సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల , V.రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,S.V.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం
పల్లవి::
ఆ నాడు తీగలేని వీణ..ఈ నాడు వీణలేని తీగ
వీణలేని తీగను..నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను..ముగిసిందని మరణించలేను
వీణలేని తీగను..ఊ..నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను..ముగిసిందని మరణించలేను
జీవించలేనూ..ఊ..మరణించలేను..ఊ
చరణం::1
మనసు నిన్నే వలచింది..నన్ను విడిచి వెల్లింది
నిన్ను మరచి రమ్మంటే..వీలుకాదు పొమంది
మనసు నిన్నే వలచింది..నన్ను విడిచి వెల్లింది
నిన్ను మరచి రమ్మంటే..వీలుకాదు పొమంది
మరువలేని మనసుకన్నా..నరకమేముంది..ఈ
ఆ..నరకమందే బ్రతకమని..నా నొసట నువ్వే రాసింది
వీణలేని తీగను..నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను..ఊ..ముగిసిందని మరణించలేను
జీవించలేనూ..ఊ..మరణించలేను..ఊ
చరణం::2
వీణకేమీ తీగ తెగితే..మార్చుకుంటుంది..ఈ
తెగిన తీగకు వీణ..ఎక్కడ దొరకబోతుంది
తీగ మారినా కొత్త రాగం..పలకనంటుంది..ఈ
పాత స్మృతులే..మాసిపోక బాధపడుతుంది
జీవించలేనూ..ఊ..మరణించలేను..ఊ
చరణం::3
బండ బారిన గుండె నాది..పగిలిపోదు చెదరిపోదు
నువ్వు పేర్చిన ప్రేమ చితిలో.కాలిపోదు బూదికాదు
నిన్ను కలిసే ఆశలేదు..నిజం తెలిసే దారిలేదు
చివరికీ ఈ జీవితానికి..చిటికెడంతా విషంలేదు..ఊ
జీవించలేనూ..ఊ..మరణించలేను..ఊ