Monday, December 12, 2011

మంచి కుటుంబం--1967




సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.జానకి,B.వసంత

పల్లవి::

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు

చరణం::1

బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
జరిగేను కళ్యాణ వైభోగం 
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::2

కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా..ఆ..పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
లతవోలే జత గూడి లాలింతునే 

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::3

ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో..ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి..తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల...బంధింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు


జయసుధ--1982


చిమ్మటలోని ఈ పాట మీకు నచ్చితే ఇక్కడ క్లిక్ చేసి పాట వింటూ సాహిత్యం
చూడండి మరీ నచ్చితే చిన్నగా ఒక కామెంట్ రాయండి

సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు ,P. సుశీల


పల్లవి::
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రథమ రేఖవో
రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ
ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

సరళ తరళ నీహార యవనికల
మెరిసే సూర్య కళికా..ఆ ఆ
మృదుల మృదుల నవ పవన వీచికల
కదిలే మదన లతికా
సరళ తరళ నీహార యవనికల
మెరిసే సూర్య కళికా..ఆ ఆ
మృదుల మృదుల నవ పవన వీచికల
కదిలే మదన లతికా
నీ లలిత చరణ పల్లవ చుంబనమున
పులకించును వసుధ జయసుధా..ఆ..

ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో
ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో
ప్రణయ గగనమున ప్రథమ రేఖవో
రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో..ఓ
ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::2

శరదిందీవర చలదిందిందిర స్ఫురణదీలకుంతలవో
ౠష్యాశ్రమ గతదుష్యంత చకిత దృషాంకిత శకుంతలవో
అది నిటలమా సురుచిర శశాంక శకలమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అవి కనుబొమలా రతీ మన్మధుల ధనువులా
అది అధరమా అమృత సదనమా
అది గాత్రమా జీవ చిత్రమా
అది అధరమా అమృత సదనమా
అది గాత్రమా జీవ చిత్రమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
నీ నయన లేఖినులు విరచించెను
అభినవ రసమయ గాధ
జయసుధా..ఆ...