Wednesday, September 14, 2011

పల్లెటూరి బావ--1973
























సంగీతం::T. చలపతిరావు
రచన::D.సినారె
గానం::P.సుశీల, ఘంటసాల 
తారాగణం::అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ

పల్లవి::

ఏయ్..బావయ్యా పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా      
ఏయ్..బావయ్యా, పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా  
హాట్ గా..స్వీట్ గా..ఆడగా..పాడగా
రా..రా..వా
ఏయ్..బావయ్యా పిలక బావయ్య
నీ చిలకమ్మ పిలిచింది రావయ్యా  

చరణం::1

రానా..రానా..నువ్వు రమ్మంటే రాకుండా వుంటానా 
నువ్వు వద్దన్నా నేనూరుకుంటానా..నువ్వు వెయ్యమంటే 
చిందు వెయ్యమంటే వెయ్యకుండా వుంటానా..ఆ..ఆ             
నువ్వు వద్దన్నా నేనూరుకుంటానా..నువ్వు వెయ్యమంటే

ఓ..బుజ్జిబావా అయ్యో నా పిచ్చిబావా
ఓ..బుజ్జిబావా అయ్యో నా పిచ్చిబావా  
రాక్ తెలుసా..షేక్ తెలుసా..రాక్ తెలుసా..షేక్ తెలుసా
కుంబా..సాంబా..కాంగో..మాంగో..గో..గో..బీటు తెలుసా
తైయకు తాధిమితా..మా కోలాటం ముందు..నీ గో గో ఆట బందు
మా చెక్క భజనముందు..నీ షేకు రాకు తలకిందు 
నే డప్పుల డ్యాన్సు చేస్తే..నా పెద్దపులేశంచూస్తే
నే డప్పుల డ్యాన్సు చేస్తే..నా పెద్దపులేశంచూస్తే  
నువ్వు బిత్తరపోతావే పిల్లా..చిత్తయి పోతావే 
నువ్వు రమ్మంటే రాకుండా..వుంటానా
నువ్వు వద్దన్నా..నేనూరుకుంటానా 

చరణం::2

ఓ..బుజ్జిబావ నా పిచ్చి బావ  
ఇకనైనా కత్తిరించు పిలకజుట్టూ 
ఎందుకబ్బా ఇంత నాటు పంచెకట్టూ  
ఇకనైనా కత్తిరించు పిలకజుట్టూ 
ఎందుకబ్బా ఇంత నాటు పంచెకట్టూ 
సూటు వేసుకో..షోకు చేసుకో 
యాసమార్చుకో..ఇంగ్లీషు నేర్చుకో

హ..హ..హ..హ
మా పంచెకట్టులో వున్న సుఖం
మీ యిరుకు ప్యాంటులో వుంటుందా
మా పంచెకట్టులో వున్న సుఖం
మీ యిరుకు ప్యాంటులో వుంటుందా
నా పిలకజుట్టులో వున్న సొంపు
నీ గరికజుట్టులో వుంటుందా 
ఓ బుల్లెమ్మా..చీరకట్టి కాటుకబెట్టి చేమంతులు నీ సిగలో చుట్టి
చీరకట్టి కాటుకబెట్టి చేమంతులు నీ సిగలో చుట్టి
సిరులు పొంగగా తెలుగు పడుచుగా..సిగ్గూ బిడియం నేర్చుకో 
నువ్వు రమ్మంటే రాకుండా వుంటానా
నువ్వు వద్దన్నా నేనూరుకుంటానా
నువ్వు వెయ్యమంటే..చిందు వెయ్యమంటే వెయ్యకుండా వుంటానా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..హా