Wednesday, August 11, 2010

గండికోట రహస్యం--1969
సంగీతం::T.V. రాజు
రచన::సినారె
గానం::P.సుశీల  

పల్లవి::

అనురాగ గగనాలలోనా..ఆగింది కన్నీటి వానా 
మెరిసింది ఒక ఇంద్రధనువు..విరిసింది నాలోని అణువు అణువు 

నవ్వెను నాలో జాజిమల్లి..పొంగెను నాలో పాలవెల్లీ 
కళ కళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ

చరణం::1

నా ఆశలు పులకించెనా..ఆ..నా పూజలు ఫలియించెనా 

ఆ పరమేశ్వరి తూపులు నాపై అమృతధారలై కురెసెనా 
అమృతధారలై కురెసెనా 
నవ్వెను నాలో జాజిమల్లి..పొంగెను నాలో పాలవెల్లీ

చరణం::2

ఈ చీకటి విడిపోవునా..ఆ..ఎల వెన్నెల విరబూయునా..ఆ

నవజీవన బృందావనిలోనా నా స్వామి నను చేరునా
నా స్వామి నను చేరునా

నవ్వెను నాలో జాజిమల్లి..పొంగెను నాలో పాలవెల్లీ 
కళ కళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లీ..ఈ..ఈ
నవ్వెను నాలో జాజిమల్లి..పొంగెను నాలో పాలవెల్లీ

గండికోట రహస్యం--1969
సంగీతం::T.V. రాజు
రచన::సినారె
గానం::ఘంటసాల 

పల్లవి::

మరదల పిల్ల ఎగిరిపడకు..గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా..నా గెలుపే నీ గెలుపు కాదా

మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ..ముట్టుకుంటే గుబులౌతుంది

కోడెత్రాచులా వయసుంది..అది కోరుకుంటే దిగులౌతుంది

ఆ కోపంలో భలే అందముంది..ఆ కోపంలో భలే అందముంది

మరదల పిల్ల ఎగిరిపడకు..గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా..నా గెలుపే నీ గెలుపు కాదా

చరణం::2

కసురుకుంటే కవ్విస్తానూ..ఊ..విసురుకుంటే ఉడికిస్తాను

ముక్కు తాడు తగిలిస్తాను..ఆ..మూడుముళ్ళు వేసేస్తాను

ఏనాడైనా నీ వాడ నేను..ఏనాడైనా నీ వాడ నేను