నాను

నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా

ఆరాధన --1976 NTR::యదుకుల కాంభోజి::రాగం























సంగీతం::S.హనుమంతరావ్
రచన::సినారె
గానం::మహమ్మద్‌ రఫీ
యదుకుల కాంభోజి::రాగం


అతడు::ఓ ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణుగానమై..నా ప్రాణమై

ఓ ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణుగానమై..నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణుగానమై..నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధ ఎందాక దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణుగానమై..నా ప్రాణమై