సంగీతం::రాజ్ కోటి
రచన::?
గానం::బాలు,సుశీల
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి గాలి బలి యమో యమో
నాటుకొట్టుడు వీరకొట్టుడు ...
ముట్టడించి కొట్టాలా బుగ్గల్లో నా ముద్దు
మట్టగించి తొక్కాలా మంచాలే ఈ పొద్దు
కోకపల్లి రాజ్యంలో కొటగుమ్మమేడుందో
ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో
చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు
కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు
రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో
చిక్కులిప్పతీసే దాకా మోమాటాలమ్మో
శృంగారానికి సింగంలాంటి చిన్నోడొస్తుంటే
సిగ్గు ఎగ్గు పుట్టిళ్ళల్లో నుగ్గైపోతుంటే
తాకిడి వేళా చెలి తట్టుకోవాలా
కస్సుబుస్సు పూజలతో కాముడికి నమో నమో
నాటుకొట్టుడు వీరకొట్టుడు ...
చప్పరింత కొట్టాలా మైకంలో ఓమాటు
అప్పగింతలియ్యాలా మెత్తంగా ఈనాడు
పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో
పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో
దండయాత్ర చెయ్యాలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వాలా ఏనాడో ఓనాడు
పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో
తేనేబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో
వయ్యారానికి ఉయ్యాలోచ్చే వూహే చూస్తుంటే
ఉట్టి పట్టి చట్టే కొట్టే ఊపే వస్తుంటే
గుద్దులాటల్లో తొలి ముద్దులాటల్లో
మొగ్గే విచ్చే మోజులతో ప్రేమలకే ఘుమో ఘుమో
నాటుకొట్టుడు వీరకొట్టు డు