Thursday, February 26, 2009

చుట్టాలున్నారు జాగ్రత్తా--1980




సంగీతం::MS.విశ్వనాథన్రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల

రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా
దిక్కులుతోచక చుక్కలదారుల చెలరేగింది వేడుకా
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా
దిక్కులుతోచక చుక్కలదారుల చెలరేగింది వేడుకా


వయసు దారి తీసిందీ వలపు ఉరకలేసిందీ
వయసు దారి తీసిందీ వలపు ఉరకలేసిందీ
మనసువెంబడించింది నిముషమాగకా..ఆ..
మనసువెంబడించింది నిముషమాగకా
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా
రివ్వంటుంది కోరికా..ఆ ఆ..ఆ ఆ..


చెంతగా చేరితే
చెంతగా చేరితే వింతగా వున్నదా
మెత్తగా తాకితే కొత్తగా వున్నదా..ఆ..ఆ..
మెత్తగా తాకితే కొత్తగా వున్నదా
నిన్న కలగా వున్నదీ..నేడు నిజమౌతున్నదీ
నిన్న కలగా వున్నదీ..నేడు నిజమౌతున్నదీ
అనుకొన్నది అనుభవమైతే..అంతకన్న ఏమున్నదీ
వయసు దారి తీసిందీ వలపు ఉరకలేసిందీ
మనసువెంబడించింది నిముషమాగకా
మనసేవెంబడించింది నిముషమాగకా
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా
రివ్వంటుంది కోరికా..ఆ ఆ..ఆ ఆ..


హా ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
హా ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
కన్నుతో నవ్వకూ..
కన్నుతో నవ్వకూ..ఝల్లుమంటున్నది..
గుండెలో చూడకూ..గుబులుగా వున్నది..ఈ..ఈ..
గుండెలో చూడకూ..గుబులుగా వున్నది
తొలిచూపున దాచిందీ..మలిచూపున తెలిసిందీ
తొలిచూపున దాచిందీ..మలిచూపున తెలిసిందీ
ఆ చూపుల అల్లికలోనే..పెళ్ళి పిలుపు దాగున్నది
హా..వయసు దారి తీసిందీ..వలపు ఉరకలేసిందీ..
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా..ఆ..ఆ
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరికా
దిక్కులుతోచక చుక్కలదారుల చెలరేగింది వేడుకా
హా ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
హా ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ




Chuttalunnaru Jagratta--1980
Music::M.S.Viswanaathan
Lyricist::C.Narayana Reddy
Singer's::S.P.Balu, P.Susheela
Actors::Krishna, Sri Devi

Rekkalu Todigi Repa Repalaadi
Rivantundi Korika
Dhikkulu Tochaka Chukkala Darula
Chela Regindi Veduka 
Dhikkulu Tochaka Chukkala Darula
Chela Regindi Veduka

Vayasu Daari Teesindi
Valapu Vurakalesindi
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka 

Rekkalu Todigi Repa Repalaadi
Rivantundi Korika..Rivantundi Korika

Chentaga..Cherite
Chentaga Cherite..Vintaga Vunnada
Mettaga Thakite..Kotaga Vunnada 
Mettaga Thakite..Kotaga Vunnada

Ninna Kalaga Vunnadi
Nedu Nijam Avutunadi 
Ninna Kalaga Vunnadi
Nedu Nijam Avutunadi
Anukunnati Anubhavam Aite
Anthakanna Emi Vunnadhi

Vayasu Daari Teesindi
Valapu Vurakalesindi
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka 
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka

Rekkalu Todigi Repa Repalaadi
Rivantundi Korika

Kannuto Navvaku 
Kannuto Navvaku
Jhallumantunadi
Gunde Lo Chudaku
Gubulaga Vunnadi

Toli Chupuna Dachindi
Mali Chupuna Thelisindi
Toli Chupuna Dachindi
Mali Chupuna Thelisindi 
Aa Chupula Alikalone
Pelli Pilupa Daagunnadi

Vayasu Daari Teesindi
Valapu Vurakalesindi
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka 
Manasu Vanmbadinchindi
Nimashamu Aagaka 

Rekkalu Todigi Repa Repalaadi
Rivantundi Korika
Dikkulu Tochaka Chukkala Daarula

Chala Regindi Veduka  

క్రిష్ణార్జునులు--1982::సింధుభైరవి::రాగం



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::SP.బాలుP.సుశీల

సింధుభైరవి::రాగం

మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా..ఓహో.ఓ.ఓ.ఓ


మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ

ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఆ నిద్దరమ్మ ముద్దరేసే కలల అలల వెల్లువలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఆహా..ఆ ఆ ఆ ఆ ఆ


వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
హాయ్..ఇద్దరైన ముద్దులమ్మ వలపు వలన అల్లికలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

ఊరికి మొనగాడు--1981

























సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::SP.బాలు,P.సుశీల

ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో
తెళ్ళార్లు నాపేరు వల్లించుకో...ఎందుకు
ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి


ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
తెళ్ళార్లు నీపేరు వల్లించుతా...ఎందుకు
ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి


కాకిచేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
కాకిచేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
ఊరుకున్న ఊసుపోని ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు
ఊరుకున్న ఊసుపోని ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఆదిలోనే బారసాల చేసుకోవ సీమంతం
ఊఊలల హాయి ఊఊలల హాయి


ఇదిగో తెల్లచీర..ఆఆ..ఇవిగో మల్లెపూలు..మ్మ్ మ్మ్ మ్మ్
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో
తెళ్ళార్లు నాపేరు వల్లించుకో...ఎందుకు
ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి


సూదికోసం సోదికెళితే సుడి తిరిగిందా
మొహమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా
సూదికోసం సోదికెళితే సుడి తిరిగిందా
మొహమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా
కట్టవయ్య నట్టింట ఉయ్యాల తొట్టైనా అయ్యో నువ్వే ఊపాల
కట్టవయ్య నట్టింట ఉయ్యాల తొట్టైనా అయ్యో నువ్వే ఊపాల
నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా
అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా
ఊఊలల హాయి ఊఊలల హాయి

చుట్టాలున్నారు జాగ్రత్తా--1980

కృష్ణ గారి ఈ పాట మీరు విని తీరాల్సిందే

ఓ అమ్మాయి, అబ్బాయిని ఏడిపిస్తూ పాడే పాట లలో ఇదే బెస్ట్ ఏమో
అందులోను ఆ గడసరి అమ్మాయి పాత్రలో శ్రీదేవి..
అంతకు అంత బదులు చెప్పే అబ్బాయిగా మన కృష్ణా గారు...
సూపర్ :-) ఆయన స్టెప్స్ గురించి ఇక చెప్పనే అక్కరల్లేదు.


సంగీతం::M.S..విశ్వనాధన్
రచన::సినారె
గానం::P.సుశీల,S.P.బాలు

రా రా రా రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున గిర గిర గిర గిర గిర...

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

నిలువూ ఏమంత బిగువూ..నిను నిలదీసి వలవేసి లాగేస్తా
అందాక నువ్వొస్తే ఆపైన నే చూస్తా తీరా నువు లాగేస్తే
తీయంగా అంటిస్తా..చురుక్కు చురుక్కు చురుక్కున
చుర చుర చుర చుర చుర
రమ్మంటూ నేనంటే..రానంటూ నువ్వుంటే గారాలే పోతుంటే..
నీ బుగ్గ చిదిమేస్తాను చిటుక్కు చిటుక్కు చిటుక్కున
చిట చిట చిట చిట చిట

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

అలకా బంగారు తునకా..ఏదో అలవోకగా అంటే అంత కినుకా..
అలకా బంగారు తునకా..ఏదో అలవోకగా అంటే అంత కినుకా...
నీ వైనం చూస్తుంటే హైరానా అవుతుందీ..నీ అల్లరి చూస్తుంటే నా
గుండే అంటుంది కలుక్కు కలుక్కు కలుక్కునా కల కల కల కల కల

రమ్మటూ నువ్వంటే రానంటూ నేనుంటే నా మాటా వినకుంటే
నీ ఆట కట్టిస్తాను గబుక్కు గబుక్కు గబుక్కున గబ గబ గబ గబ గబ

రా రా రా రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున గిర గిర గిర గిర గిర...

చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక

Wednesday, February 25, 2009

మా ఇద్దరి కథ--1977



సంగీతం::చక్రవర్తి
రచన::కోసరాజురాఘవయ్య
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,మంజుల,జయప్రద,
సత్యనారాయణ,హలం,
రాజబాబు,రావు గోపాలరావు.

