Wednesday, August 01, 2012

అభినందన--1988






సంగీతం::ఇళయరాజా 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.జానకి

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి 

ఆ..చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి 
ఇద్దరొద్ధికైనారు..ముద్దు ముద్దుగున్నారు 
ఇద్దరొద్ధికైనారు..ముద్దు ముద్దుగున్నారు 
చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి

చరణం::1

ఈ పిల్లకు మనసైంది..ఆ కళ్ళకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది..ఈ బుగ్గకు సిగ్గైంది 
కళ్యాణం..వైభోగం..నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు..తాళాలు..బాణసంచా కలలే కన్నారు
పెళ్ళికి మాకేం ఇస్తారు

కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు 
కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు 
ఊరంతా ఊరేగిస్తారు

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు 
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

స్వర్ణకమలం--1988::వలజి::రాగం



























సంగీతం::ఇళయరాజ 
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,P.సుశీల
వలజి::రాగం తారాగణం::వెంకటేష్, భానుప్రియ, ముచ్చర్ల అరుణ, దేవి లలిత, జానకి, శైలజ, పావలా శ్యామల, ప్రియాంక, షరాన్ లోవెష్, సాక్షి రంగారావు, షణ్ముఖ శ్రీనివాస్, పొట్టి ప్రసాద్, మిశ్రో, సెల్వరాజ్, కె.యస్.టి.శాయి తదితరులు.

పల్లవి::

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
నటనాంజలితొ బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి రావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ 

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకె సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించె కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవళి ఓకారం కాని 

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ 

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆ ఆ ఆ ఆ
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోదు ఎక్కడా ఆ ఆ ఆ ఆ
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా ఆ ఆ ఆ ఆ
ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా ఆ ఆ ఆ ఆ
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా 
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ 

లలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో వికశిత శత దళ శోభల సువర్ణ కమలం 

పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి రావా
మది కోరిన మధు సీమలు వరించి రావా

స్వధర్మే మిధనం ష్రేయహ పర ధర్మో భయావహ

Swarna kamalam--1988 
Music::Ilaiyaraaja 
Lyricist::Sirivennela 
Singers::S.P.Balu,P Susheela
Banner::Bhanu Art creations
Producer::K.Benarji
Director::K. Vishwanath
Cast::Venkatesh, Bhanupriya


shivapoojaku chivurinchina siri siri muvva
siri siri muvva siri siri muvva
mrudumanjula padamamjari poochina puvvaa
siri siri muvva siri siri muvva
yatiraajuku jatisvaramula parimalamivva
siri siri muvva siri siri muvva
natanamjalito bratukunu tarinchaneeva
siri siri muvva siri siri muvva

parugapaka payaninchave talapulanava
kerataalaku talavanchite tragadu trova
yedirinchina sudigalini jayinchinava
madikorina madhuseemalu varinchi rava

padamara padagalapai merise taaralakai
padamara padagalapai merise taaralakai 
ratrini varinchake sandhyaasundari
toorupu vedikapai vekuva nartakivai
toorupu vedikapai vekuva nartakivai 
dhatrini muripinche kaantulu chindani
nee kadalika chaitanyapu shreekaram kani
nidaurinchina hrudayaravali omkaram kani

shivapoojaku chivurinchina siri siri muvva
siri siri muvva siri siri muvva
mrudumanjula padamamjari poochina puvvaa
siri siri muvva siri siri muvva

tana velle sankellai kadalaleni mokkala
aamanikai yeduru choostoo agipoku yekkada
avadhi leni andamundi avaniki naludikkulaa
anandapu gaalivalu nadapanee ninnilaa
pratirojaoka navageetika swagatinchaga
vennela kinneraganam neekutoduga
parugapaka payaninchave talapulanava
kerataalaku talavanchite tragadu trova

chalitacharana janitam nee sahaja vilasam
jvalita kirana kalitam soumdarya vikaasam
nee abhinaya ushodayam tilakinchina ravinayanam
gaganasarasi hrudayamlo vikasita shatadala 
shobhala suvarnakamalam

parugapaka payaninchave talapulanava
kerataalaku talavanchite tragadu trova
yedirinchina sudigalini jayinchinava
madikorina madhuseemalu varinchi rava

swadharme midhanam preyaha para dharmo bhayaavaha