Monday, October 12, 2015

సువర్ణ సుందరి--1985




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి (Chorus)
Film Directed By::Bheeram Masthan Rao
తారాగణం::చంద్రమోహన్,జయశ్రీ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో..ఎట దాగున్నదో 
ఏమైనదో..ఎట దాగున్నదో 
ఎన్నాళ్ళు ఈ వేదనా?..ఎన్నాళ్ళు ఈ వేదనా..ఆ ఆ
ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా

చరణం::1

పొలిమేర దాటాను..దావానలో
పొలికేక నైనాను..రాగాలలో
శున్యాక్షరాల గవాక్షాలలో..శున్యాక్షరాల గవాక్షాలలో 
నిలిచాను..నిరుపేదల గీతాలతో 
మదిగాయలుగా..మధు గేయాలుగా
ఎన్నాళ్ళు ఈ వేదనా..ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ
ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా

చరణం::2

మంజీరమైనాను..నీ పాటలో 
మందారమైనాను..నీ తోటలో 
మౌనస్వరాల..ఈ పంజరాన
మౌనస్వరాల..ఈ పంజరాన  
కరిగాను కలలేని..స్వప్నాలలో
విధి నటనాలలో..ఋతుపవనాలలో 
విధి నటనాలలో..ఋతుపవనాలలో
ఎన్నాళ్ళు ఈ వేదనా..ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ  
ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా

చరణం::3

నీ అంతిమ శ్వాస..నీ కవితలో ప్రాస 
అవుతుందనీ..బాస చేసానులే 
కావాలనే బ్రతికి ఉన్నాను లే..ఉంటానులే 
నీ సంగామావేశ విజృంభణంలోన..ఆకాశమే తుంచి 
కైలాసమే వంచి నిను చేరుకుంటాను..నీనాదమై 

ఇది నా జీవితాలపనా..ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో..ఎట దాగున్నదో

అల్లరి ప్రియుడు--1993



సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర,కోరస్ 
సినిమా దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం,మోహన్‌బాబు,మనోరమ. 

పల్లవి::

ఏం పిల్లది..ఎంత మాటన్నది
ఏం కుర్రది..కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి..చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు..నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో..నేర్పమన్నది

బాగున్నది కోడె..ఈడన్నది
ఈడందుకే వీధి..పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది

ఏం పిల్లది..ఎంత మాటన్నది
బాగున్నది కోడె..ఈడన్నది

చరణం::1

శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి 
సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి 
అగరు పొగల ధుపమేసి తప్పుకున్నాది
ఇనుకొని ఆరాటం...ఇబ్బంది 
ఇడమరిసే ఈలెట్టా..వుంటుంది
ఎదలోన ఓ మంట..పుడుతుంది 
పెదవిస్తే కథలాగ అయిపోతుంది 
చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
ఏ..కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా..ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది..ఎంత మాటన్నది
బాగున్నది కోడె..ఈడన్నది

చరణం::2

సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ..ఊ 
పట్టు చీర తెచ్చి..పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి..ఈ 
మల్లెపూల కాపడాలు..పెట్టమన్నాడు

ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కధలోనే ఉకొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మల్లి కావాలన్నా మనసు వున్నది

వామ్మో..ఏం పిల్లదీ..ఎంత మాటన్నది..ఈఈఈఈఈ
బాగున్నది కోడె..ఈడన్నది..ఈఈఈఈఈ 
సిగ్గులపురి..చెక్కిలి తనకుంది అంది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో..నేర్పమన్నది
ఏం పిల్లది..ఎంత మాటన్నది
బాగున్నది కోడె..ఈడన్నది 

Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturi SundaraRaammoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,BrahmanandamMohanbabu,Manorama.

::::::::

Em pilladi..enta maaTannadi
Em kurradi..koota baagunnadi
Oy..siggulapuri..chekkili tanakundi andi
chekkili pai kempulu..naa sontam andi
ekkaDa Em cheyyaalO..nErpamannadi

baagunnadi kODe..eeDannadi
iiDandukE veedhi..paalainadi
kammani kala kaLLeduTaku vachchEsindi
kommaku jata veeDEnani oTTEsindi
eppuDu Em kaavaalO aDagamannadi

Em pilladi..enta maaTannadi
baagunnadi kODe..eeDannadi

::::1

Sanivaaram enkanna saami pEru cheppi 
senagalaTTu chEta beTTi saaganampindi
mangaLaaram aanjanEya saami pEru jeppi 
agaru pogala dhupamEsi tappukunnaadi
inukoni aaraaTam...ibbandi 
iDamarisE eeleTTaa..vunTundi
edalOna O manTa..puDutundi 
pedavistE kathalaaga ayipOtundi 
chiru mudduki vunDaali cheekaTi andi
E..kaLLu paDakunTE OkE andi
teeraa..muddistunTE engilannadi