పల్లవి::

చిలకపచ్చ చీర కట్టి..చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో 
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్..ఓరయ్యో 
ఒక్కదాన్ని..వచ్చానురోయ్  

చిలకపచ్చ చీర కట్టి..చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో 
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్..ఓరయ్యో 
ఒక్కదాన్ని..వచ్చానురోయ్  

చరణం::1

ఆ..ఎర్రా ఎర్రనివాడు..ఆ..ఎత్తు భుజాలవాడు
ఆ..ఎర్రా ఎర్రనివాడు..ఆ..ఎత్తు భుజాలవాడు
చూడా చక్కనివాడు..దారీ తప్పి వచ్చాడు
చూడా చక్కనివాడు..దారీ తప్పి వచ్చాడు
ఎర్రా ఎర్రనివాడు..ఎత్తు భుజాలవాడు
చూడా చక్కనివాడు..దారి తప్పి వచ్చాడు
ఎవరూ చూడలేదా..చూస్తే చెప్పరాదా..ఆ 
ఎవరూ చూడలేదా..చూస్తే చెప్పరాదా..ఆ 
ఎవరూ చూడరా..చూస్తే చెప్పరా..ఓఓఓఓఓఓ 
ఓఓఓఓఓఓఓఓఓఓఓ 

చిలకపచ్చ చీర కట్టి..చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో 
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్..ఓరయ్యో 
ఒక్కదాన్ని..వచ్చానురోయ్  

చరణం::2

ఆ..గుంటూరు చిన్నవాడు..ఆ..కొంటే కోణంగివాడు
ఆ..గుంటూరు చిన్నవాడు..ఆ..కొంటే కోణంగివాడు
పక్కా పాపటివాడు..పచ్చీ పోకిరీవాడు
పక్కా పాపటివాడు..పచ్చీ పోకిరీవాడు
గుంటూరు చిన్నవాడు..కొంటే కోణంగి వాడు
పక్కా పాపటివాడు..పచ్చీ పోకిరివాడు
ఏడ దాగినాడో..ఓ..జాడ తెలియ నీడూ..ఊ  
ఏడ దాగినాడో..ఓ..జాడ తెలియ నీడూ..ఊ 
ఏడ దాగినాడో..జాడ తెలియ నీడూ 
ఏడ దాగినో..ఓ..జాడ తెలియదు..ఓఓఓఓఓఓ 
ఓఓఓఓఓఓఓఓఓఓఓ 

చిలకపచ్చ చీర కట్టి..చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో 
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్..ఓరయ్యో 
ఒక్కదాన్ని..వచ్చానురోయ్  

Monday, February 23, 2009

!! మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు !!

!! ఓమ్ నమః శివాయ !! ఓమ్ నమః శివాయ !!


మాఘ బహుళ చతుర్ధశి
మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు.
(తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి)

మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప పండుగ.
చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది.
శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు


తెలిసిగానీ తెలియక గానీ భక్తి తోగాని డంబముతో గాని
యీరోజు ఎవరైతే స్నానము దానము ఉపవాసము జాగరణ చేస్తారో
వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

Sunday, February 22, 2009

సీతారామకల్యాణం--1961::ఆరభి :::రాగం



సంగీతం::గాలి పెంచల నరసింహారావు 
రచన::సముద్రాల రాఘవాచార్యులు
గానం::ఘంటసాల
ఆరభి :::రాగం


హే పార్వతీనాథ కైలాస శైలాగ్రవాసా
శశాంకార్థ మౌళీ ఉమా దేవతోల్లాసి తవ్యాంగభాగా
శ్రితానందదాయి స్మితాపాంగా
భస్మీకృతానంద గంగాధరా
సర్వసంతాప హరా హరా
శివా సదాశివా - 


మాయామాళవగౌళ::రాగం 
నీయున్న చందంబు నేనెంత
యూహింపగా వచ్చు - వేదమ్ములున్నీవ వాదమ్ములున్నీవ
ధైర్యంబులున్నీవ మర్మంబులున్నీవ
సర్వంబులున్నీవ - నీ లెంకలైనట్టి దాసుండనైనట్టి
నన్నుం దయాళుండవై ప్రీతి రక్షింపవే
తప్పు సైరింపవే దేవ మన్నింపవే - దేవదేవా మహాదేవా
నమస్తే నమస్తే నమః

సీతారామకల్యాణం--1961::శంకరాభరణం::రాగ





















సంగీతం::గాలి పెంచల నరసింహారావు 
రచన::సముద్రాల రాఘవాచార్య 
గానం::ఘంటసాల 

రాగ:::శంకరాభరణం

కానరార కైలాసనివాస
బాలేందుధరా జటాధరా!
కానరార కైలాసనివాస
 



భక్తజాల పరిపాల దయాళా 
భక్తజాల పరిపాల దయాళా
హిమశైల సుతా ప్రేమలోలా
కానరార కైలాస నివాస 
బాలేందుధరా జటాధరా
కానరార

నిన్నుచూడ మది కోరితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున నిలచితిరా...
కన్నడసేయక కన్నులుచల్లగ
మన్ననసేయర గిరిజారమణా..
కానరార కైలాసనివాస


సర్పభూషితాంగా కందర్పదర్పభంగా
సర్పభూషితాంగా కందర్పదర్పభంగా
భవపాపనాశ పార్వతీమనొహర
హేమహేశ వ్యోమకేశ త్రిపురహర
కానరార కైలాసనివాస







స్తోత్రం:
జయత్వదభ్ర విభ్రమత్ భ్రమద్భుజంగమస్ఫురత్ 
ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్!
ధిమిద్ధిమిద్ధిమిద్ద్వనన్‌ మృదంగ తుంగ మంగళ
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః
ఓం నమః శివాయ 

అగ(ఖ)ర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
ఓం నమః హరాయ 

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం
స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం
గజచ్ఛికాంధకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే



Friday, February 20, 2009

కళా తపస్వి శ్రీ కే .విశ్వనాధ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు



కళా తపస్వి శ్రీ కే .విశ్వనాధ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
విశ్వనాథ్ గారు తీసిన సినిమాల్లో నాకు నచ్చినవి


జీవనజ్యోతి
సిరిసిరిమువ్వ
సూత్రధారులు
సీతామాలక్ష్మి
ఆత్మగౌరవం
సుడిగుండాలు
శుభసంకల్పం
శుభోదయం
స్వయంకృషి
స్వాతిముత్యం
స్వాతికిరణం
సాగరసంగమం
శంకరాభరణం
సిరివెన్నెల
స్వర్ణకమలం
సప్తపది
వీటిలోని పాటలు కొన్ని ఇక్కడ వేస్తున్నాను
!!సిరి సిరి మువ్వ!!
::: రాగం::రేవతి :::
రచన::వేటూరి సుందరరామ మూర్తి
గానం:::యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పీ.సుశీల
సంగీత దర్శకత్వం::కే.వీ.మహదేవన్
దర్శకత్వం::కాశినాధుని విశ్వనాథ్

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం!!

*******************************************
సినిమా:::స్వర్ణకమలం
సంగీతం::ఇళయరాజా
గానం:యస్.జానకి,S.బాలూ
సాకీ:
కంఠేన లంబయే గీతం
హస్తేన అర్ధం ప్రదర్షయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకనములమర
నలువంకల మణిరు చులవంక కనరా

తలవంక నలవేలు
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

మేలుగరతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
మేలుగరంతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కెయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీను పొడమా
పాలు గారు మోమున శ్రీను పొడమా
పులి తోలు గట్టి ముమ్మోన వాలు బట్టి తెరగా

*******************************



!! స్వాతి కిరణం !!
రచన: ?
సంగీతం::KV.మహదేవన్
గానం::వాణీ జయిరాం

రాగం::అమౄతవర్షిణి :::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొర సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా
ఆనతి నీయరా హరా ఆ ఆ ఆ

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్య పాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా హరా ఆ ఆ ఆ
ని నీ స ని ప నీ ప మ గ స గా
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును రా
ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస గమసని
ఆనతి నీయరా

జంగమ దేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
శాష్టంగము గా దండము చేతురా
ఆనతి నీయరా
సానిప గమపనిపమ గమగ పప పప
మపని పప పప గగమ గస సస
నిగస సస సస సగ గస గప పమ పస నిస
గసని సగ సగ సని సగ సగ
పగ గగ గగ సని సగ గ
గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా

శంకర శంకించకురా
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నావంకనొక్క
కడగంటి చూపు పడనీయవేని నీ కిన్కరునిక సేవించుకొందురా
ఆనతి నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ పా గా మా స
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ ని స ప ని మ ప మ గ స గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గగా
గామపని గమాపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మామ పప నిగ తక తకిట తకదిమి
మమ పప నినిసమ తక తకిట తకదిమి
పపనినిసస గని తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా ధర శిక్షా దీక్ష ద్రాక్ష
విరూపక్ష నీ కృపావీక్షణాపేక్షత ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా

ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా
దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....
*****************************************


ఫిల్మ్!! స్వర్ణ కమలం !!
రచన::సిరివెన్నెల
సంగీతం::ఇళయరాజా
గానం::జానకి


ఆ ఆ ఆఆ ఆఆ
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

మబ్బులో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికైనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నాకోసం సురభోగాలే వేచి నిలిచెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచీ కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు

********************************


ఫిల్మ్!! స్వాతి ముత్యం !!
రచన:సి.నారాయణ రెడ్డి
సంగీతం::ఇళయరాజా
గానం::బాలు,జానకి
రాగం::మధ్యమావతి

ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
చాల బాగా పాడుతున్నారు
ఆ పైశడ్యం ఆ మండలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ హా ఆఆఆ ఆఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదాస నిపమపని సా నిపరిమరి నీస
తా నననా తనాన తదరి నా ఆ

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమా
హ హా ఆ అ ఆ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఓహో ఓహో ఓహో ఓ ఓ
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడ
గుండెలేని మనిషల్లే...
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడ
అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ

సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వీ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా
చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు

సువ్వి సువ్వి సువ్వీ
**************************************


ఫిల్మ్!! శంకరాభరణం !!
సంగీతం::కేవి.మహాదేవన్
రచన::వేటూరి
గానం::బాలు

దొరకునా...దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపాన
మధిరోహణము చేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ !!

రాగాలనంతాలు నీ వేయిరూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నీ ప్రాణదీపమై నాలోన వెలిగే ఆ...ఆ...
నిను కొల్చువేళ దేవాదిదేవా
దొరకునా ఇటువంటి సేవ!!

ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందువేళ మహానుభావా
దొరకునా ఇటువంటి సేవ!!

అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానము 2
సత్వ సాధనకు సత్య సోధనకు
సంగీతమే ప్రాణము 2
త్యాగరాజ హృదయమై
రాగరాజ నిలయమై
ఓం ఓం ఓంకారనాదాను సంధానమౌగానమే
శంకరాభరణము..శంకరాభరణము

Sunday, February 15, 2009

ఆత్మ బంధువు--1985





సంగీతం::ఇళయరాజ
రచన::?
గానం::SP.బాలు,S.జానకి,

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం

మనసున సెగ యెగసే ఏ మాయ వెలుపుల చలి కరిచే
వయసుకు అదివరసా వరసైన పిల్లదానికి అది తెలుసా
మాపటికి చలిమంటేస్తా కాచుకో కాస్తంతా
ఎందుకే నను ఎగదోస్తా అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కోడితే తుమ్మెద పువ్వు దొంగాటా
దోబూచిలే నీ ఆటా
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం

పొద్దుంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా
చూసాక మూట కట్టి లెక్క చెప్పనా
నోటికి నోరు అయితేనే కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాత్రి అయింది రాసుకుంది చిటపట గా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంటా డూపు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
యేది యేది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం

స్వయం కృషి--1987



సంగీతం::రమేష్ నైడు
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి,SP.సైలజ


సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

విరజాజి పూలబంతి అరసేత మోయలేని
విరజాజి పూలబంతి అరసేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి
సూసి అలకలొచ్చిన కలికి
ఏసినాది కులుకుల మొలికి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చ

సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న
చిలకమ్మ కొనసూపు సవురు బొండుమల్లి చెండుజోరు
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు
మెరిసే నల్లమబ్బైనాది
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి

స్వయం కృషి--1987



సంగీతం::రమేష్ నైడు
రచన::వేటూరి
గానం::S.జానకి


సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరో చెప్పగా ఇక లేలే
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు
సందిటనేసిన చెలువములే
సందిటనేసిన చెలువములే
సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ అ
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

కలల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ
వలపు వందనపు తిలకాలు
అంకము చేరిన పొంకాలే
అంకము చేరిన పొంకాలే
శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట

రావణుడే రాముడైతే--1979



సంగీతం::GK.వేంకటేశ్
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ..
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ..
రవి చూడని పాడని నవ్య రాగానివో..
రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందానివో


ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ పాటనే పాడనీ
రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందానివో


ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలాడనీ పాడనీ
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ..
రవి చూడని పాడని నవ్య రాగానివో..
రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందా
నివో

