Wednesday, March 16, 2011

కొదమ సింహం--1990


సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,K.S.చిత్ర 

పల్లవి::

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం::1

గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో
సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో
వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే
కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే
ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో
చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో
ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగెనులే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం::2

కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో
కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో
జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా
జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే
ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శృతిలో
వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో
కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా

దొరలు దొంగలు--1976


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి

పల్లవి::

ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
వెల లేనిది కల కానిది ఇలలోన సరిరానిదీ 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం::1

వెన్నెల పొదిగిన దొన్నెలు కన్నులు 
పెదవుల కందించనా పరవశ మొ౦దించనా
అందం విరిసిన ఆమని వేళా విందులు 
కొదవుండునా వింతలు లేకుండునా
వేడుక వాడుక కాకుండనా 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం::2

కౌగిట అదిమి హృదయం చిదిమి 
మధువులు కురిపించనా మదనుని మురిపించనా   
అందని స్వర్గం ముందు నిలిచితే 
ఎందుకు పోమ్మ౦దునా ఇది వేళ కాదందునా
తీరిక కోరిక లేదందునా 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
వెల లేనిది కల కానిది ఇలలోన సరిరానిదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