చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి
ద్సంగీతం::K.V.మహదేవన్
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::L.R.ఈశ్వరీ,ఘంటసాల
పల్లవి::
ఆమె:::
పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా ఓ మావయ్యా
మావయ్యా మావయ్యా
అతడు:::
గలా గలా నవ్వేటి గంగమ్మా
బంగారు మేడలెన్నో కట్టానమ్మా
గంగమ్మా ఓ గంగమ్మా గంగమ్మా ఓ గంగమ్మా
చరణం::1
ఆమె:::
అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ
అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ 2
లక్షలు వచ్చేదాక కాచుకొన్నాడూ
అందాక మోజులన్ని దాచుకొన్నాడూ 2
మావయ్యా ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా ఓ మావయ్యా
అతడు:::
పైసలేంది దేవుడైన పలకరించడే
అతడు పలకరించడే 2
చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే
30 లక్షలు వచ్చే రోజు వున్నదే
నీకు నాకు జతలేదని రాసివున్నదే
గంగమ్మా ఓ గంగమ్మా గంగమ్మా ఓ గంగమ్మా
చరణం::2
ఆమె:::
డాబు సరిగ కూసొంటే డబ్బు లొస్తాయా
మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా 2
మావయ్యా నీసంగతి తెలుసు లేవయ్యా
పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
హాయ్..... పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
మావయ్యా ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా ఓ మావయ్యా
అతడు:::
రంగడంటే అల్లాటప్ప రంగడు కాదే భలే రంగడు వీడే
నలుగురిలో దర్జాగ వెలిగి పోతాడే
అత్తకొడుకు ఎంతవాడో అపుడు చూస్తావు
అబ్బో అబ్బో అని నెత్తి ఏలుకొడ్తావు
గంగమ్మా ఓ గంగమ్మా గంగమ్మా ఓ గంగమ్మా
ఆమె:::
పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా ఓ మావయ్యా
మావయ్యా ఓ మావయ్యా.......