Thursday, November 13, 2008

అందరూ దొంగలే--1974






















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,V.రామకృష్ణ

పల్లవి::

ఓర్నాయాల చూశానురా ఈ వేళా
ఓర్నాయాల చూశానురా ఈ వేళా
పిల్లంటె పిల్లకాదు వర్ణించ వల్లకాదు
పిల్లంటె పిల్లకాదు వర్ణించ వల్లకాదు
అడగొద్దురో దానందచందాలూ

ఓర్నాయాల చూశావా ఈ వేళా
ఓర్నాయాల చూశావా ఈ వేళా
ఏమేమిచూశావు చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు చూసి ఏమిచేశావు  
చెప్పొద్దురో దానందచందాలు
ఓర్నాయాల చూశానురా ఈ వేళా

చరణం::1

చూశానొక పొగరబోతు గొడ్డునూ
అది చూపులతో కుమ్మిందీ కోడెనూ
చూశానొక పొగరబోతు గొడ్డునూ
అది చూపులతో కుమ్మిందీ కోడెనూ
అయ్యయ్యో గుండెల్లో దూసుకొనిపోయిందా
అది ఉండుండి మటెడుతూ వుందా గోవిందా
గుండెల్లో దూసుకొనిపోయిందా
అది ఉండుండి మటెడుతూ వుందా 
ఛ..ఛ..దూసుకొనీ పోనీక వాటేసుకున్నాను 
ముద్దొకటీ యిచ్చానూ ముక్కు తాడు వేశానూ
ముద్దొకటీ యిచ్చానూ ముక్కు తాడు వేశానూ 
కొయ్..కొయ్..కోతలు కొయ్  
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు 
అడగొద్దురో దానందచందాలు
ఓర్నాయాల చూశానురా ఈ వేళా

చరణం::2

నడిరేయిలోన నడిరేయిలోన 
సుడిగాలిలా గదిలోకి గబగబ వచ్చింది    
నన్ను సుట్టేసి సుడి తిరిగిపోయింది
నడిరేయిలోన సుడిగాలిలా గదిలోకి గబగబ వచ్చింది    
నన్ను సుట్టేసి సుడి తిరిగిపోయింది
ఆయ్యయ్యో ఓపలేని ఆతాపం ఒళ్ళంతా రగిలిందా 
దాని కోపంతో నీ గూబ పగిలిందా 
ఓపలేని ఆతాపం ఒళ్ళంతా రగిలిందా
దాని కోపంతో నీ గూబ పగిలిందా 
ఛ..ఛ..తెల్లవార్లు నాతోటె గడిపిందీ
తెల్లవార్లు నాతోటె గడిపిందీ
ఇక వెళ్ళలేనంటూ న వెంటపడిందీ
పడుతుంది..పడుతుంది     
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు
ఏమేమిచూశావు..చూసి ఏమిచేశావు  
అడగొద్దురో..దానందచందాలు  
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా
ఓర్నాయాల..చూశావా ఈ వేళా
ఓర్నాయాల..చూశానురా ఈ వేళా

అందరూ దొంగలే--1974



సంగీత::K. V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,V.రామకృష్ణ

పల్లవి::

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో మా అందరిలో 
నన్నే చేసుకో నన్నే చేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా 
నేనే పెళ్ళి చేస్తా

చరణం::1

నీకు తగ్గదాన్నోయ్..నీటైనదాన్నోయ్..ఆహా
వాటమున్న దాన్నొయ్..వగలున్న దాన్నోయ్..అవ్వా 
నీకు తగ్గదాన్నోయ్..నీటైనదాన్నోయ్
వాటమున్న దాన్నొయ్..వగలున్న దాన్నోయ్
వగలు సైగచేస్తే..పరుగు పరుగునా వచ్చి
రేయంతా నీ కలలో కరిగిపోతానోయ్
కరిగిపోతానోయ్
  
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో..మా అందరిలో 
నన్నే చేసుకో నన్నే చేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం 
నేనే పెళ్ళి చేస్తా..మీ అందరికీ
నేనే చేస్తా..నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

చరణం::2

గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
కోరమీసం నీది..కొంటె చూపు నాది
కోరమీసం నీది..కొంటె చూపు నాది
కోరి కోరి ఆ రెండు కోలాటం ఆడాలి ఆడాలి 

గుడుగుడు గుంచం  గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో..మా అందరిలో 
నన్నే చేసుకో నన్నేచేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో..నన్నే పెళ్ళి చేసుకో

చరణం::3

పొంగుతున్న ఒంపుల్లో పొగరునాకు తెలుసు
రంగేళి వయసులో సింగారం తెలుసు
పొంగుతున్న ఒంపుల్లో పొగరునాకు తెలుసు
రంగేళి వయసులో సింగారం తెలుసు
లొంగని మీ పరువాలు..లొంగ దీసుకుంటా
లొంగని మీ పరువాలు..లొంగ దీసుకుంటా 
అందాలకు బందమేసి..అదుపులోన పెడతా..ఆ
అదుపులోన పెడతా  
     
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా  నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

శాంతి నిలయం--1972
















సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

ఇంతమాత్ర మెరుగువా కన్నయ్యా
ఏమంత పసివాడవా కన్నయ్యా
ఏమంత పసివాడవా కన్నయ్యా
ఏమంత పసివాడవా..ఆఆ 

