Wednesday, December 14, 2011

బలిపీఠం--1975







సంగీతం::K.చక్రవర్తి
రచన::శ్రీశ్రీ
గానం::S.P.బాలు, P.సుశీల 

పల్లవి:: 

కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
తెలుగువారు నవ జీవననిర్మాతలని
తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
లలలాలలలాలలాలలలలాలలాల 

చరణం::1

కార్యసూరుడు వీరేశలింగం
కలం పట్టి పోరాడిన సింగం 
దురాచాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం
ఆదిగో..అతడే..వీరేశలింగం

మగవాడెంతీటి ముసలాడైనా మళ్ళిపేళ్ళికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని బాల వితంతువులకెందుకు లేదా హక్కంటాను 
చేతికి గాజులు తొడిగాడు..చెదిరిన తిలకం దిద్దాడు
మోడు వారిన ఆ ఆ అ బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు
నిలిపాడు...

కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట

చరణం::2

లలలాలలలాలలాలలలలాలలాల 

అదిగో అతడే గురజాడ
మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు
మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు
మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను
మాల నేనౌతాను అన్నాడు

కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
తెలుగువారు నవ జీవననిర్మాతలని
తెలుగు జాతి..సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం..తెలుగు పాట
కదలి సాగుదాం..వెలుగు బాట