Thursday, November 10, 2011

హారతి--1974



సంగీతం::చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల,S.జానకి 
తారాగణం::కృష్ణం రాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల, హలం

పల్లవి::

ఎవరు ముందు పాడినా..ఆ పాట వొకటే
ఎవరు ముందు పాడినా..ఆ పాట వొకటే
ఏ గోట మీటినా..ఆ..ఆ రాగ మొకటే 
ఎవరు ముందు పాడినా..ఆ పాట వొకటే
పా ద ద ద సరిదపనిస సరి నిస దని 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

చరణం::1

ఈ యింటి అత్తగారు..మా అమ్మకు మారు పేరు 
మా యింటి కోడలమ్మ..మహలక్ష్మి రూపమమ్మ 
తీయని మమతల ప్రతిబింబాలు..ఈ యింటి తండ్రీ కొడుకులు 
తీయని మమతల ప్రతిబింబాలు..ఈ యింటి తండ్రీ కొడుకులు
అందరికీ కనువెలుగు చిన్నారీ..మా బాబు..మా బాబు  
ఎవరు ముందు పాడినా..ఆ పాట వొకటే                

చరణం::2

ఈ యింటి దీపాలు..ఎప్పుడూ వెలిగేవే
ఈ యింటి తోరణాలు..ఎప్పుడూ పచ్చనివే
అందరమూ పొందిన వరాలు..ఆనంద సౌభాగ్యాలు 
అందరమూ పొందిన వరాలు..ఆనంద సౌభాగ్యాలు
ఎన్నెన్నో జన్మలకూ ఈ బంధం..ఉంటే చాలు అదే పదివేలు 
ఎవరు ముందు పాడినా..ఆ పాట వొకటే