సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,G.వరలక్ష్మి
పల్లవి::
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
వయసొచ్చిన పిల్లకు..ఆన్నిటి కంటే
వలపే అందము..వలపే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చరణం::1
కొమ్మకు పువ్వులందము..పూలకు తావులందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
రేయికి చుక్కలందము..చుక్కలకు చంద్రుడందమూ
నీ నల్లని సిగలో...తెల్లని మల్లెలు
తళుకే అందము...తళుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చరణం::2
పాటకు రాగమందము..ఆ ఆ ఆ ఆ ఆ
పాటకు రాగమందము..ఆటకు తాళమందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
కళ్లకు కాటుకందము..కాళ్లకు గజ్జలందమూ
నీ వెచ్చని కౌగిట...ఊయలలూగే
బ్రతుకే అందము..బ్రతుకే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ
చరణం::3
నింగికి మబ్బులందము..మబ్బుకు మెరుపులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ
మోముకు తిలకమందము..పెదవికి నవ్వులందమూ
నీ నీడను తోడును...కోరే
నాకు నీవే అందము..నీవే అందమూ
చేతికి గాజులందము..చెంపకు సిగ్గులందమూ