Em pilladi..enta maaTannadi
baagunnadi kODe..eeDannadi

::::2

sukraaram maalachchimi neeku saaTi anToo..uu 
paTTu cheera techchi..paiTa chuTTamannaaDu
sOmaaran jaamuraatiri tella cheera techchi..ii 
mallepoola kaapaDaalu..peTTamannaaDu

utsaaham aapEdi kaadanTa ubalaaTam kasirEstE pOdanTa
uyyaala jampaala kadhalOnE ukoTTE udyOgam naadanTa
varasunTE vaaramtO pani Emundi
uttutti choravaitE uDukEmundi
malli kaavaalannaa manasu vunnadi

vaammO..Em pilladii..enta maaTannadi..iiiiiiiiii
baagunnadi kODe..eeDannadi..iiiiiiiiii 
siggulapuri..chekkili tanakundi andi
kommaku jata veeDEnani oTTEsindi
ekkaDa Em cheyyaalO..nErpamannadi
Em pilladi..enta maaTannadi
baagunnadi kODe..eeDannadi 

అల్లరి ప్రియుడు--1993



సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర,కోరస్ 
సినిమా దర్శకత్వం::Kరాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం,మోహన్‌బాబు,మనోరమ. 

పల్లవి::

ఉత్తరాల ఊర్వశి..ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల..హారతివ్వగా
హలా హలా అదెంత..వేడి వెన్నెల
ముఖాముఖి..ముడేసుకున్న ముద్దులా

గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు..మాకు మాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ

చరణం::1

పువ్వులెన్నో..విచ్చినట్టుగా
చెలీ నవ్వగానే..నచ్చినావులే
చుక్కలెన్నో..పుట్టినట్టుగా
ప్రియా చూసుకోరా..పట్టి కౌగిలి
ఖవ్వాలీల..కన్నులతోనే
జవానీల..జాబులు రాసి
జగడమొకటి..సాగిందోయమ్మో
అజంతాల..ప్రాసలు వేసి
వసంతాల...ఆశలు రేపి
లలిత కవిత..నీకే మాలగా
దొరసోకు తోరణాలు..కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద..హంసలేఖ రాసిన

ఉత్తరాల ఊర్వశి..ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల..హారతివ్వగా
హలా హలా అదెంత..వేడి వెన్నెల
నిజానికి ఇదంత ఒట్టి నీదయ

చరణం::2 

సమ్ముఖాన..రాయబారమా
సరే సందెగాలి..ఒప్పుకోదులే
చందమామతోటి..బేరమా
అదే అందగత్తె..గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో..పదాలెన్నో
కవ్విస్తుంటే హృదయమొకటి..పుట్టిందోయమ్మా
సరాగాల..సంపెంగల్లో..పరాగాల
పండిస్తుంటే పరువమొకటి..వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద..పొన్నతోట తుమ్మెదాడి
జుంటి తేనెమత్తులోన..కొంటె వేణువూదినా 

గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు..మాకు మాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ

ఉత్తరాల ఊర్వశి..ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల..హారతివ్వగా
హలా హలా అదెంత..వేడి వెన్నెల
ముఖాముఖి..ముడేసుకున్న ముద్దులా

Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturi SundaraRaammoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,BrahmanandamMohanbabu,
Manorama.

::::::::

uttaraala UrvaSi..prEmalEkha prEyasi
andamanta aksharaala..haarativvagaa
halaa halaa adenta..vEDi vennela
mukhaamukhi..muDEsukunna muddulaa

geeta gOvinduDu veenula vinduDu
raagamaalatOnE raasaleelalaaDagaa
majaa majaa majaaku..maaku maalaya
nijaaniki idaNta oTTi needaya

::::1

puvvulennO..vichchinaTTugaa
chelee navvagaanE..nachchinaavulE
chukkalennO..puTTinaTTugaa
priyaa choosukOraa..paTTi kougili
khavvaaleela..kannulatOnE
javaaneela..jaabulu raasi
jagaDamokaTi..saagindOyammO
ajantaala..praasalu vEsi
vasantaala...aaSalu rEpi
lalita kavita..neekE maalagaa
dorasOku tOraNaalu..kougilinta kaaraNaalai
vamSadhaara neeTi meeda..hamsalEkha raasina

uttaraala UrvaSi..prEmalEkha prEyasi
andamanta aksharaala..haarativvagaa
halaa halaa adenta..vEDi vennela
nijaaniki idaNta oTTi needaya

