Monday, June 04, 2007

నర్తనశాల--1963::కల్యాణి::రాగం



సంగీతం ::సుసర్ల దక్షిణామూర్తిగారు
సాహిత్యం ::సముద్రాల రాఘవాచార్య గారు
గానం ::P.సుశీల గారు

Film Music Director::Kamalakara Kameswara Rao

తారాగణం::N.T.రామారావు,సావిత్రి,S.V.రంగారావు,మిక్కిలినేని,దండమూడిరాజగోపాలరావు,రేలంగి,ముక్కామల,శోభన్‌బాబు,L.విజయలక్ష్మి,సంధ్య,ధుళిపాళ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,కాంతారావు,C.లక్ష్మీరాజ్యం,కైకాలసత్యనారాయణ,వంగర,బాలకృష్ణ,సీతారాం.

కల్యాణి::రాగం 

ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ

సఖియా వివరించవే
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే

::::1


నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని
సఖియా వివరించవే

::::2


మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే  


NartanaShala--1963
Music::Susarla Dakhshina Moorthy
Lyricist::Samudrala
Singer::P.Suseela
Producer::C.Lakshmi Rajyam
Director::Kamalakara Kameshwara Rao
Cast::N.T.RamaRao,Savithri,S.V.RangaRao,KaikalaSatyanarayana,PrabhakarReddi,L.Vijayalakshmii,Sobhanbabu,Alluramalingayya,LakshmiRajyam,KantaRao,Mikkilineni.

Kalyani::Ragam

:::::::::

Sakhiya vivarinchave
SaKhiyaa vivarinchave
vagalerigina cheluniki naa kadha
sakhiyaa vivarinchave
vagalerigina cheluniki naa kadha
Sakhiya vivarinchave

::::1

Ninnu Jusi kanulu chedari
Kanne manasu kaanuka chesi
Ninnu Jusi kanulu chedari
Kanne manasu kaanuka chesi
maruvaleka manasu raaka
virahaana chelikaana vegenani
Sakhiya vivarinchave

::::2

Mallepoola manasu dochi
Pillagaali veeche vela
aaa... Mallepoola manasu dochi
Pillagaali veeche vela
Kaluvareni velugulona
sarasaana saradaalu theerenani
Sakhiya vivarinchave
vagalerigina cheluniki naa kadha
Sakhiya vivarinchave

నర్తనశాల--1963::కానడ::రాగం



సంగీతం::సుసర్ల దక్షణామూర్తి
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.సుశీల

Film Music Director::Kamalakara Kameswara Rao

తారాగణం::N.T.రామారావు,సావిత్రి,S.V.రంగారావు,మిక్కిలినేని,దండమూడిరాజగోపాలరావు,రేలంగి,ముక్కామల,శోభన్‌బాబు,L.విజయలక్ష్మి,సంధ్య,ధుళిపాళ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,కాంతారావు,C.లక్ష్మీరాజ్యం,కైకాలసత్యనారాయణ,వంగర,బాలకృష్ణ,సీతారాం.
కానడ::రాగం 

అమ్మా... అమ్మా...
జననీ శివకామిని
జయ సుభకారిని విజయ రూపిని
జననీ శివకామిని
జయ సుభకారిని విజయ రూపిని

!! జననీ శివకామిని !!

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ
శరనము కోరితి అమ్మ భవాని

!! జననీ శివకామిని !!

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ
జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని

!! జననీ శివకామిని !!

నర్తన శాల--1963



సంగీతం::S.దక్షణామూర్తి
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల


ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును

ఆ..వలపులు చిలికె వగలాది చూపు
పిలువక పిలిచీ విరహాల రేపు
ఆ..ఎదలో మెదిలె చెలికాని రూపు
ఏవో తెలియని భావల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబారాలే
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే

ఆ..పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసీ మరపించు మనసు
ఆ..ప్రణయము చిందె సరసాల గ్రంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే..
ఆఅ..చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును...

నర్తన శాల--1963::కల్యాణి::రాగ



సంగీతం::S.దక్షణామూర్తి
రచన::సముద్రాల.
గానం::బాలమురళీ క్రిష్ణ M.బెంగలూర్ లత

రాగం ::: కల్యాణి :::



ఆఆ..అఆఆఆ..ఆఆఅ...
సలలిత రాగ సుధా రససారం
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రససారం...

మంజుల సౌరభ సుమకుంజములా
మంజుల సౌరభ సుమకుంజములా
రంజిలు మధుకర మృదు ఝుంకారం


రంజిలు మధుకర మృదు ఝుంకారం
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రససారం
ని దా ద ప నీ
ప నీ దా ప మ గ మ గ పా
స రి గ
ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..
కల్పనలొ ఊహించిన హొయలు ఉ ఉ...
ఆ ఆ కల్పనలొ ఊహించిన హొయలు
శిల్ప మనొహర రూపమునొంది
శిల్ప మనొహర రూపమునొంది
పద కరణములా మృదు భంగిమలా
పద కరణములా మృదు భంగిమలా
ముదమార లయమీరు నటనాల సాగె
సలలిత రాగ సుధా రససారం
ఝనన ఝనన ఝన నొంపుర నాదం
ఆఆఅ..ఆఆఆ..ఆఅఆ..ఆఅఆ...
ఆఆఅ..ఆఆఆ..ఆఅఆ..ఆఅఆ...
ఆఆఅ..ఆఆఆ..ఆఅఆ..ఆఅఆ...
ఆఆఅ..ఆఆఆ..ఆఅఆ..ఆఅఆ...
ఆఆఆ అఆఆ ఆ అ ఆ ఆఅఆ ఆఆ
ఝనన ఝనన ఝన నొంపుర నాదం
భువిలొ దివిలొ రవళింపగా


ప ద ప మ పా
ఆ ఆ ఆ ఆ
మ ని ద మ దా
ఆ ఆ
గ మ ద ని సా
ఆ ఆ
రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ
దా మ ప నీ దా నీ దా పా మా గ పా
మ ప ని సా సా


భువిలొ దివిలొ రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినోదమీ
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రససారం

నర్తన శాల--1963



సంగీతం::S.దక్షినామూర్తి
రచన::Sr.సముద్రాల
గానంP.సుశీల


దరికి రాబోకు రాబోకు రాజ
దరికి రాబోకు రాబోకు రాజ
ఓ తేటి రాజ వెర్రి రాజ
దరికి
మగువ మనసు కానగలేవు
తగని మారాలు మానగ లేవు
మగువ మనసు కానగలేవు
తగని మారాలు మానగ లేవు
నీకీనాడె మంగళమౌ రా
నీకీనాడె మంగళమౌ రా
ఆశ హరించి తరించేవులే
దరికి

మరుని చరాల తెలివి మాలి
పరువు పోన చేరగ రావోయ్
మరుని చరాల తెలివి మాలి
పరువు పోన చేరగ రావోయ్
నీవేనాడు కనని వినని
నీవేనాడు కనని వినని
శాంతి సుఖాల తేలేవులె
దరికి