Thursday, March 26, 2009

*~*~*!~ అందరికీ హాపీ ఉగాది ~*~*~*~
!! virodhi nAma samvatsara ugAdi SubhAkAnkshalu !!
~*~*~* Ugadi Shubhakankshalu *~*~*~
!! ఉగాది ప్రాముఖ్యత !!

ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.
ఈ పండుగ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.


చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు.
అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది.
అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


!! ఉగాది పచ్చడి మహిమ ఏమిటీ? !!

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం -తీపి,పులుపు,కారం,ఉప్పు,వగరు,చేదు
అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు.
సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను,
కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఈ పచ్చడి కొరకు చెరకు,అరటి పళ్ళు,మామిడి కాయలు,వేప పువ్వు,
చింతపండు,జామకాయలు,బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు
"అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.
ఋతు మార్పు కారణంగా వచ్చే కఫ ,వాత,పిత్త, దోషాలను హరించే
ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో
ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు
మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.
ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

!! త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు !!

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని
ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,
ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది

ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం ,వడపప్పు చోటు చేసుకుంటాయి.
ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి
నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పు కూడా
వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుంది
కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది.ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే చేసుకోవడం ప్రారంభమైనది.

ముందు కాలంలో ఈ పండుగ రోజు విసనకర్రలు
పంచడం ఆనవాయితి.వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు ఇవి ఉపయోగ పడేవి
ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి,ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో
వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

Wednesday, March 18, 2009

మా తెలుగు తల్లికి మల్లె పూదండ!! రాష్ట్ర గీతం !!
రచన::శంకరం బాడి సుందరాచారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి
కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ !
జై తెలుగు తల్లీ !
జై తెలుగు తల్లీ!

!! raashTra geetam !!
rachana::Sankaram bADi sundaraachaari
maa telugu talliki malle poodaMDa
maa kanna talliki maMgaLaaratulu
kaDupulO baMgaaru kanu choopulO karuNa
chirunavvu lO sirulu doraliMchu maa talli

gala galaa gOdaari kadali pOtuMTaenu
bira biraa kRshNamma paruguliDutuMTaenu
baMgaaru paMTalae paMDutaayi
muripaala mutyaalu doralu taayi

amaraavatee nagara apuroopa Silpaalu
tyaagayya goMtulO taaraaDu naadaalutikkayya kalamulO tiyyaMdanaalu
nityamai nikhilamai nilachi yuMDae daaka

rudramma bhuja Sakti
mallamma patibhakti
timmarusu dheeyukti
kRshNaraayala keerti
maa chevula riMgumani maaru mrOgE daaka
nee aaTalae aaDutaaM
nee paaTalae paaDutaaM
jai telugu tallee !
jai telugu tallee !
jai telugu tallee!

Tuesday, March 10, 2009

ఆలు మగలు--1977సంగీతం::T.చలపతి రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి గానం::S.P.బాలు,P.సుశీ

Film Directed By::Tatineni RamaRao

తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,రాజబాబు,రమాప్రభ,సత్యనారాయణ

పల్లవి::

చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే
చెయైన వెయ్యవేమి ఓ బాబూదొర
చేయైన వెయ్యవేమి ఓ బాబూదొర ఉయ్యాలలూగవేమీ

చిగురేసే మొగ్గేసే..సొగసంత పుతపూసే
ఇవ్వాలని లేదా ఏమి..ఆ సొగసంతా 
ఇవ్వాలని లేదా ఏమి..ఓ సిరిపాప
ఎన్నాళ్ళు దాస్తావేమీ..ఈఈఈఇ

చరణం::1

ముట్టుకొంటే..ఉలికిపడతావ్
పట్టుకొంటే..జారిపోతావ్ 
ముట్టుకొంటే..ఉలికిపడతావ్
పట్టుకొంటే..జారిపోతావ్
నీ సూపులో వుంది..సూదంటు రాయి
పాపా..సిరి పాపా..ఆ
నీ సూపులో వుంది..సూదంటు రాయి
అదిరాజుకొంటే..ఒళ్ళంత హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే
చెయైన వెయ్యవేమి ఓ బాబూదొర
చేయైన వెయ్యవేమి ఓ బాబూదొర ఉయ్యాలలూగవేమీ..ఈ

చరణం::2

చేరుకొంటే ఉరుకొంటావ్..వల్లకుంటే గిల్లుతుంటావ్
చేరుకొంటే ఉరుకొంటావ్..వల్లకుంటే గిల్లుతుంటావ్
నీ చేతుల్లో వుందీ..చెకుముకిరాయీ
బాబూ....ఓ...బాబూ..ఊ
నీ చేతుల్లో వుందీ..చెకుముకిరాయీ
అదిరాచుకొంటే..నునుపైన హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే
ఇవ్వాలని లేదా ఏమి..ఆ సొగసంతా
ఇవ్వాలని లేదా ఏమి..ఓ సిరిపాప
ఎన్నాళ్ళు దాస్తావేమీ..ఈఈఈఇ

చరణం::3

నిన్ను కట్టుకోవాలని..మనసౌతాది
చేయి పట్టుకోవాలంతే..గుబులౌతాది
నిన్ను కట్టుకోవాలని..మనసౌతాది
చేయి పట్టుకోవాలంతే..గుబులౌతాది

గుబులెందుకింకా..గారాల చిలకా
ఎగిరెగిరి పోదామ..నెలవంక దాక
చిగురేసే మొగ్గేసే..సొగసంత పుతపూసే
చెయైన వెయ్యవేమి..ఓ బాబూదొర

చేయైన వెయ్యవేమి..ఓ బాబూదొర ఉయ్యాలలూగవేమీ

Alu Magalu--1977
Music::T.Chalapati Rao
Lyrics::D.C.Naraayana Reddi
Singer::P.Suseela,S.P.Baalu
Film Directed By::Tatineni Rama Rao
Cast::Akkineni,Vanisree,Rajabaabu,Ramaaprabha,K.Satyanaraayana.

::::::::::::::::

chigurEsE moggEsE sogasanta putapoosE
cheyaina veyyavEmi O baaboodora
chEyaina veyyavEmi O baaboodora uyyaalaloogavEmii

chigurEsE moggEsE sogasanta putapoosE
ivaalani lEdaa Emi aa sogasantaa
ivaalani lEdaa Emi O siripaapa
ennaaLLu daastaavEmii 

::::1

muTTukonTE ulikipaDataav
paTTukonTE jaaripOtaav 
muTTukonTE ulikipaDataav
paTTukonTE jaaripOtaav
nee soopulO vundi soodanTu raayi
paapaa..siri paapaa..aa
nee soopulO vundi soodanTu raayi
adiraajukonTE oLLanta haayi

chigurEsE moggEsE sogasanta putapoosE
cheyaina veyyavEmi O baaboodora
chEyaina veyyavEmi O baaboodora uyyaalaloogavEmii

::::2

chErukonTE urukonTaav..vallakunTE gillutunTaav
chErukonTE urukonTaav..vallakunTE gillutunTaav
nee chEtullO vundii chekumukiraayii
baaboo....O...baaboo...uu
nii chEtullO vundii chekumukiraayii
adiraachukonTE nunupaina haayi

chigurEsE moggEsE sogasanta putapoosE
ivaalani lEdaa Emi aa sogasantaa
ivaalani lEdaa Emi O siripaapa
ennaaLLu daastaavEmii

::::3

ninnu kaTTukOvaalani manasautaadi
chEyi paTTukOvaalantE gubulautaadi
ninnu kaTTukOvaalani manasautaadi
chEyi paTTukOvaalantE gubulautaadi
gubulendukinkaa gaaraala chilakaa
egiregiri pOdaama nelavanka daaka

chigurEsE moggEsE sogasanta putapoosE
cheyaina veyyavEmi O baaboodora

chEyaina veyyavEmi O baaboodora uyyaalaloogavEmii

Monday, March 09, 2009

బంగారు కలలు--1974

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల

పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా
కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా
కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా
కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా
నీ కోసమే నే జీవించాలి
నీవె పెరిగి నా ఆశెలు తీర్చాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

ఆటలలో చదువులలో మేటిగా రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
ఆటలలో చదువులలో మేటిగా రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
చీకటి హ్రుదయంలొ వెన్నెల కాయాలి
నా బంగారు కలలే నిజమై నిలవాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే తలచి నే పొంగిపోవాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

బంగారు కలలు--1974


చిమ్మటలోని పాట ఇక్కడ వినండి
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల


::::

చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆఆ
చెలికానిపై అలకెందుకే నీ జతగానితో..తగవెందుకే


చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా..ఆఆఆఆ
వలపేగాని నీపై అలకలేదింకా..ఆ ఆ ఆ
అనురాగమే గెలిచిందిలే..నీ మనసేమిటో..తెలిసిందిలే


గననానమేఘంతొలిగిందిలే..రవిమోమునేడువెలిగిందిలే
గననానమేఘంతొలిగిందిలే..రవిమోమునేడువెలిగిందిలే
అనుమానాలు తీరాలి అభిమానాలు పెరిగాయి
అనురాగమే గెలిచిదిలె నీ మనసేంటో.తెలిసిందిలే


చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
చెలికానిపై అలకెందుకే


నా ప్రేమగీతం నీవేలే..ఆ పాట భావం నీవేలే
నా ప్రేమగీతం నీవేలే..ఆ పాట భావం నీవేలే
కమ్మని రాగం నీవైతే..కలసిన తాళం నీవైతే
ఆ గానమే మన ప్రాణమూ..నీ మీదనే నా ధ్యానమూ


చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
చెలికానిపై అలకెందుకే


నీ బుగ్గమీద నే చుక్కనై..పాదాలపైన పారాణినై
నీ బుగ్గమీద నే చుక్కనై..పాదాలపైన పారాణినై
పచ్చని పెళ్ళి పందిరిలో..ముచటగొలిపె సుందరినీ
ఈ నాటితో నవజీవనం..మనజీవితం బౄందావనం

చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
అనురాగమే గెలిచిందిలే..నీ మనసేమిటో..తెలిసిందిలే

Sunday, March 08, 2009

జాకి --1985

సంగీతం::SP.బాలు
రచన::వేటూరి
గానం::S.జానకి


అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ
అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ


నిన్ను చూడకున్న..నీవు చూడకున్నా
నిదురపోదు కన్ను..నిశిరాతిరీ
నీవు తోడులేక..నిలువలేని నాకూ
కొడిగట్ట నేలా కొనఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోనూ నిట్టూర్పు జోలా
ఈ పూల బాణాలూ..ఈ గాలి గంధాలూ
సోకేను నా గుండెలో..సొదలేని సయ్యాటలో


అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ

పూటకొక్క తాపం..పూలమీద కోపం
పులకరింతలాయే..సందె గాలికీ
చేదు తీపి ప్రాణం..చెలిమి లోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సముఖాన వున్నా రాయబారమాయే
చాటు మాటు నేవో రాసలీలలాయే
ఈ ప్రేమ గండాలు..ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో..కలిసేది ఏనాటికో

అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ

Monday, March 02, 2009

అమావాస్య చంద్రుడు--1981
సంగీతం::ఇళయరాజ
రచన::వేటురి
గానం::S.P.బాలు


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
కళకే కళవీ..అందమూ..ఏకవీ రాయనీ తీయనీ కావ్యమూ
కళకే కళవీ..అందమూ..ఊ..ఊ..

నీలి కురులు పోటీపడెను..మేఘమాలతో
కోలకనులు పంతాలాడే..గండుమీనతో
మధనమో..జలజమో..రుదురదీ ఫళకమో
చెలికంఠం పలికే స్రీశంఖము

కళకే కళవీ..అందమూ..ఊ..ఊ..

పగడములను ఓడించినవి..చిగురు పెదవులూ
హ్హ..ఆ.ఆ.ఆ.
వరుసతీరి మురిసే కళ్ళు మల్లెపొదుగులూ
చూపులో తూపులో చెంపలో కెంపులో ఒక అందం ఎదలో దోబూచులు

కళకే కళవీ..అందమూ..ఊ..ఊ..

తీగలాగ ఊగే నడుము ఉండి లేనిదీ
దాని మీద పూవై పూచి దాగిఉన్నదీ
కరములో కొమ్మలో కాళ్ళవీ..?
నీ రూపం ఇలలో అపురూపము

కళకే కళవీ..అందమూ..ఊ..ఊ..

Amavasya Chandrudu--1981
Music::Ilayaraja
Lyricist::Veturi
Singer's::P.Balu 

mm mm mm mm mm
kaLakae kaLavee..aMdamoo..
aekavee raayanee teeyanee kaavyamoo
kaLakae kaLavee..aMdamoo..oo..oo..

neeli kurulu pOTeepaDenu..maeghamaalatO
kOlakanulu paMtaalaaDae..gaMDumeenatO
madhanamO..jalajamO..ruduradee phaLakamO
chelikaMThaM palikae sreeSaMkhamu

kaLakae kaLavee..aMdamoo..oo..oo..

pagaDamulanu ODiMchinavi..chiguru pedavuloo
hha..aa.aa.aa.
varusateeri murisae kaLLu mallepoduguloo
choopulO toopulO cheMpalO 
keMpulO oka aMdaM edalO dOboochulu

kaLakae kaLavee..aMdamoo..oo..oo..

teegalaaga oogae naDumu uMDi laenidee
daani meeda poovai poochi daagiunnadee
karamulO kommalO kaaLLavee..?
nee roopaM ilalO apuroopamu

kaLakae kaLavee..aMdamoo..oo..oo..oఅమవాస్య-చంద్రుడు--1981::వసంత::రాగం
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి


రాగం::వసంత

సరిగమపదని సప్తస్వరాలు నీకు
అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు
మనసే ఒక మార్గము మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకూ దైవము


సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో


ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మోవుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో


అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ


కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమోAmavasya Chandrudu--1981
Music::Ilayaraja
Lyricist::Veturi SundaraRamamurthy
Singer's::P.Balu ,S.Janaki

sarigamapadani saptaswaralu meeku
avi yedu rangula indradhanussulu maku
manase oka margamu mamate oka deepamu
aa veluge maku daivamu

sundaramo sumadhuramo chandurudandina chandana sheetalamo
malayaja maruta sheekaramu manasija raga vasheekaramu(2)

aanandaale bhogaalaite hamsaa nandi raagaalaite
navavasanta gaanaalevo saagenule
sura veenaa nadalenno mogenule
vekuvalo vennelalo
chukkalu chudani konalalo
mavula kommala ugina koyila venuvuludina geetikalo..

andaalannee ande vela
bandhaalannee ponde vela
kannullo gangaa yamuna pongenule
kougitlo sangamamemdo sagenule
korikale chaarikalai aadina paadina sandadilo
mallela tavula pillanagrovulu pallavi padina pandirilo

Sunday, March 01, 2009

తిక్క శంకరయ్య--1968సంగీతం::TV.రాజు
రచన::Dr.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల

తొలికోడి కూసింది..తెల తెలవారింది
వెలుగులలొ జగమంతా..జలకాలాడింది
తొలికోడి కూసింది..తెల తెలవారింది

దూరాల ఆకాశ తీరాల
బంగారు హారాలు..వేసెను కిరణాలు
ఈ వేళ విరిసే..భావాల మెరిసే
శ్రీ వేంకటేశుని చరణాలు..శ్రీ వేంకటేశుని చరణాలు
తొలికోడి కూసింది..తెల తెలవారింది

అనురాగవల్లి..ఆతీగవల్లి..అలరారె..తనపూల పాపలతో
తొలిచూరులేగ తలవూపి రాగ..తొలిచూరులేగ తలవూపి రాగ
పులకించె గోమాత చేవులతో..పులకించె గోమాత చేవులతో

తొలికోడి కూసింది..తెల తెలవారింది
వెలుగులలొ జగమంతా..జలకాలాడింది
తొలికోడి కూసింది..తెల తెలవారింది

తిక్క శంకరయ్య--1968


సంగీతం::TV.రాజు
రచన::C.నారాయణ రెడ్డి 
గానం::P.సుశీల
రాగం::

వగకాడ బిగువేలరా..
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ
ఇ సొగసైన చినదాని బిగికౌగిలీ చేర
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ
వగకాడ బిగువేలరా..ఆ


కన్ను సైగలు చేసి చేసీ..
నా కడకొంగు నునుకేలదూసీ..ఆ ఆ
కన్ను సైగలు చేసి చేసీ..
నా కడకొంగు నునుకేలదూసీ
ఎన్నో భాసలు చేసి..ఏవో ఆశలు చూపి
ఎన్నో భాసలు చేసి..ఏవో ఆశలు చూపి
వింత వింత గిలిగింతచేసి
మరి అంతలోనే మాయమైతివేరా
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ
వగకాడ బిగువేలరా..ఆ


అర్థ రాతిరి నిదురలేపీ
చెక్కుకట్టంబుపై చేలుమోపీ..ఆ ఆ ఆ
అర్థ రాతిరి నిదురలేపీ
చెక్కుకట్టంబుపై చేలుమోపీ
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి
నవ్వూలు విరబూసి పూవూ బాణము వేసి
కొంచి కొంచి కవ్వించువేల
నుడికించనేల చెంతచేర రారా..ఆ..ఆ
వగకాడ బిగువేలరా..ఆ ఆ ఆ
వగకాడ బిగువేలరా..ఆ

వాడే వీడు--1973
సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన:;దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ...జాబిలీ

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ జాబిలీ

రేగించే వంటరి వేళలో
వణికించే ఈ చలి గాలిలో..ఓ
రేగించే వంటరి వేళలో
వణికించే ఈ చలి గాలిలో
నా తనువే తడబడుతున్నదీ
చెలిసాయం కావాలన్నదీ
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ...జాబిలీ

ఒక ఆడది ఒంటిగ దొరికితే
మగధీరులకుండే తెగులిదే..
ఒక ఆడది ఒంటిగ దొరికితే
మగధీరులకుండే తెగులిదే
నీ గడసరి వగలిక చాలులే
..మ్మ్..హు..లోంగే ఘటమిది కాదులే
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి
జాబిలీ....ఈ....కోమలీ

నీ మదిలో సంగతి తెలుసులే
అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే
అది దాచాలన్నా దాగదులే
నువు కోసేవన్నీ కోతలే
నీ పాచికలేవీ పారవులే
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ....జాబిలీ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హే..హే..ఓహో..హో..
హో..