Wednesday, February 11, 2009

~*~*~అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతి ~*~*~



అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతి సందర్భంగా, ఆయనకు
సమర్పిస్తున్న ఈ చిరు కానుక
ఇది నా సొంతంగా రాసినది కాదు
నా కు తెలిసిన వారు యాహూ చుమ్మ గ్రుప్ వారిలో
ఒకరైన మోహన్ దేవ రాజు గారి రాసిన
ఈ పాట
నాకు చాలా నచ్చినది మీరూ చదివి ఆనందిస్తారని కోరికతో....
మీ శక్తి

భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
స్థిరమైనది మా మది లో మధురమైన నీ గానం
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

పదము లోని భావములు పదిలముగా మేళవించి
లాహిరి లో మమ్ములనూ కలవరింప చేసితివీ
సాధన లేనిదీ మరువగ రానిదీ
సాధన లేనిదీ మరువగ రానిదీ
పాడిన నీ పాటలూ వినినంతనె తెలియునురా
వినినంతనె తెలియునురా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

ప్రేమ గీతి పలికితే మేను పులక రించెను
ముద్దు మాట పలికితే హద్దు నీకు లేదనెను
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
హృదయం లో ఆనందము ఘుభాళించెనూ
ఘుభాళించెనూ
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా

Saturday, February 07, 2009

ప్రజారాజ్యం--1983


సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకధిమి తకధిమి తకఝణు
తకధిమి తకధిమి తకధిమి తకఝణు

ఓ........ఓ హో....ఓ.....హో హో హో.....ఓ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ..ఓహో ఓహో ఓహో......
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ......
మువ్వా మువ్వా ముద్దాడంగ ముద్దు ముద్దూ పెళ్ళాడంగ
అందాలన్నీ అల్లాడంగ రావే..హో..హో..హో...
ఇదే అల్లరీ...ఈ..హో..నాదే నా గిరీ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ......
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
దాచిన ఏహే..దాగని ఓహో..తీయని వలపులో
చక్కిలిగిలిలో కౌగిలి వలలో ఇద్దరు కరగాలిలే
దక్కిన ఆహా..చిక్కని..ఓహో హో..చీరని కొలుపులో
ముద్దుల ముడిలో మెత్తని ముడుపే వెచ్చగ దొరకాలిలే
కన్ను కన్ను మాటాడంగమాట మాట మనసివ్వంగ
మనసు మనసు మనువాడంగ రావే..హే..హో..హ్హ..
అ మనపెళ్ళికీ..ఈ..హ్హో..అదే పల్లకీ..
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు

వచ్చిన..హహహ..వయసులో..ఓహోహోహోఇ..ఇచ్చిన మనసులే...
కలసిన జతలో కమ్మని శ్రుతిలో మల్లెలు పాడాలిలే
నచ్చిన..ఓహో..హో..సొగసులు..హే..తెచ్చిన వరసలే
వలపులు కడితే వంతెన పడితే పంటలు పండాలిలే
పాటే తీసి పైటేయంగ పైటే నేను జారేయంగి పైటే నువ్వై వాటేయంగ రారా..హో..హో...హో..
ఇదే ఆశగా..హోయ్..ఇదే బాటగా..ఓ బల్లే..
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..వయ్యారి చిందుల్లో..హ్హ..
వయ్యారి చిందుల్లో....ఆ ఆ..వయ్యారి చిందుల్లో
లలాలలాలలా..లలాలలాలలా..లలాలలాలలా

ముగ్గురు అమ్మాయిల మొగుడు ~~1983



సంగీతం::KV.మహాదేవన్
రచన::?
గానం::P.సుశీల

ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో..

స్నానాల సందడిలో సన్నాపొద్దు పోడిచి
చీరకట్టి కురులపైన కన్నే పొద్దుగడిచే
ఆ..స్నానాల సందడిలో సన్నాపొద్దు పోడిచి
చీరకట్టి కురులపైన కన్నే పొద్దుగడిచే
రాగం ఒకటి అందుకొని..పని పాటల పడితే
అంతలేసి ఎండపొద్దు వెన్నెల్లై నడిచే..


ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో..


