Friday, July 31, 2015

విచిత్రకుటుంభం--1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::K.S.prakaasha Rao
తారాగణం::N.T.రామారావి,సావిత్రి,విజయలలిత,జ్యోతిలక్ష్మి,విజయనిర్మల,శోభన్‌బాబు,కృష్ణ,

కాఫీ::రాగం

పల్లవి::

నలుగురు నవ్వేరురా..ఆ..స్వామి
నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..అవ్వ..
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ

చరణం::1

వెన్నచిలికే వేళ..చక్కిలిగిలి చేసి
దండలల్లేవేళ రెండూ..కళ్ళూ మూసి
వెన్నచిలికే వేళ..వెన్నచిలికే వేళ
వెన్నచిలికే వేళ..చక్కిలిగిలి చేసి
దండలల్లేవేళ రెండూ..కళ్ళూ మూసి
ఒంటిగా ఏమన్నా..ఆఆఆ..ఒంటిగ ఏమన్నా
ఓరకుంటినిగాని..రచ్చపట్టున నన్ను
రవ్వచేయు పాడికాదులేరా..ఆఅ

నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..అవ్వ..ఆ ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ 

చరణం::2

పొన్నచెట్టున చేరి..పొంచినటుల కాదు
చీరలను కాజేసి..చేరినటుల కాదు
పొన్నచెట్టున చేరి..పొంచినటుల కాదు
చీరలను కాజేసి..చేరినటుల కాదు
కన్నెమనసే వెన్న..గమనించరా కన్నా
అన్నీ తెలిసిన నీవే..ఆగడాలు చేయనేల ఔనా..ఆ

నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా..ఆ..అవ్వ
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ

Vichitrakutumbham--1969
Music::T.V.Raaju 
Lyrics::D.C.Naaraayanareddi
Singer::P.Suseela
Film Directed By::K.S.prakaasha Rao
Cast::N.T.Raamaaraavi,Saavitri,Vijayalalita,Jyotilakshmi,Vijayanirmala,Sobhanbaabu,Krishaa.

kaaphii::raagam

::::::::::::::::::::::::::::::::::::::::

naluguru navvEruraa..aa..swaami
naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..avva..
naluguru navvEruraa..aa aa aa aa

::::1

vennachilikE vELa..chakkiligili chEsi
danDalallEvELa renDoo..kaLLuu moosi
vennachilikE vELa..vennachilikE vELa
vennachilikE vELa..chakkiligili chEsi
danDalallEvELa renDoo..kaLLuu moosi
onTigaa Emannaa..aaaaaaaa..onTiga Emannaa
OrakunTinigaani..rachchapaTTuna nannu
ravvachEyu paaDikaadulEraa..aaaa

naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..avva..aa aa aa aa
naluguru navvEruraa..aa aa aa aa 

::::2

ponnacheTTuna chEri..ponchinaTula kaadu
cheeralanu kaajEsi..chErinaTula kaadu
ponnacheTTuna chEri..ponchinaTula kaadu
cheeralanu kaajEsi..chErinaTula kaadu
kannemanasE venna..gamanincharaa kannaa
annii telisina neevE..AgaDaalu chEyanEla ounaa..aa

naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..aa aa aa aa
naluguru navvEruraa..aa..avva
naluguru navvEruraa..aa aa aa aa

జగదేకవీరుని కథ--1962 ::కాఫీ::రాగం



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::P.లీల,P.సుశీల
Film Directed by::Kadiri Venkata Reddy
తారాగణం::N.T.రామారావు,రాజనాల,C.S.R.ఆంజనేయులురేలంగి,ముక్కామల,మిక్కిలినేని,నల్లరామమూర్తి,B.సరోజ,కన్నాంబ,జయంతిL.విజయలక్ష్మి,బాల,ౠష్యంద్రమణి,గిరిజ.

కాఫీ::రాగం 

పల్లవి::


ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ

కలుగునే నీవంటి సాద్వి..అత్తగామాకూ..ఊఊఉ
తొలిమేము జేసిన పుణ్యమునగాక..ఆఆఆఅ

ఆ..మందారమాలతీపారిజాతలతో..ఓఓఓఓఓఓఓ
అందముగ ముడివేసి..అలరజేసేమూ..ఊఊఊ

ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ

మనసు చల్లనకాగ..మంచి గంధముపూసీ..ఈఈఇ
మా ముచ్చటలు తీర్ప..మనవి చేసేమూ..ఊ
ఆఆ..పారాణి వెలయించీ..పాదపూజను జేసీ..ఈఈఈ
కోరికలు తీరునని..పొంగిపోయేమూ..ఊఊఊఊఊ

ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ 

Jagadekaveerunu Katha--1961
Music::Pendyaalanaageswararaavu
rachana::Pingali Naagendraraavu
gaanam::P.leela,P.Suseela
Film Directed by::Kadiri Venkata Reddy
Cast::N.T.Raamaaraavu,Raajanaala,C.S.R.AnjanEyulu,Relangi,Mukkaamala,Mikkilineni,Nallaraamamoorti,B.Saroja,Kannaamba,Jayanti,L.Vijayalakshmi,Baala,Rushyndramani,Girija.

:::::::::::::::::::::::::::::::::::::::::::

Adilakshmi vanTi attaagaarivammaa
Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa

kalugunE neevanTi saadwi..attagaamaakoo..uuuuu
tolimEmu jEsina puNyamunagaaka..aaaaaaaaaa

aa..mandaaramaalatiipaarijaatalatO..OOOOOOO
andamuga muDivEsi..alarajEsEmoo..uuuuuu

Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa

manasu challanakaaga..manchi gandhamupoosii..iiiii
maa muchchaTalu teerpa..manavi chEsEmoo..uu
AA..paaraaNi velayinchii..paadapoojanu jEsii..iiiiii
kOrikalu teerunani..pongipOyEmoo..oooooooooo

Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa 

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::J.V.రాఘవులు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూంది
వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూంది

చరణం::1

నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ 
నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ 
అల్లరల్లరిగ తిరగాలంటే సరదాగుంటుందీ
హద్దులన్నా పెద్దలన్న కోపంవస్తుందీ
పైట నిలవదూ పక్క కుదరదూ
పగలు తరగదూ రాత్రిగడవదూ
ఏదో గుబులుగుబులుగా వుందీ
ఎదలో గుబగుబమంటుందీ
వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుందీ
లోపల తికమక పెడుతూందీ

చరణం::2

ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
కళ్ళుకలిస్తే గుండె ఎందుకో ఝల్లుమంటుందీ
నీ కౌగిలిలోనా కన్నెతనం కరిగేపోతుందీ
నినుమెచ్చాను మనసిచ్చాను
నిలువున దోచి నీకే యిచ్చాను
ఏదో హాయిహాయిగా వుందీ
ఎక్కడికో తేలితేలి పోతుందీ
హాయిహాయిగా..వుందీ 
తేలితేలి....పోతుందీ
వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు 
పెద్దలులేక హద్దులు తెలియక
చిందరవందర అయింది బ్రతుకు
అమ్మా...అమ్మా...అమ్మా