సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం
పల్లవి::
పల్లెటూరు మన..భాగ్యసీమరా
పాడి పంటలకు..లోటు లేదురా
పల్లెటూరు మన..భాగ్యసీమరా
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం
మనిషి మనిషిలో..కనబడురా
పల్లెటూరు మన..భాగ్యసీమరా
పాడి పంటలకు..లోటు లేదురా
మంచితనం..మమకారం
మనిషి మనిషిలో..కనబడురా
పల్లెటూరు మన..భాగ్యసీమరా
పాడి పంటలకు..లోటు లేదురా
చరణం::1
కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు
కొల్లగ ప్రవేశ పెడదాము
కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి
సుక్షేత్రాలను చేద్దాము
సుక్షేత్రాలను చేద్దాము
కొత్తకొత్త వ్యవసాయ పద్దతులు
కొల్లగ ప్రవేశపెడదాము
బీటినేలలను పాటుకుతెచ్చి
సుక్షేత్రాలను చేద్దాము
చదివినామనే బింకం వదిలి
ఆడామగ చేదోడుగ కదిలి
బంగారము పండిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్
ఓహోహోయ్ప పదిమందిని పోషిద్దాము
ఓహోహోయ్ ఓహోహోయ్ ఓహోహోయ్
పల్లెటూరు మన భాగ్యసీమరా
పాడి పంటలకు లోటు లేదురా
చరణం::2
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
జీవనదులు కృష్ణా గోదావరి తుంగభద్రలే వున్నవి
పంటనిచ్చు హంసా మసూరి వరివంగడాలు వస్తున్నవి
కరువుని దూరం చేద్దాము జాతికి ప్రాణం పోద్దాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము
ఆంధ్రదేశమే అన్నపూర్ణయను పేరుకీర్తులను నిలబెడదాము
పల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా
చరణం::3
సోమరితనముగ తిరిగేవాళ్లే
సంఘానికి విద్రోహులురా
సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
సోమరితనముగ తిరిగేవాళ్లే
సంఘానికి విద్రోహులురా
ఐకమత్యముగ యువకులందరూ
ఒళ్లువంచి పనిచెయ్యాలిరా
ఉద్యోగంలో వ్యాపారంలో
తృప్తియన్నదే వుండదురా
స్వతంత్రమగు మన రైతు వృత్తిలో
గౌరవమున్నదిరా ఎంతో గౌరవమున్నదిరా
పల్లెటూరు మన భాగ్యసీమరా
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం
మనిషి మనిషిలో కనబడురా
పల్లెటూరు మన భాగ్యసీమరా
పాడి పంటలకు లోటు లేదురా
మంచితనం మమకారం
మనిషి మనిషిలో కనబడురా
పల్లెటూరు మన భాగ్యసీమరా
పాడి పంటలకు లోటు లేదురా
No comments:
Post a Comment