Thursday, January 09, 2014

జస్టిస్ చౌదరి--1982



















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి:: 

నీ తొలిచూపులోనే..ఏ ఏ ఏ ఏ 
ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా

నా తొలిచూపుటోనే..ఏ ఏ ఏ ఏ 
నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో మనసుయ్యాలగా ఊగు వేళా

చరణం::1

చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ
వాగు వంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ

కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా

నీ తొలిచూపులోనే.ఏ ఏ ఏ ఏ .
నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా

చరణం::2

కోకిలమ్మ కొత్త చీరా సారెలదగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ

కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ

కలిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా

నా తొలిచూపుటోనే..ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా

అంతస్తులు--1965





సంగీతం::K.V.మహాదేవన
రచన::ఆరుద్ర
గానం::భానుమతి

పల్లవి::

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం::1

నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నిజమాడితే నిష్టూరమేగా
అయినా పేదలు కలలో కూడా కల్లాకపటలాడరు 
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం::2

లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
అంతస్తుకి అంతెక్కడుంది
ఏడంతస్తుల మేడకి కూడా పునాది భూమిలో వుండాలి

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న