::::2 

sammukhaana..raayabaaramaa
sarE sandegaali..oppukOdulE
chandamaama tOTi..bEramaa
adE andagatte..goppakaadulE
pedaalamma kachchEreelO..padaalennO
kavvistunTE hRdayamokaTi..puTTindOyammaa
saraagaala..sampengallO..paraagaala
panDistunTE paruvamokaTi..vachchE vaanChalaa
kannecheTTu kommameeda..ponnatOTa tummedaaDi
junTi tEnemattulOna..konTe vENuvoodinaa 

geeta gOvinduDu veenula vinduDu
raagamaalatOnE raasaleelalaaDagaa
majaa majaa majaaku..maaku maalaya
nijaaniki idaNta oTTi needaya

uttaraala UrvaSi..prEmalEkha prEyasi
andamanta aksharaala..haarativvagaa
halaa halaa adenta..vEDi vennela
mukhaamukhi..muDEsukunna muddulaa

అల్లరి ప్రియుడు--1993



సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర,కోరస్ 
సినిమా దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం. 

పల్లవి::

ఆహ హాహా హాహా..ఆహా హాహా
ఆహ హాహా హాహా..హహహా హహహా
హహహా..హహహా..హాహా
ఆఆ ఆఆఆఆ..ఆఆ ఆఆఆఆ..ఆఆహాహ

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా 
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా

రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ గళ్ళుమనా మువ్వే నువ్వా
పడుచుదనపు అలపు పాటవు నువ్వా..వా..వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా..రోజాపువ్వా..పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా..నవ్వే నువ్వా

చరణం::1

గులాబి గు..గు..గు..గులాబి గు..గు..గు 
చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా
కందే పువ్వా...కన్నా పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా..ఆ..ఆ

చరణం::2

ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా 
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా

రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా 
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా

రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ గళ్ళుమనా మువ్వే నువ్వా
పడుచుదనపు అలపు పాటవు నువ్వా..వా..వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా 
పువ్వే నువ్వా...నవ్వే నువ్వా

Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturi SundaraRaammoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,Brahmanandam.

::::::::

aaha haahaa haahaa..aahaa haahaa
aaha haahaa haahaa..hahahaa hahahaa
hahahaa..hahahaa..haahaa
aaaa aaaaaaaa..aaaa aaaaaaaa..aaaahaaha

rOj rOj rOj rOj..rOjaapuvvaa
rOjaapuvvaa...puvvaapuvvaa
rOju rOju rOju rOju..poostoo unnaa 
puvvEnuvvaa...navvEnuvvaa

rEku vichchukunna sOkubanti puvvEnuvvaa
muddu peTTakunDa gaLLumanaa muvvE nuvvaa
paDuchudanapu alapu paaTavu nuvvaa..vaa vaa
rOj rOj rOj rOj..rOjaapuvvaa..rOjaapuvvaa..puvvaapuvvaa
rOju rOju rOju rOju..poostoo unnaa puvvE nuvvaa..navvE nuvvaa

::::1

gulaabi gu..gu..gu..gulaabi gu..gu..gu 
chakkadanaaniki chakkiligintavu nuvvaa nuvvaa
kandE puvvaa...kannaa puvvaa
vennelavaakiTa erraga panDina divvE nuvvaa chindE ravvaa poddE nuvvaa
gunDechaaTu prEmalenno pOTumeeda chaaTutunna rOjaapuvvaa
andamaina aaDapilla buggapanDu gillutunna siggE nuvvaa
chiguru erupu telupu pogaDamaalika nuvvaa..aa..aa

::::2

prEma suvaasana pedavula vantena vEsE nuvvE poosE puvvaa baasE nuvvaa
kaugili chaaTuna kaamuDu meeTina veeNE nuvvaa jaaNE nuvva jaajE nuvvaa
guppumanna aaSalennO koppulOna daachukunna rOjaapuvvaa
sandepoddu santakaala prEmalEkha pampukunna guvvE nuvvaa
madhura kavita chadivi pedavi panDina puvvaa

rOj rOj rOj rOj..rOjaapuvvaa
rOjaapuvvaa...puvvaapuvvaa
rOju rOju rOju..rOju poostoo unnaa 
puvvEnuvvaa...navvEnuvvaa

rOj rOj rOj rOj..rOjaapuvvaa
rOjaapuvvaa...puvvaapuvvaa

rOju rOju rOju..rOju poostoo unnaa 
puvvEnuvvaa...navvEnuvvaa

rEku vichchukunna sOkubanti puvvEnuvvaa
muddu peTTakunDa gaLLumanaa muvvE nuvvaa
paDuchudanapu alapu paaTavu nuvvaa..vaa..vaa

rOj rOj rOj rOj..rOjaapuvvaa
rOjaapuvvaa...puvvaapuvvaa
rOju rOju rOju..rOju poostoo unnaa 
puvvE nuvvaa...navvE nuvvaa

అల్లరి ప్రియుడు--1993


సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర,కోరస్ 
సినిమా దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం. 

