Monday, June 08, 2009

మోసగాడు--1980

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

హ హ హా.. ఆ ఆ హా హా హ
హు హు హూ..హూ హు హు

ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు

ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు

ఆమని చీరలు చుట్టుకుని కౌగిలి ఇల్లుగ కట్టుకొని
శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకచిలుకల్లాగా
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకచిలుకల్లాగా
ఉయ్యాలలూగే వయ్యారంలో సయ్యాటాడే శౄంగారంలో

ఏ వసంతమిది....ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు

వేసవి గాల్పులు తట్టుకుని..ప్రేమని పేరుగ పెట్టుకుని
శ్రావణ సంధ్యల తొలకరి మెరుపులు పువ్వులుగా నను చుట్టుకుని

జిలిబిలి సిగ్గుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
జిలిబిలి సిగ్గుల ముగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
ౠతువేదైనా అనురాగంలో..ఎన్నడు వీడని అనుబంధంలో

ఏ వసంతమిది...ఎవరి సొంతమిది
ఏ వసంతమిది ఎవరి సొంతమిది
ఎన్నో ౠతువుల రాగాలు..ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ౠతువుల అందాలు..ఎదలో ప్రేమ సరాగాలు
...

హా హా అహహా..మ్మ్ హు హూ మ్మ్హు హు మ్మ్ హుహు 

మొనగాడు ~~ 1976

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

వయసు ఉరకల వేస్తుంటే..సొగసు పొంగులు వస్తుంటే
మనసు హద్దులు పెడుతుంటే..మధ్యన నలిగీ పోతుంటే
ఏమి చేద్దాం..ఏమి చేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకల వేస్తుంటే..సొగసు పొంగులు వస్తుంటే
మనసు హద్దులు పెడుతుంటే..మధ్యన నలిగీ పోతుంటే
హ్హ..ఏమి చేద్దాం..అహహహా..ఏమి చేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకల వేస్తుంటే..మనసు హద్దులు పెడుతుంటే..

పువ్వు పువ్వు కవ్విస్తుంటే..పులకరింతలు రప్పిస్తుంటే
నిండుపున్నమి వెన్నెలైనా..నిప్పులాగా అనిపిస్తుంటే
పువ్వు పువ్వు కవ్విస్తుంటే..పులకరింతలు రప్పిస్తుంటే
నిండుపున్నమి వెన్నెలైనా..నిప్పులాగా అనిపిస్తుంటే
ఏమి చేద్దాం..ఏమిచేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకల వేస్తుంటే..మనసు హద్దులు పెడుతుంటే..

చల్లగాలులు వీస్తుంటే..జివ్వు జివ్వున చలివేస్తుంటే
చల్లగాలులు వీస్తుంటే..జివ్వు జివ్వున చలివేస్తుంటే
నిన్నుచూస్తు నన్నునేనే..కౌగిలించుక గడపాలంటే
నిన్నుచూస్తు నన్నునేనే..కౌగిలించుక గడపాలంటే
ఏమి చేద్దాం..ఏమిచేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకల వేస్తుంటే..సొగసు పొంగులు వస్తుంటే

కళ్ళునాలుగు కలిపేస్తుంటే..కన్నెతనము జడిపిస్తుంటే
కళ్ళునాలుగు కలిపేస్తుంటే..కన్నెతనము జడిపిస్తుంటే
అదురుతున్నా పెదవులు నిన్నే..హత్తుకొమ్మని అందిస్తుంటే
అదురుతున్నా పెదవులు నిన్నే..హత్తుకొమ్మని అందిస్తుంటే
ఏమి చేద్దాం..ఏమిచేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం

వయసు ఉరకల వేస్తుంటే..సొగసు పొంగులు వస్తుంటే
మనసు హద్దులు పెడుతుంటే..మధ్యన నలిగీ పోతుంటే
ఏమి చేద్దాం..ఏమి చేద్దాం..ఎంతకాలం ఆపుకొందాం
లాలలాలా లాలలాలా..లాలలాలా లాలలాలా

ఇద్దరు అసాధ్యులే--1979

సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ-ఆచార్య
గానం::S.P.బాలు,P.సుశీల

Film Director::K. S. R. Das
Starring::Krishna,Rajnikanth,Jayaprada,Geetha,SowcarJanaki.

pallavi::

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే

ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ వుంటే..తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..ఈ హాయి లేదోయి ఏ జంటకూ
ఆహా..హా..ఆఅ..ఆఅ..
హ హ హాహా..హాహాహా హహహహ

::::1

చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
చేయి నడుము చుట్టేస్తుంటే..
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కంవేయగా
ఆఆ..ఆఆ..ఆఆ..
ఊపిరాడలేదని నువ్వు..
ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకూ..
ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకూ

చినుకు చినుకు పడుతూ వుంటే.
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ..
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

:::::2

సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
సొంపులన్ని దాచేమేర ఒంటినంటి వున్నది చీర
తొలగిపోతే రట్టైవ్తుందిరా
ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
గుట్టునున్న నిను చూస్తుంటే..
కొంటే కోర్కె నా కొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు..
పగ్గాలు లేవింక జంకేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే..ఆ..హా
తడిసి తడిసి ముద్దవుతుంటే..ఆ..హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ష్..ఆ..హా..
ఒకరికొకరు చలిమంటైతే..అయితే
జోహారు జోహారు ఈ వానకూ....
ఈ హాయి లేదోయి ఏ జంటకూ...

అగ్ని పర్వతం--1985

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

ఆ హా..వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

అందాలమ్మా..ఆటపాట..ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన..మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

తకిట తనం తానం తనంతానం
తకిట తనం తానం తనంతానం

నీరెండల్లో నీ అందాలు..నారింజల్లో రత్నాలూ
పూదండల్లో దారంలాగా..నాగుండెల్లో రాగాలూ
కంటిముద్దు పెట్టేలోగా..గాలిచీర కట్టేలోగా
నల్లనిజళ్ళో నీలాలన్నీ..ఎవ్వరికిస్తావో

వేకువమ్మ చూసేలోగా..పాపిటంతతీసేలోగా
నున్నని మెళ్ళో వెన్నెలహారం..ఎప్పుడు వేస్తావూ
మందారమొగ్గకన్న బుగ్గెర్రనా..మాణిక్యరవ్వకన్న తానెర్రనా
మరుమల్లెపూవుకన్న..తను తెల్లనా
ఎన్నెల్లో పాలకన్న ఎద తెల్లనా

ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

నా కళ్ళల్లో నీ రూపాలు..వాకిళ్ళలో దీపాలూ
దీపాలన్నీ చెరిపె నిన్ను చేసారేమో దైవాలూ
లేతపూలు కోసేలోగా..లేతగాలి వీసేలోగా
చల్లని నీడల చాటున సందడి..ఎప్పుడు చేస్తావో

ఎర్రబొట్టు పెట్టేలోగా..కుర్రపొద్దు పుట్టేలోగా
చీకటిసందున చిక్కిన కౌగిలి ఎప్పుడువస్తావో
చామంతి చెంపపైన చెయ్యేసుకో..పారాణి ఆశలన్ని పండించుకో
సిగ్గింటి గోడదాటి..నన్నందుకో..ముగ్గింటిదారితోక్కి నన్నేలుకో

ఆ హా..వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

అందాలమ్మా..ఆటపాట..ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన..మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
ఆ హా వయ్యారాలు శింగారాలు వంటి ముత్యాలా
ఆ హా పూసే పూవూ..నవ్వే నవ్వు నోటిముత్యాలా

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్
తననం తనన తననం తనన..తననం తనన
తననం తనన తననం తనన..తననం తనన