Sunday, July 05, 2015

బాటసారి--1961



సంగీతం::మాష్టర్ వేణు
రచన::సముద్రాల సీనియర్
గానం::P.భానుమతి 
భరణీ వారి

దర్శకత్వం::రామకృష్ణ
తారాగణం::అక్కినేని,P.భానుమతి,జానకి,రమణమూర్తి,సూర్యకాంతం,ఛాయాదేవి,దేవిక

పల్లవి::

ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
నిలాపనిందలే..ఈ లోక నైజమా
న్యాయమే..కానగజాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::1

పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం::2

నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే..కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై 
అనేరా ఈ తీరునా ఈ లోకులు

వేటగాడు--1979



రోజా మూవీస్ వారి
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలుP.సుశీల
దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే
గూడు చాటు..గువ్వ తడిసే
గుండె మాటు..గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది  

చరణం::1

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ..అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ..అహ అహ

ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే 
ఓ..చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ..మాట విని మబ్బు మెరిసి..అహ
జడివానలే..కురిసి కురిసి 
వళ్ళు తడిసి..వెల్లి విరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  
ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

చరణం::2 

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే 
అహ అహ..అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే 
అహ అహ..అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ..నీ పాట విని మెరుపులొచ్చి..అహ
నీ విరుపులే..ముడుపు లిచ్చి
చలిని పెంచి..చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ..అహ ఆహ  

ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది..అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ..కొంగుల్ని ముడిపెట్టింది

వేటగాడు--1979



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::జానకి
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట
ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట 
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు..నోచని కోట 
పగిలిన నాగుండెలలో..పగిలిన నాగుండెలలో 
రగులుతున్న రాగం..ఈ పాటా..ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు నోచని..కోట..ఆ ఆ ఆ

చరణం::1

పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు 
చిగురించన మోడులకు నిదురించని గుండెలలో 
చితిపేర్చిన వల్లకాడు..ఈ నాడు..ఊ

కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం 
కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం 
ఇక్కడే..ఏ ఏ ఏ ఏ ఏ ఏ..కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం 

శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే

ఇది మాతృహృదయమే మృత్య నిలయమయి 
ఎగసిన విలయ తరంగం..ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం 

అందుకే..ఏ ఏ ఏ ఏ 
పలుకుతుంది శ్లోకం నా శోకంమూ..ఊ ఊ
ఇది పువ్వులు..పూయని తోట 
ఏ ప్రేమకు నోచని..కోట..ఆ ఆ ఆ