పల్లవి::

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం::1

చిలిపిగ నీ చేతులు అణువణువు 
తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని

చరణం::2

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వొయ్యారమా
అల్లాడిపోయే యీ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే వో హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో వొదిగిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని 

Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturi SundaraRaammoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,Brahmanandam.

::::::::

kanulu vippi kaluva mogga jaabillini choochenu
tamakamtO paalabugga tolimuddunu kOrenu
taDiyaarani pedavulapai
toNikina vennela merupulu
cheppakanE chebutunnavi idE idE prEmani

::::1

chilipiga nee chEtulu aNuvaNuvu 
taDumutunTE mOhapu teralika toligEnaa
chali chali chiru gaalulu giliginta rEputunTE
aaSala allari aNigEnaa padaalatOnE varinchanaa
saraaga maalai tarinchanaa swaraalatOnE spRSinchanaa
sukhaala veeNa SRtinchanaa aa vennela nee kannula
rEpekkina aa kOrika
pogalai segalai yedalO ragilina kshaNamE
cheppakanE chebutunnavi idE idE prEEmani

::::2

tanuvunu penavEsina nee cheerakenta garvam
yavvana girulanu taDimenanaa
nee kaugiTa naliginandukE anta garvam
madanuDi malupulu telisenanee
tellaaraneekE voyyaaramaa
allaaDipOyE ii rEyini
savaalu chEsE SRngaaramaa
sandhinchamaakE vO haayini
aa mallela kErintalu
nee navvula laalintalu
valalai alalai voDilO vodigina kshaNamE
cheppakanE chebutunnavi idE idE prEmani

అల్లరి ప్రియుడు--1993




సంగీతం::M.M.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,K.S.చిత్ర
సినిమా దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం. 

పల్లవి::

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు 
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే..ఇదే..కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం::1

మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి కవితలు రాసే మౌనమది..ఈ
రాగల రోజుల ఊహలకి..స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది..ఈ

ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం::2

చూపులకెన్నడు దొరకనిది రంగురూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది..ఈ
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల తరగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది..ఈ

చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కొయిలలా కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృత వర్షిని అనిపించే
అముల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,Brahmanandam.

::::::::

ahO..O..oka manasuku nEDE puTTinarOju 
ahO..O..tana pallavi paaDE challani rOju

idE idE kuhu swaraala kaanuka
marO vasanta geetika janinchu

ahO..O..oka manasuku nEDE puTTinarOju 
ahO..O..tana pallavi paaDE challani rOju

::::1

maaTa paluku teliyanidi maaTuna unDE mooga madi
kammani talapula kaavyamayi kavitalu raasE mounamadi..ii
raagala rOjula oohalaki swaagatamichchE raagamadi
SRtilayalerugani oopiriki swaramulu koorchE gaanamadi..ii

Rtuvula rangulu maarchEdi kalpana kaligina madi bhaavam
bratukunu paaTaga malichEdi manasuna kadilina mRdunaadam
kalavani dikkulu kalipEdi ningini nElaki dimpEdi
adE kadaa vaaradhi kshaNaalakE saaradhi manassanEdi

ahO..O..oka manasuku nEDE puTTinarOju 
ahO..O..tana pallavi paaDE challani rOju

::::2

choopulakennaDu dorakanidi ranguroopu lEni madi
reppalu teravani kannulaku swapnaalennO choopinadi
vechchani chelimini pondinadi vennela taragala ninDu madi
kaaTuka cheekaTi raatiriki baaTanu choopE nEstamadi

chEtiki andani jaabililaa kaantulu panchE maNideepam
kommala chaaTuna koyilalaa kaalam nilipE anuraagam
aDagani varamulu kuripinchi amRta varshini anipinchE
amulyamaina pennidhi SubhOdayaala sannidhi manassanEdi

ahO..O..oka manasuku nEDE puTTinarOju 
ahO..O..tana pallavi paaDE challani rOju

idE idE kuhu swaraala kaanuka
marO vasanta geetika janinchu rOju