Saturday, August 04, 2007

మేఘసందేశం--1982
















V - Sigalo Avi Virulo from Gopi Reddy on Vimeo.
చిమ్మటలోని ఈ ఆణిముత్యం మీకోసం వినండి

సంగీతం::రమేష్ నాయుడు

రచన::వేటూరి సుంధరరామమూర్తి
గానం::Yesudas . KJ
Film Directed By::DasariNarayana Rao
అక్కినేని నాగేశ్వరరావు,కొంగర జగ్గయ్య,బాలమురళికృష్ణ,జయసుధ,జయప్రద,సుభాషిని,సలీమ.

పల్లవి::  

సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో..

!! సిగలో అవి విరులో !!

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు
మదిలోనా గదిలోనామదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు2
మరిమరిప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు 2
నీ కనుల ఆ పిలుపులు

!! సిగలో అవి విరులో !!

జరిగి ఇటు వొరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు వొరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడినా
చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు
మరి మరిప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు

!! సిగలో అవి విరులో !!


Megha Sandesam::1982
Music::Ramesh Nayudu
Lyrics::VeturiSundararaammoorti
Singer::K.J.Yesudas
Film Directed By::DasariNarayana Rao
Cast::AkkinEni NaageswaraRao,Jaggayya,baalamuraLikRshNa,jayasudha,jayaprada,subhaaSini,saleema.

::::::::::::::::::::::::::::::

sigalO avi virulO
agaru pogalO attarulO
maguvaa siggu dontaralO
masalE valapu tolakarulO..

!! sigalO avi virulO !!

eduTa naa eduTaa EvO sOyagaala maalikalu
eduTa naa eduTaa EvO sOyagaala maalikalu
madilOnaa gadilOnaa madilOnaa gadilOnaa
mattilina kotta kOrikalu
niluvaneevu naa talapulu
niluvaneevu naa talapulu
marimaripriyaa priyaa
niluvaneevu naa talapulu
niluvaneevu naa talapulu
nee kanula aa pilupulu

!! sigalO avi virulO !!

jarigi iTu vorigi paravaSaana iTulE karigi
jarigi iTu vorigi paravaSaana iTulE karigi
chirunavvula araviDinaa
chiguraaku pedavula marigi
marali raalEvu naa choopulu
mari maripriyaa priyaa
marali raalEvu naa choopulu
madhuvukai medalu tummedalu

!! sigalO avi virulO !!



మేఘసందేశం--1982





సంగీతం::రమేష్ నాయుడు
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::P.సుశీల

Film Directed By::DasariNarayana Rao
అక్కినేని నాగేశ్వరరావు,కొంగర జగ్గయ్య,బాలమురళికృష్ణ,జయసుధ,జయప్రద,
సుభాషిని,సలీమ.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆకులో ఆకునై..పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై..నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా

ఆకులో ఆకునై..పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై..నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా


చరణం::1

గలగలని వీచు..చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు..చిరుగాలిలో కెరటమై
జలజలని పారు..సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు..తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే..చిన్నారి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా

చరణం::2

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి..మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి..మెలమెల్ల

చదులెక్కి జలదంపు..నీలంపు నిగ్గునై
ఆకలా..దాహమా..చింతలా..వంతలా
ఈ తరలీవెర్రినై..ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా 
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే..ఆగిపోనా 

ఆకులో ఆకునై..పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై..నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా..ఆఆఆ..హా..ఆఆ
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

Megha Sandesam::1982
Music::Ramesh Nayudu
Lyrics::Devulapalli Krishna Saastri
Singer::P.Suseela
Film Directed By::DasariNarayana Rao
Cast::AkkinEni NaageswaraRao,Kongara Jaggayya,Baalamuralikrshna,Jayasudha,
Jayaprada,Subhaasini,Saleema.

::::::::::::::::::::::::::::::

aa aa aa aa aa aa aa aa aa aa aa 
aakulO aakunai..poovulO poovunai
kommalO kommanai..nunu lEtaremmanai
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aa
eTulainaa ichaTanE..aagipOnaa

aakulO aakunai..poovulO poovunai
kommalO kommanai..nunu lEtaremmanai
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aa aa
eTulainaa ichaTanE..aagipOnaa


::::1

galagalani veechu..chirugaalilO keraTamai
galagalani veechu..chirugaalilO keraTamai
jalajalani paaru..sela paaTalO tETanai
pagaDaala chiguraaku..terachaaTu chETinai
paruvampu viDichEDE..chinnaari siggunai

ii aDavi daagipOnaa..aaaaaa..haa..aaaa
eTulainaa ichaTanE..aagipOnaa
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aaaa
eTulainaa ichaTanE..aagipOnaa

::::2

tarulekki elaneeli girinekki..melamella
tarulekki elaneeli girinekki..melamella

chadulekki jaladampu..neelampu niggunai
aakalaa..daahamaa..chintalaa..vantalaa
ii taraleeverrinai..Ekatamaa tirugaaDaa
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aaaa
eTulainaa ichaTanE..aagipOnaa 
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aaaa
eTulainaa ichaTanE..aagipOnaa 

aakulO aakunai..poovulO poovunai
kommalO kommanai..nunu lEtaremmanai
ii aDavi daagipOnaa..aaaaaa..haa..aaaa
eTulainaa ichaTanE..aagipOnaa
eTulainaa ichaTanE..aagipOnaa 

మేఘసందేశం--1982::రాగం::శివరంజని

చిమ్మటలోని ఈ ఆణిముత్యం మీకోసం వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::
జేసుదాస్

Film DirectedBy::DasarinarayanaRaoరాగం::శివరంజని!!
కర్నాటక హిందుస్తాని !!


ఆకాశ దేశానఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా

!! ఆకాశ దేశాన !!


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

!! ఆకాశ దేశాన !!

మేఘసందేశం--1982::రాగం::సింధు బైరవి

చిమ్మటలోని మరో ఆణిముత్యం మీకోసం వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
రచన::వేటూరి
గానం::P.సుశీల

రాగం::సింధు బైరవి
(నటబైరవి చాయలు కలది )

నిన్నటిదాకా శిలనైనా నీ
పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా

!!నిన్నటిదాకా శిలనైనా!!

సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు
మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు
మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

!!నిన్నటిదాకా శిలనైనా!!

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు
నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు
నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల