Monday, December 26, 2011

ముత్యమంతాముద్దు--1989



సంగీతం::హంసలేఖ
రచన::వేటూరి
గానం::S.P.బాలు 
తారాగణం::రాజేంద్రప్రసాద్,సీత,

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
నీ అందమే నాకు ఆలాపనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

చరణం::1

చిరునవ్వే చేమంతిగా విరజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు
బాలా..శృంగార..మాలా
అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా
కలలను పరచీ హృదయాన్నే కలవర పరచావూ
భామా..రాశాడే బ్రహ్మా..నీ కోసమే తీపి ఆవేదనా
ఐ లవ్ యు ,ఐ లవ్ యు, ఐ లవ్ యు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా

చరణం::2

హరివిల్లు అందాలతో ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లే గుండెల్లో అలజడి పెంచావూ
ప్రేమే నాకున్న ధీమా..ఆ
రవివర్మ చిత్రానివో నవ హంపీ శిల్పానివో
మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ
గుమ్మా..ఓ బాపు బొమ్మా..ఈ గీతమే నీకు ఆరాధనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు