సంగీతం::పుహళేంది
రచన::ఆరుద్ర
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి
పల్లవి::
ఆఆఆ ఆ ఆహ్హా ఆహాహా హ్హా
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
తొలిరేయి...మరలా రాదమ్మా
తొలిరేయి...మరలా రాదమ్మా
ఈ తొలిహాయి...మరచేది కాదమ్మా
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
చరణం::1
పాల కడవలో...ఆలూమగలు
గాలించి తీయాలి..నగలు గారాల నగలు
ఆఆఆ..పాల కడవలో...ఆలూమగలు
గాలించి తీయాలి...నగలు
బువ్వాల బంతిలో..నవ్వులే కలబోసి
భుజియించగలగాలి..వగలు మురిపాల వగలు
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
చరణం::2
లాలలలలలా లలలలలా
తాననం తాననననం
తానననం..మ్మ్..
గంథాలు పూసే...మునివేళ్ళు
మగ గుండె తొక్కింది...పరవళ్ళు
గంథాలు పూసే...మునివేళ్ళు..హ్హా
మగ గుండె తొక్కింది...పరవళ్ళు
పన్నీటి జల్లుతో...పెనుకాక తగ్గించి
పైటచాటున నవ్వె..పలుమార్లు పడతి పలుమార్లు
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
చరణం::3
తానం తనంత తనంత తననత తొం తననం
తానననం తాననననం తానననం తత్తొననం తనం
హ్హా హా హ్హా హా..
పంతాలతో ఇపుడు...బంతులాడేరు
ఏకాంతమున ఎంత ఆడేరో..ఏ సరసమాడేరో
ఆఆఆ..పంతాలతో ఇపుడు...బంతులాడేరు
ఏకాంతమున...ఎంత ఆడేరో
ఒకరికి ఇంకోకరు...ఒక్కింత తగ్గరు
ఈ ఏడు వీళ్ళు ఇద్దరు మీదటికి..కావాలి ముగ్గురు
పెళ్ళి నూరేళ్ళ పంట...ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
తొలిరేయి మరలా...రాదమ్మా
ఈ తొలిహాయి...మరచేది కాదమ్మా
పెళ్ళి నూరేళ్ళ పంట...ఓయమ్మా
వీళ్ళు అందాల జంట...ఔనమ్మా