Thursday, May 26, 2011

శంకరాభరణం--1980



సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరి
గానం::S.P.బాలు,వాణీజయరా  
తారాగణం::J.V.సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి

పల్లవి::

దొరకునా..దొరకునా..దొరకునా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

చరణం::1

రాగాలనంతాలు..నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు..నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు


నాదాత్మకుడవై..నాలోని చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నాదాత్మకుడవై..నాలోని చెలగి
నా ప్రాణదీపమై..నాలోన వెలిగే
నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా
దేవాదిదేవా..ఆ 

దొరకునా ఇటువంటి సేవ 
నీ పద రాజీవముల చేరు నిర్వాణ 
సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 

చరణం::2

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై..నాకున్న దైవమై
వెలుగొందువేళ..మహానుభావా
మహానుభావా
దొరకునా..ఆ..ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ 
సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ..దొరకునా ఇటువంటి సేవ

శ్రీ తిరుపతమ్మ కథ--1963



సంగీతం::పామర్తి,బి.శంకర్
రచన::బొల్లిముంత
గానం::P.లీల
Film Directed By::B.S.Naaraayana
తారాగణం::n.t.r. గుమ్మడి,రమణరెడ్డి,రాజసులోచన,సూర్యకాంతం,కృష్ణకుమారి.

పల్లవి::

శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా
శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా

చరణం::1

ఎక్కడోదూరాన ఏడుకొండల మీద  
ఎక్కడోదూరాన ఏడుకొండల మీద 
ఎక్కికూర్చొని..ప్రజల మ్రోక్కులందేవాడ  
ఇక్కడే మాయింట వెలసినావయ్యా..
నాదు దయతీరాన..పిలచినావయ్యా
శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా

చరణం::2

మనసు తిరుపతికొండ..మాకు నీవే అండ
మనసు తిరుపతికొండ..మాకు నీవే అండ
కనులలో నీ పాద..కమలాలు నిండా
నిను భావించేము..నిన్ను కొలిచేము
ఆదుకోరమ్మనీ..నిను పిలిచెమూ
శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా

చరణం::3

దేవతలకందరికి..దేవుడవు నీవు
దేవతలకందరికి..దేవుడవు నీవ్
తలచినంతనె..కనుల మెదలుతుంటావూ
పిలచినంతనె..బదులు పలుకుతుంటావూ
మన్ను నీ దాసిగా..భావించవయ్యా

శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా
శ్రీవేంకటేశా దయాసాగరా..శ్రీవేంకటేశా

Sreetirupatamma Katha--1963
Music::paamarthi 
Lyrics::Bollimunta
Singer's::P.Leela
Film Directed By::B.S.Naaraayana
Cast::N.T.R. Gummadi,Ramanareddi,Sooryakaantam,Raajasulochana,Krishnakumaari.

:::::::::::::::::::::::::::::::::::

SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa
SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa

::::1

ekkaDOdooraana EDukonDala meeda  
ekkaDOdooraana EDukonDala meeda 
ekkikoorchoni..prajala mrOkkulandEvaaDa  
ikkaDE maayinTa velasinaavayyaa..
naadu dayateeraana..pilachinaavayyaa
SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa

::::2

manasu tirupatikonDa..maaku neevE anDa
manasu tirupatikonDa..maaku neevE anDa
kanulalO nee paada..kamalaalu ninDaa
ninu bhaavinchEmu..ninnu kolichEmu
AdukOrammanii..ninu pilichemuu
SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa

::::3

dEvatalakandariki..dEvuDavu neevu
dEvatalakandariki..dEvuDavu neev
talachinantane..kanula medalutunTaavuu
pilachinantane..badulu palukutunTaavuu
mannu nee daasigaa..bhaavinchavayyaa

SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa
SreevEnkaTESaa dayaasaagaraa..SreevEnkaTESaa