చరణం::1

ఏభామ యింటిలో..ఎంత పాడివున్నదో
ఏ వుట్టిపై ఎంత వెన్నదాచి..వున్నదో 
తెలిసి దోచు కన్నయ్య..ఎంత తియ్యనీ..ఈ
దొంగవయా కన్నయ్యా..ఆ ఆ ఆ
కన్నయ్యా..ఆఆఆఆఆఆఆఆఆ     
ఏభామ యింటిలో..ఎంత పాడివున్నదో
ఏ వుట్టిపై ఎంత వెన్నదాచి..వున్నదో 
తెలిసి దోచు కన్నయ్య..ఎంత తియ్యనీ..ఈ..దొంగవయా 
తెలియదా తొలిరేయి..కన్నెమనసు కోర్కెలు
చిలిపిగ పులకించు దోరవయసు..చేష్టలు  
ఇంతమాత్ర మెరుగువా కన్నయ్యా..ఆఆ 
ఏమంత పసివాడవా..కన్నయ్యా..ఏమంత పసివాడవా..ఆ

చరణం::2

ఏ లేత వెదురులో..ఏ పలుకు పలుకునో
ఏ రాగమాలపించ..ఏలేగ ఆడునో
ఎరిగిన దానలోన..నన్నెరుగవా..ఆ..గోపాలా 
నీమోవి తాకితే..ఆ మురళి రవళించు
ఆ మురళి రవళిలో..యీ రాధ జీవించు    
ఆ మురళి రవళిలో..ఓ..యీ రాధ జీవించు

శాంతి నిలయం--1972
















సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,B.వసంత
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు,రమణారెడ్డి

ల్లవి::

దేవీ క్షేమమా..దేవరవారూ క్షేమమా
దేవీ క్షేమమా..దేవరవారూ క్షేమమా
తమ కడగంటి చూపే కరువైనాదీ
తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ
దేవీ క్షేమమా..ఆఆఆ             

చరణం::1

నులిసిగ్గుల లేబుగ్గలు..ఎలాగున్నవీ
నులివెచ్చని తొలిముద్దులు..పంపమన్నవీ
నులిసిగ్గుల లేబుగ్గలు..ఎలాగున్నవీ
నులివెచ్చని తొలిముద్దులు..పంపమన్నవీ
అల్లరల్లరీ కళ్ళుచల్లగా వున్నవా..అల్లరల్లరీ కళ్ళుచల్లగా వున్నవా
తెల్లవార్లు నిదురరాక ఎర్రబారుతున్నవీ..దేవీ..ఈ..క్షేమమా..ఆ  

చరణం::2

జడలోనమల్లెపూలు..యిమడకున్నవి
జతలేక పట్టుపరుపు..కుదరకున్నది
జడలోనమల్లెపూలు..యిమడకున్నవి
జతలేక పట్టుపరుపు..కుదరకున్నది
తలగడతో చెప్పుకునే..కబురులే మిగిలినవి
తలగడతో చెప్పుకునే..కబురులే మిగిలినవి
అవికూడ నలిగిపోయి..జాలివేస్తున్నది
దేవీ..ఈఈఈ..క్షేమమా..ఆఆఆ  

చరణం::3

నీ బడిలో చదవాలి..క్రొత్త క్రొత్త చదువులూ
నేనపుడు అడగాలి..చిలిపి చిలిపి ప్రశ్నలూ
పెదవులపై వ్రాయాలి..నీవుమెచ్చు జవాబులూ
పెదవులపై వ్రాయాలి..నీవుమెచ్చు జవాబులూ
నీ మగసిరి గెలవాలి..అసలైన పరీక్షలూ 
దేవీ క్షేమమా దేవరవారూ క్షెమమా..దేవీ..ఈ..క్షేమమా..ఆ 

శాంతినిలయం--1972


సంగీతం::S.P.కోదండపాణి
రచన::ప్రయాగ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,రమణారెడ్డి,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు.

పల్లవి::

చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా 
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా  
కలకాలం వర్ధిల్ల వేడుకలూ..సేదాము     
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::1

అనసూయాది శీలవతులలో
మేలిబంతివై మెలగమ్మా..మేలిబంతివై మెలగమ్మా  
అనసూయాది శీలవతులలో..మేలిబంతివై మెలగమ్మా 
నీ యిల్లే వేయిళ్ళై పసుపు కుంకుమతో వర్దిల్లమ్మా  
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::2

రతనాల గాజులివే సతినీకే శుభమమ్మ సతినీకే శుభమమ్మ
రతనాల గాజులివే సతినీకే శుభమమ్మ సతినీకే శుభమమ్మ
అనురాగ లతల పెనవేసుకొని అనుకూలవతిగ ధరమనుమమ్మ      
పతి సన్నిధియే సతి పెన్నిధిగా..ఆఆ
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::3

నీపాపె కనుపాపై..వెన్నెలలు వెదజల్లూ
ఆఆఆఆఆ 
నీపాపె కనుపాపై..వెన్నెలలు వెదజల్లూ
నీ యిల్లె సిరిమల్లె..పొదరిల్లై విరియాలి  
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా  
కలకాలం వర్ధిల్ల వేడుకలూ సేదాము     
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా