Wednesday, February 04, 2009

పడమటి సంధ్యారాగం--1986




సంగీతం::,S.P.బాలు
రచన::వేటూరి
గానం::S.జానకి,S.P.బాలు


 ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే...
you are avakay me ice cream
this is the hot and sweet love's dream
united states of hearts we have
like Indian namaste

ఆకాశంలో తార సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నవిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం
గ్రహణాలు లేని ఆ తారలన్నీ
గగనాన కలిసే ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం కలిసింది ఈ బంధం

ladies and gentlemen
this is your captain speaking from the cockpit
its unfortunate we caught fire all the engines
I advice you to put on your parachutes and
bail out immediately

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన పాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుదిరంతోనే రుణమైనదీ ప్రియ బంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే
ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం అపురూపమీ ప్రణయం

అల్లూరి సీతారామ రాజు--1974



సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల


వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
తేలి..వస్తాడు నా రాజు..రోజు

వేల తారకల నయనాలతో..నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో..నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూలికై అవని అనువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను
పాల సంద్రమై...పరవశించేను
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలెంతగ విరిసినగాని చంద్రుణ్ణి విడిపోలేవు..ఓ..
కెరటాలెంతగ పొంగినగాని కడలిని విడిపోలేవు..ఓ..
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే..ఓ..
తనువులు వేరైన దారులు వేరైన తనువులు వేరైన దారులు వేరైన..
ఆ బంధాలే నిలిచేనులే ఆ బంధాలే నిలిచేనులే...

వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
వస్తాడు నా రాజు ఈ రోజు