సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి,హరనాధ్
పల్లవి::
ఆడేనోయి నాగకన్యకా..చూడాలోయి వీరబాలకా
వేడుక నీకు చెసేను..కోడెనాగు ఆడి పాడి..నేడే..నేడే
ఆడేనోయి నాగకన్యకా..చూడాలోయి వీరబాలకా
వేడుక నీకు చెసేను..కోడెనాగు ఆడి పాడి..నేడే..నేడే
చరణం::1
శిరసున దాల్చేను..భూభారం మా ఆదిశేషు
శిరసున దాల్చేను..భూభారం మా ఆదిశేషు
మురహరికే అమరిన...తల్పం
మురహరికే అమరిన...తల్పం
శివునకు మేమే..గళమున హారం
శివునకు మేమే..గళమున హారం
క్షీరాబ్ది చిలికెను...మా వాసుకీ
ఆడేనోయి......నాగకన్యకా
చూడాలోయి....వీరబాలకా
చరణం::2
నరులకు ఆరాధ్య దైవాలే...మా నాగజాతి
నరులకు ఆరాధ్య దైవాలే..మా నాగజాతి
వరములతో నిరతము...బ్రోచి
వరములతో నిరతము..బ్రోచి
గరళమునందే అమృతము..నొసగే
గరళమునందే అమృతము..నొసగే
కామిత దాతలు మా...నాగులే
ఆడేనోయి నాగకన్యకా..చూడాలోయి వీరబాలకా
వేడుక నీకు చెసేను.. కోడెనాగు
ఆడి..పాడి..నేడే..నేడే