మునిమాపున సేదతీరి చెలియాలంత కలిసి
కూర్చుతున్న పూవులతో నవ్వుల్లో కలబోసి..
మునిమాపున సేదతీరి చెలియాలంత కలిసి
కూర్చుతున్న పూవులతో నవ్వుల్లో కలబోసి..
ఊరు పేరు లేని వరుడి ఊసులాడుతు వుంటే
ఆదమరచి కన్నె పడుచు కలలలోకి జారే

ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
కన్నె మొగ్గలు ఎన్నెన్నో ముంగిట ముగ్గుల్లో
ముంగిట ముగ్గుల్లో...
ఆ..ఎర్ఱా ఎర్ఱని సిగ్గులు తూరుపు బుగ్గల్లో
..

Friday, February 06, 2009

వసంత కోకిల--1982



సంగీతం::ఇళయరాజ
రచన::మైలవరపు గోపిగానం::SP.బాలు

:::


కథగా కల్పనగా..కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా..కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోనీ పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలి లో..లాలి లాలో జోలాలి లో
కథగా కల్పనగా..కనిపించెను నాకొక దొరసాని

:::1


మోసం తెలియని లోకం మనది..తియ్యగ సాగే రాగం మనది
యెందుకు కలిపాడో..బొమ్మలను నడిపేవాడెవడో
నీకు నాకు సరిజోడని..కలలోనైనా విడరాదనీ
కథగా కల్పనగా కనిపించెను..నాకొక దొరసాని
నా మదిలోనీ పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలి లో..లాలి లాలో జోలాలి లో

:::2


కారడవులలో కనిపించావు..నా మనసేమో కదిలించావు
గుడిలో పూజారై..నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధ మేజన్మది..ఉంటే చాలు నీ సన్నిధి
కథగా కల్పనగా కనిపించెను..నాకొక దొరసాని
నా మదిలోనీ పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలి లో..లాలి లాలో జోలాలి లో
లాలి లాలో జోలాలి లో..లాలి లాలో జోలాలి లో

Thursday, February 05, 2009

ముద్దమందారం --- 1981



సంగీతం::రమేష్ నాయుడు
రచన::Traditional
గానం::SP.బాలు

జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఒకటాయె రెండాయే ఉయ్యాల..
రెండు మూడు మాసాలాయే ఉయ్యాలా


జో...లాలీ..ఓ..లాలీ నైనా
మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్లు బిగువాయే ఉయ్యాల


జో...లాలీ..ఓ..లాలీ నైనా
మూడాయే నాలుగాయే ఉయ్యాల
నాల్గు ఐదు మాసములాయె ఉయ్యాల


జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఐదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసములాయె ఉయ్యాల


జో...లాలీ..ఓ..లాలీ
ఏడో మాసములోన ఉయ్యాల నైనా
వేగుళ్ళే..బయళిల్లే..ఉయ్యాల

జో...లాలీ..ఓ..లాలీ నైనా
ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల


జో...లాలీ..ఓ..లాలీ నైనా
తొమ్మిది మాసములోన ఉయ్యాల నైన
శ్రీ కృష్ణ జన్మముర ఉయ్యాల
నైనా శ్రీ కృష్ణ జన్మముర ఉయ్యాల

Wednesday, February 04, 2009

పడమటి సంధ్యారాగం--1986




సంగీతం::,S.P.బాలు
రచన::వేటూరి
గానం::S.జానకి,S.P.బాలు


 ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే...
you are avakay me ice cream
this is the hot and sweet love's dream
united states of hearts we have
like Indian namaste

ఆకాశంలో తార సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నవిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం
గ్రహణాలు లేని ఆ తారలన్నీ
గగనాన కలిసే ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం కలిసింది ఈ బంధం

ladies and gentlemen
this is your captain speaking from the cockpit
its unfortunate we caught fire all the engines
I advice you to put on your parachutes and
bail out immediately

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన పాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుదిరంతోనే రుణమైనదీ ప్రియ బంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే
ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం

అల్లూరి సీతారామ రాజు--1974



సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
తేలి..వస్తాడు నా రాజు..రోజు

వేల తారకల నయనాలతో..నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో..నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూలికై అవని అనువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను
పాల సంద్రమై...పరవశించేను
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలెంతగ విరిసినగాని చంద్రుణ్ణి విడిపోలేవు..ఓ..
కెరటాలెంతగ పొంగినగాని కడలిని విడిపోలేవు..ఓ..
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే..ఓ..
తనువులు వేరైన దారులు వేరైన తనువులు వేరైన దారులు వేరైన..
ఆ బంధాలే నిలిచేనులే ఆ బంధాలే నిలిచేనులే...

వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
వస్తాడు నా రాజు ఈ రోజు