Saturday, February 23, 2013

నా పేరు జాని--1980








సంగీతం::ఇళయరాజ
రచన::?
గానం::జానకి 
నటీ,నటులు::రజనికాంత్,శ్రీదేవి,దీప. 

రగిలే ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 
రగిలే ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 
తన ముందే..నిలవాలి..ఈ గాలి వాన మాటులోనే..రగిలే
ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 

ఏ నాటి బంధం ఇది..శోకం పొంగే 
నా గుండె వీణ అయినది..రాగం చింది
ఈ పూట నిన్నే తలచాను..ఆనంద రాగం పాడెను 
నీదే ధ్యానం..కదలే తాపం..భావం నాలో నేడు 
రగిలే ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 

సెగ రేగి పోతున్నది..నాలో భావం
శోకాల రాగం..ఆగేనా
ఒక నాటి స్నేహం..మారెనా
నీకూ..నాకూ..బంధం..తేలే యోగం నేడు

రగిలే ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 
తన ముందే..నిలవాలి..ఈ గాలి వాన మాటులోనే..రగిలే
ఈ నా గీతం..నీ రాక కోరి సాగెనే 

ఛాలెంజ్--1984



సంగీతం::ఇళయరాజా 
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

సాయంకాలం సాగర తీరం
నా చెలి వొళ్ళో చలి సందళ్ళో
రోజూ మోజుగా జల్సా చేయరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం సాగర తీరం
వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా

చరణం::1

కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా

మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
రానంటానా పొదరింటికి పూతకొచ్చి పండుతున్న పులకరింత వేళకి

చరణం::2

సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా
రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా లాలాలలాల

చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
రమ్మంటావా సందిళ్ళకి ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి

సాయంకాలం సాగర తీరం
నా చెలివొళ్ళో చలి సందళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా