Monday, May 16, 2011

రాజా--1976సంగీతం::చక్రవర్తి 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,కాంతారావు,జయమాలిని,అల్లు రామలింగయ్య.

పల్లవి::

మా యింట వెలసిన..మహలక్ష్మివీ
నా కంటి..వెలుగైన..దీపానివీ
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

చరణం::1

కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా..ఆ
కన్నీటితో నవ్వు..కలిపిచూడమ్మా
ఇన్నాళ్ళ చీకటీ..వెన్నెలౌనమ్మా
కలతలేని నిదురలో..ఓ..గడిచిపోవు రాత్రిలా..ఆ
కలతలేని నిదురలో..గడిచిపోవు రాత్రిలా 
కమ్ముకున్న కడగళ్ళు కరిగిపోవునమ్మ కరిగిపోవునమ్మా

నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా

చరణం::2::

అన్నయ్య వస్తాడు..ఆనందం తెస్తాడూ
తోడబుట్టిన మాకూ..తోడుగా ఉంటాడూ
కన్నతల్లి కలలన్నీ కనుల విందు చేస్తాడూ..ఊ
కన్నతల్లి కలలన్నీ..కనుల విందు చేస్తాడూ
ఈ బాబు మాటలు..నమ్మవా..అమ్మా 
నమ్మవా...అమ్మా..అమ్మా
నీ నవ్వు లేకుంటే..చీకటేనమ్మ
నీ కనుల కనీళ్ళు..చూడలేనమ్మా