Monday, August 06, 2007

చదువుకొన్న అమ్మాయిలు--1963సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల

కిలకిల నవ్వులు చిలికిన, పలుకును నాలో బంగారువీణ
కరగిన కలలే నిలిచిన, విరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
రమ్మని మురళీరవమ్ములు పిలిచె


అణువణువున బృందావని తోచె
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె
కిలకిల నవ్వులు చిలికిన..పలుకును నాలో బంగారువీణ


నీవున్న వేరే సింగారములేల
నీవున్న వేరే సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే
కరగిన కలలే నిలిచిన..విరిసెను నాలో మందారమాల


నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ
కిలకిల నవ్వులు చిలికిన..పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికిన

చదువుకొన్న అమ్మాయిలి--1963::మొహన::రాగం
సంగీతం S.రాజేశ్వర రావ్
రచన::దాశరథి
గానం::P.సుశీ


మొహన::రాగం::

ఓహో...ఓ..ఆ..హా..ఆ..ఆ..
ఓహో...ఓ..ఆ..హా..ఆ..ఆ..


వినిపించనిరాగాలే కనిపించని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించన్ని రాగాలే....

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచి మనసే మనసే..వినిపించని రాగాలే..


వలపే వసంతములా పులకించి పూసినది
వలపే వసంతములా పులకించి పూసినది
చెలరేగిన తెమ్మరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసే...వినిపించని రాగాలే


వికసించెను నా వయసే మురిపించెను ఈ సొగసే
విరితేనేల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే...
వినిపించని రాగాలే కనిపించెని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే.........

చదువుకొన్న అమ్మాయిలు--1963
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల.


ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ఆహా
అందులోనె అంతులేని అర్థమున్నదీ..అర్థమున్నది
మొదటిరోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది బలే విరహ తాపం


బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ..
పొత్తు కుదరదు


పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం
పడుచువాడీ...ఓహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం
వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంతజేర చెడామడా కొట్టు

బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ..
పొత్తు కుదరదు

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ ఓహో
కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ
తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోసం అది పైకి పగటివేషం
వెంటపడిన వీపు విమానం....

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహా
అందులోనె అంతులేని అర్థమున్నదీ..అర్థమున్నది.


చిలిపి కన్నె హౄదయమెంతొ చిత్రమైనదీ
అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది
చిలిపి కన్నే
చిలిపి కన్నె హౄదయమెంతొ చిత్రమైనదీ
అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది


ఆ పజిలు పూర్తి చేయి


తగు ఫలితముండునోయి
మరుపురాని మధురమైన ప్రైజు దొరుకునోయి
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహా
అందులోనె అంతులేని అర్థమున్నదీ..అర్థమున్నది...ఆ...ఆ...
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ..
పొత్తు కుదరదు

చదువుకొన్న అమ్మాయిలు--1963::రాగం::శంకరాభరణం
సంగీతం::సాలూరి
రచన::ఆరుద్ర
గానం::ఘటసాల,P.సుశీల

రాగం:::శంకరాభరణం:::

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని..ఓ..
నన్నే నీదాన్ని చేసుకోవాలి
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని..ఓ..
నన్నే నీదాన్ని చేసుకోవాలి


నవనాగరీక జీవితాన తేలుదాం, నైటుక్లబ్బులందు నాట్యమాడి సోలుదాం
ఓ..హో..హో..ఓ..హో..హో..ఓ..హో..హొ..హో..
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి
నేను అంతకన్న అప్టుడేటు బేబిని


వగలాడి నీకు తాళి బరువు ఎందుకు
ఎగతాళి చేసి దాని పరువు తీయకు
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ..తల్లీ దయచేయి కోటిదండాలు


నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను
ఏదొ హారుమని వాయిస్తూ పాడుకుంటాను
దనిస నిదనిప మగదిస దిగమప
నేను చదువులేనిదాననని అలుసు నీకేల
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల


నీతో వియ్యం దినదినగండం
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల


నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ...తల్లీ దయచేయి కోటిదండాలు


సిరులూ నగలూ మాకు లేవోయి
తళుకూ బెళుకుల మోజు లేదోయి..అహ..హా..ఆ..ఆ
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు


ధనరాశి కన్న నీ గుణమే మిన్న
నీలో సంస్కారకాంతులున్నాయి
నీకో బ్రూట్ దొరికిందీ మెడలో జోలె కడుతుంది


ఈమే కాలిగోటి ధూళిపాటి చేయదూ
ఓ..త్వరగా దయచేస్తే కోటిదండాలు


నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో..పక్కనున్న చక్కనైన జవ్వని
హాయ్..నిన్నే నాదాన్ని చేసుకొంటాను