Friday, April 15, 2011

శ్రీమంతుడు--1971::కాఫీ::రాగం

సంగీతం::TV.చలపతిరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల


రాగం::కాఫీ:::
పీలు:::రాగం

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

కన్ను కలిపి కవ్వించేవు వెన్న లాగ కరిగించేవు
నిన్ను చేరి నీరైపోతే నన్ను చ్హూసి నవ్వేసేవు

ఇన్నినాళ్ళు దాచిన వయసు ఈనాడే కానుక నీకు
కలకాలం నీ కౌగిలిలో కరగాలని కోరిక నాకు

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా
కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

మధుశాలవు నీవై నావు బాటసారి నేనైనాను
ఓ..లైలా నీ వాకిలిలో మజునూనై నిలుచున్నాను

నీలికురుల నీడలోన నిన్ను దాచుకుంటా నేను
నిండువలపు నీడలోన నిన్ను కుంటా నేను

కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా
నీవు నాకు తోడై వుంటే లోకాలే గెలిచేస్తరా
కొంటె చూపు లెందుకులేరా జుంటె తేనె లందిస్తరా

శ్రీమంతుడు--1971


సంగీతం::T.చలపతిరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,బృందం


హేయ్..చీయర్స్..చీయర్స్
మొదటి పెగ్గులో మజా..ఓహొహొ
వేడి ముద్దులో నిషా..ఓహొహొ
కొత్త వలపుల రుచీ..రుచీ
అనుభవిస్తే కుషీ కుషీ
అమ్మమ్మ పపప దదద నినినిషా

మొదటి పెగ్గులో మజా..మజా
వేడి ముద్దులో నిషా..నిషా
కొత్త వలపుల రుచీ..రుచీ
అనుభవిస్తే కుషీ కుషీ
అమ్మమ్మ పపప దదద నినినిషా
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ.....

రేపు సంగతి మనకేల నేడు సుఖపడు మనసారా
లాఆఆ లలలలాలలలాలలల లలలా..
రేపు సంగతి మనకేల నేడు సుఖపడు మనసారా
పండితే నీ మోజు పండుగే ప్రతి రోజూ
పండితే నీ మోజు పండుగే ప్రతి రోజూ
అమ్మమ్మమ్మమ్మా ఏమి మజా

మొదటి పెగ్గులో మజా..ఓహొహొ
వేడి ముద్దులో నిషా..ఓహొహొ
కొత్త వలపుల రుచీ..రుచీ
అనుభవిస్తే కుషీ కుషీ
అమ్మమ్మ పపప దదద నినినిషా
లాఆఆ లలలలాలలలాలలల లలలా..

తన పర భేదం లేనిది తాగుడు లోనే ఉన్నది
లాఆఆ లలలలాలలలాలలల లలలా..
తన పర భేదం లేనిది తాగుడు లోనే ఉన్నది
నింపుకో మధుపాత్ర సాగనీ సుఖ యాత్ర
నింపుకో మధుపాత్ర సాగనీ సుఖ యాత్ర
అమ్మమ్మమ్మమ్మా ఏమి మజా

మొదటి పెగ్గులో మజా..మజా
వేడి ముద్దులో నిషా..నిషా
కొత్త వలపుల రుచీ..రుచీ
అనుభవిస్తే కుషీ కుషీ
అమ్మమ్మ పపప దదద నినినిషా

శ్రీమంతుడు--1971

సంగీతం::T.చలపతిరావు
రచన::కోసరాజు
గానం::ఘంటసాల


బులి బులి ఎర్రని బుగ్గలదాన…
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా…
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారి పోయవా…

చెడ్డ దారిలో తిరిగానే…
నీ చెంప దెబ్బలే తిన్నానే
చెడ్డ దారిలో తిరిగానే…
నీ చెంప దెబ్బలే తిన్నానే
మంచి మాట… నీ నోట వినాలని
ఓహొ రాధా… ఓక మంచి మాట
ఒక మంచి మాట నీ నోట వినాలని
మనసు మార్చుకుని వచ్చానే… వచ్చావె…

బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారిపొయవా

బొమ్మల పెళ్ళి చెసావే
ఈ బొమ్మకు హారం వేసావే
చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
ఆయ్యొ రాధా నేచచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే
నన్నె కాదని అంటావే అంటావే

బులి బులి ఎర్రని బుగ్గలదాన
చెంపకు చారెడు కన్నుల దాన
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారిపొయవా

ఎవడొ రాజా అంటవే ఈ రాజానే కాదంటావే
ఎవడొ రాజా అంటవే ఈ రాజానే కాదంటావే
కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో

బులి బులి ఎర్రని బుగ్గలదానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచి పోయవా నువ్వే మారిపొయవా
ఆయ్యొ మరచి పోయవా నువ్వే మారిపొయవా