Thursday, January 28, 2010

మంచిమనుషులు--1974

సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP. బాలు,P. సుశీల


విను నా మాటా విన్నావంటే
జీవితమంతా పూవుల బాట..2

ఎన్నడు నీవు ఏడవకూ
కన్నుల నీరు రానీకూ..2
కష్టలందూ నవ్వాలీ
కళకళ ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ..ఇంటికి వెలుగూ
ఆరని జ్యోతి నువ్వే నువ్వే
విను నా మాటా విన్నావంటే
జీవితమంతా పూవుల బాట

బిడ్డలు ముద్దుగ పెరగాలీ
పెద్దల ముచ్చట తీర్చాలీ..2
ఆటలు హాయిగ ఆడాలీ
చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ..ఊరికిపేరూ
తెచ్చేవాడివి నువ్వే నువ్వే..
విను నా మాటా విన్నావంటే
జీవితమంతా పూవుల బాట

తల్లీ తండ్రీ ఒకరైనా
దైవ సమానం తల్లిసుమా..2
జీవిస్తుందీ మీ అమ్మా..
దేవునిలాగే కనబడకా
చల్లని మనసూ..తీయని మమతా
చక్కని బ్రతుకూ నీదే నీదే..

ఇది నీ మాటా విన్నానంటే
జీవితమంతా పూవుల బాట
ఇది నీ మాటా విన్నానంటే
జీవితమంతా పూవుల బా