సంగీతం::పెండ్యాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::పి.లీల,రత్నం,బృందం
Directed by::Kamalakara Kameswara Rao
తారాగణం::A.N.R. S.V.రంగారావు,రేలంగి,శ్రీరంజని,రాజసులోచన,C.S.R.సంధ్య,వాసంతి.
పల్లవి::
శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యంవ్రత..నీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ
చరణం::1
నీ కృపా కటాక్షములే..సకల శుభములొసగగా
నీ కృపా కటాక్షములే..సకల శుభములొసగగా
ఇహ పరముల కాధారము..మహాలక్ష్మి నీవేగా
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
చరణం::2
నీ వీణా నాదములో..వేదములే పలుకగా
నీ వీణా నాదములో..వేదములే పలుకగా
జటజగములు మేలు కొలుపు..మహావాణి నీవెగా
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
చరణం::3
నీవిజయ విహారములే..లోక రక్షలౌనుగా ఆఅఆఆఆఆ
నీవిజయ విహారములే..లోక రక్షలౌనుగా
అభయమొసగి భువనమేలు..మహాకాళి నీవెగా
శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యంవ్రత..నీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన..నీదే జగదీశ్వరీ