Thursday, March 17, 2011

వసంత గీతం--1984




వసంత గీతం--1984
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,S.జానకి 

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ హా హా హా ఆ హా హా హా
ఆ హా హా హా ఆ హా హా హా

మధురం జీవన సంగీతం..మ్మ్
మధురం జీవన సంగీతం..మ్మ్
అమరం ప్రణయసుధ పొంగి పొరలు హృదయం..మ్మ్

మధురం మానస సంగీతం 
మధురం మానస సంగీతం 
విరహం ప్రణయసుధ ఇగిరిపోవు సమయం
మధురం మానస సంగీతం 

చరణం::1

మరుమల్లెపూల పొదరిల్లు
మనసిచ్చుకొన్న కౌగిళ్ళు
పిలిచే..ఈ క్షణము ఇడిచి నీ పోలేవు
మనసే వయసై..విరబూసే వలపు పూదోటా
నింగి నేల జంటా..నీవు నేనే నంటా
మేఘలన్ని పోతే వెన్నెలాడేనంటా
మమతలు మధురిమలందిన తరుణంలో

మధురం మానస సంగీతం 
మధురం మానస సంగీతం

చరణం::2

లలలలలలలలలాలాలా
లలలలలా లలా లాలా

పరువాలతావి వెద జల్లు
పిరిజాజిపూల విరి జల్లు
కురిసే ఈ అనుభవానికే జోహారు
ఎదలో చిలికే అధరాల మధువు ఈ పూటా
కొమ్మ రెమ్మ ఇంటా పూలే పూసే నంటా
దేశములన్నిపోతే సంధ్యరాగాలంటా
నీ కనుపాపలు నవ్విన తరుణంలో

మధురం జీవన సంగీతం.
విరహం ప్రణయసుధ ఇగిరిపోవు సమయం
మధురం జీవన సంగీతం
లలలలలలలలలాలాలా

Vasanta Geetam--1984
Music::Chakravarti
Lyrics::Veturi
Singer's::Balu,S.Janaki

:::

aa aa aa aa aa aa aa aa
aa haa haa haa aa haa haa haa
aa haa haa haa aa haa haa haa

madhuram jeevana sangeetam..mm
madhuram jeevana sangeetam..mm
amaram praNayasudha pongi poralu hRdayam..mm

madhuram maanasa sangeetam 
madhuram maanasa sangeetam 
viraham praNayasudha igiripOvu samayam
madhuram maanasa sangeetam 

:::1

marumallepoola podarillu
manasichchukonna kougiLLu
pilichE..ii kshaNamu iDichi nee pOlEvu
manasE vayasai..virabUsE valapu poodOTaa
ningi nEla janTaa..neevu nEnE nanTaa
mEghalanni pOtE vennelaaDEnanTaa
mamatalu madhurimalandina taruNamlO

madhuram maanasa sangeetam 
madhuram maanasa sangeetam

:::2

lalalalalalalalalaalaalaa
lalalalalaa lalaa laalaa

paruvaalataavi veda jallu
pirijaajipoola viri jallu
kurisE ii anubhavaanikE jOhaaru
edalO chilikE adharaala madhuvu ii pooTaa
komma remma inTaa poolE poosE nanTaa
dESamulannipOtE sandhyaraagaalanTaa
nee kanupaapalu navvina taruNamlO
madhuram jeevana sangeetam.
viraham praNayasudha igiripOvu samayam
madhuram jeevana sangeetam
lalalalalalalalalaalaalaa

వసంత గీతం--1984



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,S.జానకి 

పల్లవి::

వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూసాను
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూసాను
నీ పూజకే పువ్వునై వేచినాను  
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూసాను

చరణం::1

దిగంతాల అంచులు దాటి స్మరించాను నీవే దిక్కనీ 
మరో జన్మ హద్దులు దాటి వరించాను నిన్నే ప్రేయసీ 
నదినడిగే కడలివలే..పదమడిగే కవితవలే 
ఇలా సాగిపోనీ సంగమాలు
యిదే స్వప్నమో..సత్యమై..నిలిచిపోనీ

వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను
నీ పూజకే పువ్వునై వేచినాను..
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను

చరణం::2

చైత్రమాస కుసుమాలన్నీ..సుమించేను నీలో ప్రేమగా
శృంగార భావాలెన్నో జ్వలించెను నాలో లీలగా
లత అడిగే తరువు వలే..జత అడిగే తనువు వలే
యిలా సాగిపోనీ జీవితాలు..ఊఊ   
యిదే కావ్యమై..గానమై మిగిలిపోనీ

వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను
నీ పూజకే పువ్వునై వేచినాను 
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూసాను

Vasanta Geetam--1984
Music::Chakravarti
Lyrics::Veturi
Singer's::Balu,S.Janaki

:::

vasantaalu virise velaa ninnu nenu choosaanu
vasantaalu virise velaa ninnu nenu choosaanu
nee poojake puvvunai vechinaanu 
vasantaalu virise velaa ninnu nenu choosaanu
:::1

digantaala anchulu daaTi smarinchaanu neeve dikkanee 
marO janma haddulu daaTi varinchaanu ninne preyasee 
nadinadige kaDalivale..padamaDige kavitavale
ilaa saagipOnee sangamaalu
yide swapnamO..satyamai..nilichipOnee
vasantaalu virise velaa ninnu nenu choosaanu
vasantaalu virise velaa ninnu nenu choosaanu
nee poojake puvvunai vechinaanu 
vasantaalu virise velaa ninnu nenu choosaanu
:::2

chaitra maasa kusumaalannee..suminchenu neelO premagaa
Srugaara bhaavaalennO jwalinchenu naalO leelagaa
lata adige taruvu vale..jata adige tanuvu vale
yilaa saagipOnee jeevitaalu..oooo   
yide kaavyamai..gaanamai migilipOnee

vasantaalu virise velaa ninnu nenu choosaanu
vasantaalu virise velaa ninnu nenu choosaanu
nee poojake puvvunai vechinaanu 
vasantaalu virise velaa ninnu nenu choosaanu

రాముడే దేవుడు--1973

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4521
సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ 
గానం::S.జానకి,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

పాటకు రాగాలు..కోటి
కాని పల్లవి..ఒకటే ఒకటీ
మనిషికి భావాలు..కోటి
కాని మనసు..ఒకటే ఒకటీ   
పాటకు రాగాలు..కోటి
కాని పల్లవి..ఒకటే ఒకటీ
మనిషికి భావాలు..కోటి
కాని మనసు..ఒకటే ఒకటీ  

చరణం::1

మనసుకు మనసూ తోడుంటేనే
జీవితానికి...నిండుదనం
కోరిన మనసు..కనుమరుగైతే
లేనేలేదూ జీవితం..లేనేలేదూ జీవితం     
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ

చరణం::2

అందని పొందే..అందమైనదా
అందేదానికి...విలువేలేదా ?
నింగిని వున్నా..దిగిరాకున్నా
కలువకు రాజు...నెలరాజే  
కలువలు వేరు..మగువలు వేరూ
మనుగడ అంటే..కథ కాదూ   
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ
మనిషికి భావాలు...కోటి
కాని మనసు...ఒకటే ఒకటీ
పాటకు రాగాలు..కోటి

చరణం::3

తరచేకొలదీ...పెరిగే పెన్నిధి
మమతల వెల్లువ...ప్రేమంటే
ప్రేమకు అర్థం...స్వార్థం కాదు
త్యాగమే జీవిత...పరమార్థం
త్యాగమే జీవిత...పరమార్థం  
పాటకు రాగాలు...కోటి
కాని పల్లవి...ఒకటే ఒకటీ
మనిషికి భావాలు...కోటి
కాని మనసు...ఒకటే ఒకటీ
పాటకు రాగాలు...కోటి