సంగీతం::K.V.మహదేవన్
రచన::Dr.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల.S.P.బాలు
తారాగణం:: N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని
:::::::
కృష్ణా ………!
నీ పేరు తలచినా చాలు..నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
చరణం::1
ఏమి మురళి అది ఏమి రవళిరా
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమీ రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో
మరణమైనా మధురమురా
నీ పేరు తలచినా చాలు
చరణం::2
వెదురు పొదలలో తిరిగి తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
వెదురు పొదలలో తిరిగీ తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
ఎదపానుపుపై పవళించరా
నా పొదిగిన కౌగిట పులకించరా
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా!
మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా
కృష్ణా..!నీ పేరు తలచినా చాలు
చరణం::3
ఏమి పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూచి
శరబిందుచంద్రికల చేయిచాచి
తరుణాంతరంగమున దాగిదాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా..తొలకరించెరా
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
చల్లని రమణి చల్లని ఉల్లము
అల్లన ఝల్లన పరవశించెరా…
కృష్ణా..నీ పేరు తలచినా చాలు…