Friday, November 26, 2010

వెలుగు నీడలు--1961::రాగమాలిక






సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::శ్రీ శ్రీ , కోసరాజు  
గానం:: జిక్కి , P.సుశీల ,P.G.కృష్ణవేణి 

{ వకుళాభరణం::రాగం  
చక్రవాకం::రాగం 
మాయామాళవ గౌళ::రాగం }

రాగమాలిక  

పల్లవి::

వకుళాభరణం::రాగం  

సావిత్రి:: 
చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు 

గిరిజ::
చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు

చరణం::1

గిరిజ:: 
పిడికిలి మూసిన చేతులు  
లేత గులాబీ రేకులు 
పిడికిలి మూసిన చేతులు
లేత గులాబీ రేకులు 
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు 

చల్లని వెన్నెల సోనలు  
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు 

చక్రవాకం::రాగం 

సుగుణ::
ఇంటను వెలసిన దైవము 
కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము 

ఇంటను వెలసిన దైవము 
కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము

చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు

చరణం::3

మాయామాళవ గౌళ::రాగం 

సుగుణ::
నోచిన నోముల పంటగ
అందరి కళ్ళకు విందుగా
నోచిన నోముల పంటగ
అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిథిగా
నీరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు

చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు 
తెల్లని మల్లెల మాలలు

No comments: