Tuesday, December 12, 2006

పాండవ వనవాసం--1965






సంగీతం::ఘంటసాల
రచన::శ్రీ సముద్రాల రాఘవాచార్య
గానం::ఘంటసాల,బృందం


చక్రవాక::రాగం
{ ఆహిర్ భైరవ్ హిందుస్తానీ రాగ్ }

సాకీ::
న్యాయానికే పరాజయమా!
వంచనకే ధర్మము తలవంచేనా

బృందం::ఆ.. ఆ.. ఆ.. ఆ..

పల్లవి::

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా
విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా

చరణం::1

నీ మది రగిలే కోపానలము
ఈ మహినంతా దహియించేనని
మోమును దాచేవ ధర్మరాజా

బృందం::అయ్యో....అడవి పాలయేరా

చరణం::2

సభలో చేసిన శపథముదీరా
పావుల నదిలో త్రుంచెదనేనని
బాహువులూచేవా భీమసేనా!

బృందం: ఆహా…అడవి పాలయేరా

చరణం::3

ఆలములోన కౌరవసేన
అమ్ములవానా ముంచెదనేనని
ఇసుమును చల్లేవ సవ్యసాచి

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో....అడవి పాలయేరా

చరణం::4
ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
నీ పతి సేవయె నీకు రక్ష

బృందం: ఆహా…..