Sunday, September 30, 2007

రోజులు మారాయ్--1955





సంగీతం::మాష్టర్ వేణురచన::కోసరాజుగానం::జిక్కి


సంగీతం::మాస్టర్ వేణు

రచన::కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం::జిక్కీ , కృష్ణవేణి
వహిదారెహమాన్ నాట్యం చెసిన పాట  

ఈ సినిమాలో
వహీదా రెహ్మాన్ పరిచయమై హిందీ చిత్రసీమలో
హీరోయిన్ గా స్థిర పడింది. ఈ చిత్రంలో ఆమె ఓ నృత్య
సన్నివేశంలో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో జిక్కీ
గానం చేసిన ఏరువాక సాగారో రన్నా-చిన్నన్నపాటకు నృత్యం
చేసింది.

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా                  
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::1

నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
ముల్లుగర్ర నువు చేత బట్టుకుని 
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని
                   
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::2

పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు కురిసె           
పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు కురిసె
వాగులు వంకలు వురవడి జేసె
ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసె
                    
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::3

కోటేరును సరిజూసి పన్నుకో
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలు తప్పక కొంద వేసుకో
యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో
                 
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::4

పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులొ మేడలు కట్టేవారు
బ్యాంకులొ డబ్బు దాచేవారు
ఈ తట్టిని గమనించరు వారు 
                   
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::5

పల్లెటూళ్ళలో చల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు                       
ప్రజాసేవయని అరచేవాళ్ళు 
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు 
                    
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

చరణం::6

పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే
ఓట్లు గుంజి నిను మోసేవాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవో                        
నీవే దిక్కని వత్తురు పదవో
రోజులు మారాయ్..రోజులు మారాయ్
మారాయ్ మారాయ్..మారాయ్ రోజులు మారాయ్
        
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

కోడలు దిద్దిన కాపురం--1970 రాగం::సింధుబైరవి


సంగీతం:T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం:Pసుశీల

తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ, జగ్గయ్య,సావిత్రి,రేలంగి,సూర్యకాంతం 

రాగం::సింధుబైరవి!!

నీ ధర్మం నీ సంఘం
నీదేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన
మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

1)సత్యంకోసం సతినే అమ్మిన దెవరూ ?
" హరిశ్చంద్రుడు "
2)తండ్రిమాటకై కానలకేగిన దెవరూ ?
" శ్రీరామచంద్రుడు "
3)అన్నసేవకై అంకితమైనది ఎవరన్నా ?
" లక్ష్మన్న "
4)పతిఏదైవమని తపించిపోయిన దెవరమ్మా ?
" సీతమ్మా "
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం
అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం

!!నీ ధర్మం నీసంగం !!

చేపకూటితో సమతను నేర్పిన
నాటి పలనాటి " బ్రహ్మన్న "
మేడిపండులా మెరిసే సంఘం
గుట్టువిప్పెను " వేమన్నా "
వితంతువుల విధి వ్రాతలు మార్చి
బ్రతుకును పండించే " కందుకూరి "
తెలుగు భారతిని ప్రజల భాషలో
తీరిచి దిద్దెను " గురుజాడా "
ఆ సంస్కర్తల ఆశయరంగం
నీవు నిలిచిన సంఘం
నీవునిలిచిన ఈ సంఘం

!! నీ ధర్మం నీ సంఘం !!

స్వతంత్ర భారత రథసారధియై
సమరాన ధూకే " నేతాజి "సత్యగ్రహమే సాధనమ్ముగా
స్వరాజ్యమే
తెచ్చె " బాపూజీ "
గుండె కెదురుగా గుండె నిలిపెను
" ఆంద్రకేసరి టంగుటూరి "తెలుగువారికొక రాష్రం కోరి
ఆహుతి ఆయెను " అమరజీవి "
ఆ దేశభక్తులు వెలసిన దేశం
నీవు పుట్టిన భారత దేశం
నీవు పుట్టిన భారత దేశం
!! నీ ధర్మం నీ సంఘం !!

సాక్షి--1967



ఈ పాట మీకు వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవిమీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనావాడదురా వాడదురా
బతకరా బతకరా పచ్చగా

చల్లని అయితేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లవేళ కంటనీరు వద్దురా నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా
బతకరా బతకరా పచ్చగా

నా కొంగు నీ చెంగూ ముడివేయరా నాచేయి నీ చేయి కలపరా
ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా
బతకరా బతకరా పచ్చగా

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా

సాక్షి--1967



ఈ పాట మీకు వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర దాశరధి
గానం::మోహన్ రాజు


పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి?
యమపాశం..ఫలితం ఏమిటి యమపాశం

ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం
ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం

నిజము నిప్పులాంటిదెప్పుడు..నిన్ను దహించకా తప్పదు
నిజము నిప్పులాంటిదెప్పుడు..నిన్ను దహించకా తప్పదు
లేదూ లేదురా న్యాయము..లేదూ లేదురా న్యాయము
నీకు చావు ఒక్కటే సాయము..
నిట్టూర్చే భూమి..నిదురించే గాలి..నిను చూసి నవ్వింది ఆకాశం

ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం

వేసిన తలుపులు తియ్యరు..మూసిన కన్నులు తెరవరు
వేసిన తలుపులు తియ్యరు..మూసిన కన్నులు తెరవరు
ఎంత పిలచినా పలకరు..ఎంత పిలచినా పలకరు
నీకై రవంత కన్నీరు విడవరు...
చుట్టాలు లేరు..పక్కాలు లేరు..నీ నీడతో చేయీ సావాసం

ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం

చందమామ నిజము చూడకు..చూసినా సాక్ష్యము చెప్పకు
చందమామ నిజము చూడకు..చూసినా..సాక్ష్యము చెప్పకు
పరిగెత్తి వస్తోంది రాహువు..అయ్యో తరిగి పోతున్నాది ఆయువు
పరిగెత్తి వస్తోంది రాహువు..అయ్యో తరిగి పోతున్నాది ఆయువు
దైవానికైనా దయ లేదు లేదు..ఒంటిగా చేరవోయ్ కైలాసం
రారు రారు రారు నీ కోసం..ఎవరికి వారే ఈ లోకం
రారు రారు..

వాగ్దానం--1961::హరికథ::రాగమాలిక



హరికథ !! రాగమాలిక !!

సంగీతం: పెండ్యాల
రచన:పోతన,కరుణశ్రీ,శ్రీశ్రీ
గానం: ఘంటసాల

!! కానడ రాగం !!

శ్రీ నగజా తనయం సహృదయం 2
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం సహృదయం

శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కల్యాణ సత్కథ. నలభైరోజుల
నుండి చెప్పిన కథ చెప్పినచోట చెప్పకుండ చెప్పుకొస్తున్నాను. అంచేత
కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా కాస్త పాలు మిరియాలు !

చిత్తం. సిద్ధం.

భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన
వీరాధివీరులలో అందరిని ఆకర్శించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి
ఆహా, అతడెవరయ్యా అంటే -

!! శంకరా భరణ రాగం !!

రఘురాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు 2
వాడు, నెలరేడు, సరిజోడు, మొనగాడ
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా (వాని కనులు)
వాని చూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరోమరుడు, మనోహరుడు (రఘు రాముడు)

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతహ్పు
గవాక్శం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో

!! మోహన రాగం !!

ఎంత సొగసుగాడే 2
మన నింతలోనె దోచినాడే (ఎంత)
మోము కలువ రేడే 2
నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే (ఎంత)

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా,అక్కడ స్వయంవర సభా
మంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి -

!! తోడి రాగం !!

అనియెనిట్లు, ఓ యనఘులార నా యనుగుపుత్రి సీతా
వినయాధిక సద్గుణవ్రాత, ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెలమాలవైచి పెండ్లాడు !

అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే సభలోనివారందరూ
ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట.మహావీరుడైన రావణాసురుడు
కూడ " హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని శాపము ! దీనిని
స్పృచించుటయే మహాపాపము"అని అనుకొనినవాడై వెనుతిరిగిపోయాడట.
తదనంతరంబున -

!! శ్రీ రాగం !!

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొ క్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదం తలదాల్చి
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనముని తనకరమున బూనిన యంత

!! కేదారగౌళ రాగం !!

పెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె,
గుభిల్లుమనె గుండె నృపులకు,ఝల్లుమనియె
జానకీ దేహముం ఒక్క నిమేశమునందె
నయం జయమును భయము విస్మయముగదుర !

శ్రీమద్రమారమణ గోవిందో హారి
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగావుంది.మరొక్కసారి జై
శ్రీమద్రమారమణ గోవిందో హారి ! భక్తులారా ! ఆవిధంగా శ్రీరామ
చంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడుట.అంతట

!! కల్యాణి రాగం !!

భూతలనాధుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె పృధుగుణ మణి సంఘాతం భాగ్యోపేతం సీతం
భుతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
శ్రీమద్రమారమణ గోవిందో హారి !!!