Tuesday, September 08, 2009

జగమే మాయ--1973



















సంగీతం::సత్యం
రచన::D.C. నారాయణరెడ్డి
గానం::S. జానకి
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 
Murali Mohan First film::Jagame Maya

పల్లవి::

ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ 

చరణం::1
     
మృత్యువునై ప్రతినిత్యం..నిను వెంటాడుతు వున్నాను  
పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే
ఇక చూసుకో..నను తెలుసుకో నేనే..నేనే..నేనే 
    
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ
   
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి  
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ

చరణం::2

కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను
మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను
కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను
ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే  
   
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి  
ఆ....ఆ....ఆ  

చరణం::3

పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే
మనుషుల రక్తం మరిగిన..ఆ రక్కసి జాతి నీదే
చీకటి మాటున చేసిన పాపం..చీల్చివేయును నిన్నె
ఇక చూసుకో..నను తెలుసుకో..నేనే..నేనే..నేనే
              
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ  అ..ఆ ఆ ఆ ఆ ఆ అ 
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ  అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ

చరణం::4

కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను
మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను
కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను
ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే  

ఇంటిదొంగలు--1973




సంగీతం::S. P. కోదండపాణి
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య

పల్లవి::

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా..ఓ

చరణం::1

తండ్రిమాట..మీరకే
అయొధ్యను..వదిలేశావు 
అడుగడుగున..ఎన్నెన్నోకష్టాలు భరించావు
తండ్రికి అన్నం బెట్టని..తనయులున్నరు  
చూడు లోకం తీరూ..రామా        

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::2

ఆనాడు..ప్రజావాక్య మాలకించి సీతనడవి కంపావు
మచ్చలేని సూర్యవంశ..మర్యాదను నిలిపావు
ఈనాడు..ప్రజలు జుట్టుబట్టీడ్చిన.కదలకున్నారూ
పదవులు వదలకున్నారూ..రామయ్యా           

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::3

అన్నమో రామచంద్ర..అనువారే లేరపుడూ
అలో లక్ష్మణా అన్న గోల..వినపడ లే దెప్పుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
యీ వెత తీరే దెపుడు..రామా                 

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::4

దుష్టుల శిక్షించే..ఆ దొరవు నీవులే
ధర్మము స్థాపించే..శ్రీహరివి నీవులే
నీ అవతారం రావలసిన..అవసరముందీ
తగిన సమయమే ఇది..రామయ్యా              

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

ఇంటిదొంగలు--1973
















సంగీతం::S.P. కోదండపాణి
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య

పల్లవి::

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

చరణం::1

టిప్పుటాపుగా డ్రస్సు వేసుకొని
టైటు పాంటుతో..నువ్వొస్తుంటే 
హ హ హ ఆ ఆ..
టిప్పుటాపుగా డ్రస్సు వేసుకొని
టైటు పాంటుతో..నువ్వొస్తుంటే
పొలంగట్టుపై..పొయ్యేవాళ్ళు 
బిత్తరపోయి..చూస్తూవుంటే
వారేవా..అమ్మాయో అబ్బాయో తెలియక
అయోమయంలో పడ్డాను..ఇప్పుడే తెలుసుకున్నాను        

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

చరణం::1

నాజూకుగ నువ్ నడుస్తూవుంటే..నవ్వు ఆగనంటున్నదీ
అహా అహా..నీ ఎర్రని పెదవులు కదులుతువుంటె
మనసు లాగుతు వున్నదీ..నా మనసు లాగుతు వున్నదీ
ఏమండీ అమ్మాయిగారూ..ఎగురుకుంటు పోతున్నారూ
నిలిచి కాస్త మాటాడమ్మా..నోటి ముత్యాలు రాలవమ్మా        

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

గంగ-మంగ--1973
























సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ 

పల్లవి::

హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే 
మందొక్కటే మందురా..ఇది మించి ఏముందిరా 
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే 
మందొక్కటే..మందురా   

చరణం::1

అన్ని చింతలూ మరపించేది..ఎన్నో వింతలు చూపించేది  
అన్ని చింతలూ మరపించేది..ఎన్నో వింతలు చూపించేది  
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ..ఏది మందొక్కటే మందురా         

చరణం::2

జీవితమెంతో చిన్నదిరా..ప్రతి నిమిషం విలువైనదిరా 
జీవితమెంతో చిన్నదిరా..ప్రతి నిమిషం విలువైనదిరా 
నిన్నా రేపని తన్నుకోకురా ఉన్నది నేడే మరువబోకుర 
అహ అహ అహా..ఆ   
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే 
మందొక్కటే మందురా 

చరణం::3

ఇల్లు వాకిలి లేనివాడికి..రహదారే ఒక రాజమహలురా 
ఇల్లు వాకిలి లేనివాడికి..రహదారే ఒక రాజమహలురా
తోడూ నీడా లేని వాడికి..మ్మ్ చొ చొ..తోకాడించే నీవే తోడురా    
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే 
మందొక్కటే మందురా..ఇది మించి ఏముందిరా
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే 

  

గంగ-మంగ--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ 

పల్లవి::

నేను తాగాను..బాగా నేను తాగాను..తాగాను  
భలే నిశాలో వున్నాను..వున్నాను..తాగాను..నేను తాగాను 
   
చరణం::1
  
{మాంగల్యం తంతునానే నమః మవజీవన హేతునాం 
కంటే పద్మాభి శుభతే సంజీవ శరదాం శతం}

కైపులో వున్నాను కలలు కంటున్నాను 
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను 
మదిలోని వేదన మరువలేకున్నాను
మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను 
వెత తీర్చ వచ్చాను..వలపులో పడ్డాను 
నే నెవ్వరో నేనే..చెప్పలేకున్నాను
తాగాను నేను తాగాను బాగా నేను తాగాను తాగాను    

చరణం::2

కోటి తారలు నిన్నే కోరుకుంటాయి 
అందాలు చందాలు అందజేస్తాయి 
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి 
అందాలు చందాలు అందజేస్తాయి 
మ్మ్ హూ మ్మ్ హూ 
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను 
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను మరచి పొమ్మంటాను
  

గంగ-మంగ--1973






























సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::రామకృష్ణ,P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ .

పల్లవి::

హ్హా హా హా..అరెరెరెరె పిపిపిపిపి..
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో 
సాగి పోదామా తెలిమబ్బు జంటలై 
వలపు పంటలై
పొదామా సాగి పోదామా 
పొదామా సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో 
నీలి నింగిలో 
ఎగిరిపోదామా అందాల హంసలై 
రాజ హంసలై 
పోదామా ఎగిరి పోదామా 
పోదామా ఎగిరి పోదామా

చరణం::1

వెనుదిరిగి చూసే పనిలేదు మనకు 
దూరాలు తీరాలు చేరాలి మనము 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు 
దూరాలు తీరాలు చేరాలి మనము 
జతచేరి దూకే సేలయేళ్లలాగా 
లేల్లలాగా మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా 
లేల్లలాగా మునుముందుకేగాలి మనము 
నీకు నేను తోడుగా 
నేను నీకు నీడగా 
ఈ బాట మన బ్రతుకు బాటగా 
పూల బాటగా హాయిగా సాగి పోదామా
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా      

చరణం::2

అనురాగ లతలే పెనవేసె మనను 
ఏనాడు విడిపోదు మన ప్రేమ బంధం 
అనురాగ లతలే పెనవేసె మనను 
ఏనాడు విడిపోదు మన ప్రేమ బంధం 
అందాలు చిందే నీ లేతమోము 
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము 
నా కంటి పాపలో నిలవాలి నిరతం
చేయి చేయి చేరగా 
మేను హాయి కోరగా 
నీ మాట నా మనసు మాటగా 
వలపు బాటగా జంటగా సాగి పోదామా 
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా 
పోదామా ఎగిరి పోదామా